National Games: డెహ్రాడూన్‌లో అట్టహాసంగా 38వ నేషనల్‌గేమ్స్‌.. ప్రారంభించిన ప్రధాని మోదీ

ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్‌లో 38వ నేషనల్‌ గేమ్స్‌ అంగరంగా వైభవంగా ప్రారంభమయ్యాయి. భారత ప్రధానమంత్రి నరంద్ర మోదీ జాతీయ క్రీడలను ప్రారంభించారు. క్రీడల ప్రారంభోత్సవం కన్నుల పండువగా జరిగింది. కళాకారుల విన్యాసాలు అందరిని ఆకట్టుకున్నాయి. 28 రాష్ట్రాల నుంచి 10,000 మందికి పైగా అథ్లెట్లు పోటీలో పాల్గొంటున్నారు.

National Games: డెహ్రాడూన్‌లో అట్టహాసంగా 38వ నేషనల్‌గేమ్స్‌.. ప్రారంభించిన ప్రధాని మోదీ
Pm Modi National Games

Updated on: Jan 28, 2025 | 7:33 PM

ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్‌లో 38వ నేషనల్‌ గేమ్స్‌ అంగరంగా వైభవంగా ప్రారంభమయ్యాయి. భారత ప్రధానమంత్రి నరంద్ర మోదీ జాతీయ క్రీడలను ప్రారంభించారు. అట్టహాసంగా ప్రారంభమైన ఈ కార్యక్రమానికి ఉత్తరాఖండ్‌ ముఖ్యమంత్రి పుష్కర్‌ సింగ్‌ ధామి హాజరయ్యారు. ఉత్తరాఖండ్‌ తొలిసారి నేషనల్‌ గేమ్స్‌ను నిర్వహిస్తోంది. ఫిబ్రవరి 14 వరకు ఈ క్రీడలు కొనసాగుతాయి. వివిధ రాష్ట్రాల నుంచి 10 వేల మంది క్రీడాకారులు హాజరవుతున్నారు.

మంగళవారం(జనవరి 28) ఉత్తరాఖండ్‌లో 38వ జాతీయ క్రీడల ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. గ్రీన్‌ గేమ్స్‌ థీమ్‌తో జాతీయ క్రీడలను నిర్వహిస్తున్నారు. గేమ్స్‌ విలేజ్‌ బయట 10 వేల మొక్కలను క్రీడాకారులు నాటారు. 35 విభాగాల్లో ఈ క్రీడలను నిర్వహిస్తున్నారు. నేషనల్‌ గేమ్స్‌లో తొలిసారి యోగా పోటీలను నిర్వహిస్తున్నారు. జాతీయ క్రీడలను ప్రారంభించారు ప్రధాని మోదీ. తమ ప్రభుత్వం క్రీడలకు ఎంతో ప్రాధాన్యత ఇస్తుందన్నారు. భారత్‌ తప్పకుండా 2036 నాటికి ఒలింపిక్స్‌ను నిర్వహిస్తుందన్నారు మోదీ. 28 రాష్ట్రాలకు చెందిన క్రీడాకారులు జాతీయ క్రీడల్లో పాల్గొంటున్నారు.

అంతకుముందు ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్ర మోదీ రాజీవ్ గాంధీ క్రికెట్ స్టేడియం చేరుకున్నారు. ప్రధాని మోదీ ప్రత్యేకంగా రూపొందించిన రథంపై స్టేడియంలోకి ప్రవేశించారు. ఈ వేదికపై ప్రధాని మోదీతో పాటు ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి, కేంద్ర క్రీడల శాఖ సహాయ మంత్రి రక్షా ఖడ్సే, అసెంబ్లీ స్పీకర్ రీతూ ఖండూరి, పీటీ ఉష తదితరులు హాజరయ్యారు. సీఎం ధామి కూడా ప్రధానికి పుష్పగుచ్ఛం, టోపీ, శాలువా, అంగవస్త్రం అందజేశారు. అంతకుముందు, ప్రధాని మోదీ ఆటగాళ్లు లక్ష్యసేన్, మనీష్ రావత్, జస్పాల్ రాణా, సురేంద్ర కన్వాసి, హంసా మన్రాల్, హితేంద్ర రావత్, సుభాష్ రాణా, మనోజ్ సర్కార్‌లను కూడా కలిశారు.

క్రీడల ప్రారంభోత్సవం కన్నుల పండువగా జరిగింది. కళాకారుల విన్యాసాలు అందరిని ఆకట్టుకున్నాయి. 43కి పైగా వివిధ క్రీడా విభాగాల్లో 28 రాష్ట్రాల నుంచి అథ్లెట్లు పాల్గొంటున్నారు. దేశవ్యాప్తంగా 10,000 మందికి పైగా అథ్లెట్లు పోటీలో పాల్గొంటున్నారు. వీరిలో 49 శాతం మంది మహిళలు. రాష్ట్ర జట్లతో పాటు, ఇండియన్ ఆర్మ్‌డ్ ఫోర్సెస్, సర్వీసెస్‌కు చెందిన క్రీడా జట్లు కూడా జాతీయ క్రీడల్లో పాల్గొంటాయి. గత నాలుగు ఎడిషన్‌లలో సర్వీసెస్ విజేతలుగా నిలిచింది. ఫిబ్రవరి 14 వరకు నేషనల్‌ గేమ్స్‌ కొనసాగుతాయి. దేశంలోని అత్యుత్తమ క్రీడాకారులను, అథ్లెట్లను వెలుగులోకి తెచ్చే ప్రయత్నమే ‘నేషనల్ గేమ్స్’.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..