చమోలిలో ఆకస్మిక వరదలు.. థరాలి ప్రాంతం అతలాకుతలం.. ఇద్దరు గల్లంతు..!

ఉత్తరాఖండ్‌లోని చమోలి జిల్లా థరాలీ గ్రామాన్ని మెరుపు వరద మరోసారి తుడిచిపెట్టేసింది. కళ్లు మూసి తెరిచే లోపల గ్రామంపై జల ప్రళయం విరుచుకుపడింది. అంతెత్తున ఫ్లాష్‌ ఫ్లడ్‌ విరుచుకుపడడంతో చూస్తుండగానే గ్రామానికి గ్రామం గల్లంతయిపోయింది. వ‌ర‌ద ప్రవాహంతో గ్రామం మొత్తాన్ని మట్టితో కూడిన బుర‌ద‌ నీరు ముంచెత్తింది. హోటళ్ళు, రహదారులు, ఇండ్లు కొట్టుకుపోయాయి. ఎన్నో ఇళ్లు కుప్పకూలిపోయాయి.

చమోలిలో ఆకస్మిక వరదలు.. థరాలి ప్రాంతం అతలాకుతలం.. ఇద్దరు గల్లంతు..!
Uttarakhand Cloudburst

Updated on: Aug 23, 2025 | 9:08 AM

ఉత్తరాఖండ్‌లోని చమోలి జిల్లా థరాలీ గ్రామాన్ని మెరుపు వరద మరోసారి తుడిచిపెట్టేసింది. కళ్లు మూసి తెరిచే లోపల గ్రామంపై జల ప్రళయం విరుచుకుపడింది. అంతెత్తున ఫ్లాష్‌ ఫ్లడ్‌ విరుచుకుపడడంతో చూస్తుండగానే గ్రామానికి గ్రామం గల్లంతయిపోయింది. వ‌ర‌ద ప్రవాహంతో గ్రామం మొత్తాన్ని మట్టితో కూడిన బుర‌ద‌ నీరు ముంచెత్తింది. హోటళ్ళు, రహదారులు, ఇండ్లు కొట్టుకుపోయాయి. ఎన్నో ఇళ్లు కుప్పకూలిపోయాయి. శిథిలాల కింద చిక్కుకున్నవారిని బయటికి తీయడానికి సహాయక బృందాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి.

ఉత్తరాఖండ్‌లో ఎడతెరిపిలేని వర్షాలు చమోలి జిల్లాలోని థరాలిలో క్లౌడ్‌బస్టర్స్‌కు దారితీశాయి. ఇది స్థానికులను తీవ్ర భయాందోళనకు గురిచేసింది. ఈ సంఘటన తర్వాత ఒకరు కనిపించకుండా పోయారని, మరో 20 ఏళ్ల బాలిక శిథిలాల కింద చిక్కుకుపోయి ఉండవచ్చని భావిస్తున్నారు. క్లౌడ్‌బస్టర్స్‌ తర్వాత స్థానికులు తమ ఇళ్లను వదిలి వెళ్ళవలసి వచ్చింది. సంఘటనాస్థలం సహాయక చర్యలు కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు. ఎస్‌డిఎం నివాసంతో సహా అనేక ఇళ్లు క్లౌడ్‌బస్టర్స్‌ కారణంగా తీవ్రంగా దెబ్బతిన్నాయని అధికారులు పేర్కొన్నారు.

“శుక్రవారం(ఆగస్టు 22) రాత్రి చమోలిలోని థరాలి తహసీల్‌లో సంభవించిన మేఘాల విస్ఫోటనం కారణంగా చాలా నష్టం జరిగే అవకాశం ఉంది. మేఘాల విస్ఫోటనం కారణంగా చాలా శిథిలాలు వచ్చాయి. దీని కారణంగా SDM నివాసం సహా అనేక ఇళ్లు పూర్తిగా దెబ్బతిన్నాయి” అని చమోలి DM సందీప్ తివారీ చెప్పారు. రోడ్డు దిగ్బంధించడంతో ప్రయాణికులకు అసౌకర్యం కలిగిందని చమోలి ఏడీఎం వివేక్ ప్రకాష్ పేర్కొన్నారు.

ఆకస్మిక వరదల కారణంగా భారీ నష్టం వాటిల్లింది. కవిత అనే 20 ఏళ్ల మహిళ సమాధి అయ్యింది. జోషి అనే వ్యక్తి కనిపించకుండా పోయాడు. భారీ వరదల కారణంగా రోడ్డు మూసుకుపోయింది. ప్రజలు చాలా సమస్యలను ఎదుర్కొంటున్నారు. అధికారులు సహాయక చర్యల్లో నిమగ్నమైయ్యారు. NDRF, SDRF బృందాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. కాగా బాధితులకు ప్రత్యేక సహాయ శిబిరాలను ఏర్పాటు చేసామని అధికారులు తెలిపారు. జిల్లా మేజిస్ట్రేట్ తెల్లవారుజామున బయలుదేరి సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అక్కడ సహాయక చర్యలు కొనసాగుతున్నాయని చమోలి ఏడీఎం వివేక్ ప్రకాష్ తెలిపారు.

ఉత్తరాఖండ్‌ రాష్ట్రాన్ని గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. ఉత్తరకాశీ జిల్లాను వరద చుట్టుముట్టింది. ఇటీవల క్లౌడ్‌బరస్ట్‌ కారణంగా కుండపోత వర్షం కురిసింది. ఈ వర్షానికి ఖీర్‌ గంగా నది ఒక్కసారిగా ధరాలీ గ్రామంపై విరుచుకుపడింది. భారీగా కొండచరియలు విరిగిపడ్డాయి. వరద ప్రవాహం ధరాలీ గ్రామాన్ని ముంచెత్తడంతో వందలాది ఇళ్లు ధ్వంసమయ్యాయి. ఊహించని జలప్రళయంతో ప్రజలు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని పరుగులు తీశారు. ఈ విపత్తులో దాదాపు 70 మంది గల్లంతయ్యారు. నలుగురు మృతిచెందారు. సమాచారం అందుకున్న ఆర్మీ, ఎస్డీఆర్‌ఎఫ్‌, ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు రంగంలోకి దిగాయి.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..