Ankita Bhandari Murder Case: రిసార్టు రిసెప్షనిస్ట్ హత్య కేసులో కీలక విషయాలు వెలుగులోకొచ్చాయి. ఉత్తరాఖండ్‌లో కలకలం రేపిన ఈ హత్య కేసుకు సంబంధించి ఇప్పటికే బీజేపీ నాయకుడు వినోద్ ఆర్య కుమారుడు, రిసార్టు యజమాని పులకిత్ ఆర్య, ఇతర సిబ్బందిని పోలీసులు అరెస్టు చేశారు. సదరు యువతి రిసార్టుకు వచ్చే గెస్టులకు ప్రత్యేక సేవలు అందించేందుకు నిరాకరించడం వల్లే వారు ఈ హత్యకు పాల్పడినట్లు డీజీపీ అశోక్ కుమార్ వెల్లడించారు. యువతి తన స్నేహితుడితో జరిపిన వాట్సప్ చాటింగ్ ఆధారంగా ఈ విషయం వెలుగులోకి వచ్చిందని ఆదివారం (సెప్టెంబర్ 25) ఆయన మీడియాకు తెలిపారు.
పోలీసుల విచారణలో మృతురాలి మొబైల్ వాట్సప్ చాట్ ఆధారంగా కీలక విషయాలు వెల్లడయ్యాయి. ఈ చాట్‌లో.. గెస్టులకు ‘ప్రత్యేక సేవలు’ అందించవల్సిందిగా వనతారా రిసార్టు యజమాని పులకిత్ ఆర్య తనను ఫోర్స్ చేస్తున్నట్లు అంకిత తన స్నేహితుడికి తెల్పింది. అందుకు ఆమె నిరాకరించడంతో ఈ హత్యకు పాల్పడినట్లు వివరాలను బట్టి తెలుస్తోంది. రాత్రి 8 గంటల 30 నిముషాల తర్వాత ఆమెకు ఎన్నిసార్లు ఫోన్ చేసినా కలవలేదని, తర్వాత పులకిత్ ఆర్యకు ఫోన్ చేస్తే.. ఆమె తన గదికి వెళ్లిపోయినట్లు అతడు సమాధానమిచ్చాడు. తర్వాత రోజు అతనికి మళ్లీ ఫోన్ చేస్తే స్విచ్ఛాఫ్ అని వచ్చినట్లు అంకిత స్నేహితుడు తెలిపాడు. దీంతో అతను రిసార్టు యజమాని సోదరుడు అంకిత్ ఆర్యకు ఫోన్ చేస్తే.. ఆమె జిమ్‌లో ఉన్నట్లు బదులిచ్చాడని తెలిపాడు.
ఐతే సెప్టెంబర్ 17న అంకిత భండారి ఏడుస్తూ తనకు ఫోన్ చేసి, రిసార్ట్ నుంచి తన బ్యాగ్‌ను బయటకు తీసుకురావ్సలిందిగా కోరినట్లు రిసార్ట్‌కు చెందిన ఓ ఉద్యోగి తెలిపాడు. అదే రోజు అంకితను చివరి సారిగా తాను అంకితను మరో ముగ్గురు వ్యక్తులతో మధ్యాహ్నం 3 గంటలకు చూశానని, ఆ తర్వాత అంకిత తప్ప మిగిలిన వారు మాత్రమే తిరిగి రిసార్టుకు వచ్చారని తెలిపాడు. యజమాని పుల్కిత్ ఆర్య సోదరుడు అంకిత్ ఆర్య సెప్టెంబర్ 18 ఉదయం 8 గంటలకు వచ్చి నలుగురికి డిన్నర్ ఏర్పాటు చేయమని కోరినట్లు తెలిపాడు. అంకితను మాత్రం ఆ ముందు రోజు నుంచే చూడలేదని రిసార్టుకు చెందిన ఓ ఉద్యోగి తెలిపాడు. తన కుమార్తెను వేధింపులకు గురిచేశారని ఇదివరకు ఆమె తండ్రి కూడా ఆరోపించారు. ఈ విషయంపై ఉత్తరాఖండ్ రాష్ట్ర వ్యాప్తంగా పలువురు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. స్థానికులు రిసార్టుకు నిప్పు పెట్టి, ధ్వంసం చేశారు.
#AnkitaBhandari murder case: I got a call from #AnkitArya at 8pm to prepare dinner for 4 people. Around 10:45pm he came & told us that he’ll take dinner to Ankita’s room, to which I said our service boy will do that, but he didn’t agree, says Resort staffer Manveer Chauhan. (ANI) pic.twitter.com/eKKqurAlkg
— TOI Cities (@TOICitiesNews) September 24, 2022
కాగా రిషికేశ్ సమీపంలో వనతారా రిసార్టులో రిసెప్షనిస్ట్‌గా పనిచేస్తోన్న 19 ఏళ్ల అంకిత భండారి అనే యువతి సెప్టెంబర్ 18 నుంచి కనిపించకుండా పోయింది. కొన్ని రోజుల తర్వాత రిసార్టుకు సమీపంలోని కాలువ వద్ద యువతి మృతదేహం లభ్యమైంది. విచారణలో రిసార్టు యజమాని పులకిత్ ఆర్య, ఇతర సిబ్బందిని నిందితులుగా తేలడంతో పోలీసులు శనివారం వారిని అరెస్టు, జ్యుడిషియల్ కస్టడీకి తరలించారు. ఇక ఈ ఘటనపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి తీవ్రంగా స్పందించారు. నిందితులు ఎవరైనా ఉపేక్షించేది లేదని అన్నారు.అలాగే ఈ ఘటనను భాజపా కూడా తీవ్రంగా తీసుకుంది. నిందితుడి తండ్రి వినోద్ ఆర్య, సోదరుడు అంకిత్ ఆర్యను పార్టీ నుంచి బహిష్కరించింది. మరోవైపు ఈ ఘటనపై బీజేపీ కూడా తీవ్రంగా స్పందించింది. నిందితు పులకిత్ ఆర్య తండ్రి వినోద్ ఆర్య, సోదరుడు అంకిత్ ఆర్యను తక్షణమే పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్లు ప్రకటించింది. ఈ ఘటనలో పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.