హాస్పిటల్‌కు తీసుకెళ్లకుండా ఇంట్లోనే భార్యకు ప్రసవం.. భర్తకు ఊహించని షాక్.. అసలు ఏం జరిగిందంటే?
ఇంట్లో ప్రగ్నెంట్ లేడీస్ ఉండి వాళ్లకు సడెన్‌గా పురిటినొప్పులు వస్తే ఏం చేస్తాం.. వెంటనే హాస్పిటల్‌కు తరలించింది వైద్య చికిత్స అందిస్తాం.. కానీ ఇక్కడో భర్త మాత్రం దానికి బిన్నంగా ఆలోచించాడు. పురిటి నొప్పులతో బాధపడుతున్న భార్యను హాస్పిటల్‌కు తీసుకెళ్లకుండా తానే ఇంట్లో స్వయంగా ఆమెకు ప్రసవం చేశాడు. అయితే ఇక్కడ ట్విస్ట్ ఉంది.. అదేంటో తెలుసుకుందాం పదండి.

ఇంటర్నెట్, యూట్యూబ్ వంటికి అందుబాటులోకి వచ్చాక చాలా మంది ప్రతి విషయాన్ని అన్‌లైన్‌లో చూసి చేర్చుకోవడం స్టార్ట్ చేశారు. కొంతమంది యూట్యూబ్‌లో చూసి, దొంగతనాలు, మర్డర్స్ ఎలా చేయాలో నేర్చుకుంటే.. మరికొంత మంది అదే యూట్యూబ్ చూసి వైద్య చికిత్సలు చేస్తున్నారు. మరికొంత మంది పోన్ ద్వారా వీడియో కాల్‌లో నిపుణుల సలహా తీసుకొని వైద్య చికిత్సలు చేస్తున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే తమిళనాడు రాష్ట్రం దిండిగల్లు జిల్లా గోపాల్‌పట్టి వెలుగు చూసింది. ఒక వ్యక్తి పురిటి నొప్పులతో బాధపడుతున్న తన భార్యను హాస్పిటల్‌కు తీసుకెళ్లకుండా తానే ఇంట్లో వైద్యుడితో వీడియో కాల్ మాట్లాడుతూ ఆమెకు స్వయంగా తానే ప్రసవం చేశాడు. ప్రస్తుతం తల్లి, బిడ్డ క్షేమంగా ఉన్నారు.
వివరాల్లోకి వెళ్తే.. తూత్తుక్కుడి జిల్లా తిరుచెందూర్‌కు చెందిన గజేంద్రన్ అనే వ్యక్తి తన భార్య సత్యతో కలిసి దిండిగల్లు జిల్లా గోపాల్‌పట్టి ఎల్లైనగర్‌లోని నివాసం ఉంటున్నారు. గజేంద్రన్ ఒక బ్యాంక్ మేనేజర్‌గా పనిచేస్తుండగా, అతని భార్య ఇంట్లోనే ఉంటుంది. ఆమె ప్రస్తుతం గర్భవతిగా ఉంది. ఈ క్రమంలో గురువారం మధ్యాహ్నం ఆమెకు సెడన్‌గా పురిటినొప్పులు రావడం స్టార్ట్ అయ్యాయి. అయితే విషయం తెలుసుకున్న గజేంద్రన్ భార్యను వెంటనే ఆసుపత్రిలో చేర్చకుండా ఇంట్లోనే ఉంచాడు. స్థానికులకు విషయం తెలిసి వద్దని చెప్పినా వినలేదు.ఇంట్లోకి ఎవరూ రాకుండా తలుపులు క్లోజ్ చేశాడు.
అయితే అతను ఇంట్లోకి వెళ్లిన కొద్ద సేపటి తర్వాత ఇంట్లో నుంచి బిడ్డ ఏడుస్తున్న శబ్ధం వినిపిందిచింది. ఆ తర్వాత గజేంద్రన్ వచ్చి తలుపు తెరవడంతో స్థానికుల సమాచారంతో అప్పటికే అక్కడికి చేరుకున్న వైద్యులు ఇంట్లోకి వెళ్లి చూశారు. అక్కడ ఆతను భార్య ఒక ఆడబిడ్డకు జన్మనిచ్చినట్టు గమనించారు. వెంటనే వాళ్లను పరీక్షించిన వైద్యులు తల్లి, బిడ్డ క్షేమంగా ఉన్నట్టు తెలిపారు. ఈ విషయంపై గజేంద్రను నిలదీయగా.. వీడియో కాల్ ద్వారా వైద్య నిపుణుడితో మాట్లాడుతూ తానే ప్రసవం చేసినట్టు అతను చెప్పుకొచ్చాడు. దీంతో అతనిపై చర్యలు తీసుకోవాలని ఆరోగ్య శాఖ అధికారులు జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




