ఉత్తరాఖండ్ లో దశలవారీగా చార్ ధామ్ యాత్రను, టూరిజాన్ని పునరుద్ధరించాలని బీజేపీ నేత, మాజీ ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్ రావత్.. ప్రస్తుత సీఎం తీరథ్ సింగ్ రావత్ కు లేఖ రాశారు.. దీనివల్ల రాష్ట్రంలో టూరిజంపై ఆధారపడి జీవిస్తున్న ఎంతోమందికి మళ్ళీ ఉపాధి లభిస్తుందని ఆయన అన్నారు. చార్ ధామ్ యాత్రకు వచ్చే వారందరికీ =వ్యాక్సినేషన్ చేయించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. ఇక టూరిజం రంగాన్ని పునరుద్ధరించడం వల్ల రాష్ట్ర ఆదాయం కూడా పెరుగుతుందన్నారు. కోవిద్ కారణంగా హరిద్వార్ కుంభ్ మేళాను అర్ధాంతరంగా నిలిపివేయాల్సి వచ్చిందని త్రివేంద్ర సింగ్ రావత్ గుర్తు చేశారు. అనేకమంది భక్తులు, యాత్రికులు అప్పట్లో కోవిద్ కి గురయ్యారన్నారు. రాష్ట్రంలో కోవిద్ కేసులు తగ్గుముఖం పడుతున్న తరుణంలో ముఖ్యంగా చార్ ధామ్ యాత్రను దశలవారీగా అనుమతించే విషయాన్నీ పరిశీలించాలన్నారు. దీనిపై తీరథ్ సింగ్ రావత్.. అధికారులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు.
కాగా ఆంక్షలు అమలులో ఉన్నపటికీ లోగడ రాష్ట్ర టూరిజం మంత్రి స్వయంగా కొంతమంది అనుయాయులతో చార్ ధామ్ యాత్రకు వచ్చారు. దీనిపై అక్కడి పూజారులు, పురోహితులే తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రజలకు బుద్ధి చెప్పాల్సినమీరే నిబంధనలను అతిక్రమిస్తున్నారని వారు దాదాపు మందలించినఙ్గత పని చేశారు. ఉత్తరాఖండ్ లో పప్రస్తుతం వాతావరణం బాగా ఉందన్న విషయాన్నీ కూడా త్రివేంద్ర సింగ్ రావత్ గుర్తు చేశారు.
మరిన్ని ఇక్కడ చూడండి: నవ్వులు పూయిస్తున్న ఏనుగు వింత చేష్టలు..నీరు త్రాగేందుకు కూడా సోమరితనాన్ని ప్రదర్శిస్తున్న గజరాజు..:Elephant Viral Video