పోలీసుల ముందు అత్తమామలను బెదిరించాలనుకుంది.. కానీ, ఆమే కాలిబూడిదైంది.. అసలేం జరిగిందంటే..?

|

Jul 17, 2024 | 8:49 AM

ఉత్తరప్రదేశ్‌లో దారుణం వెలుగుచూసింది. అలీగఢ్‌లో ఓ కొడుకు తన తల్లిని పోలీస్ స్టేషన్‌లోనే నిప్పంటించిన హృదయ విదారక ఘటన వెలుగు చూసింది. మంటల్లో తీవ్రంగా కాలిపోయిన మహిళను వెంటనే ఆసుపత్రికి తరలించారు. మహిళ పరిస్థితి విషమంగా మారడంతో, ఆమెను మెరుగైన వైద్యం కోసం రెఫర్ చేసినా మహిళను రక్షించలేకపోయారు.

పోలీసుల ముందు అత్తమామలను బెదిరించాలనుకుంది.. కానీ, ఆమే కాలిబూడిదైంది.. అసలేం జరిగిందంటే..?
Fire
Follow us on

ఉత్తరప్రదేశ్‌లో దారుణం వెలుగుచూసింది. అలీగఢ్‌లో ఓ కొడుకు తన తల్లిని పోలీస్ స్టేషన్‌లోనే నిప్పంటించిన హృదయ విదారక ఘటన వెలుగు చూసింది. మంటల్లో తీవ్రంగా కాలిపోయిన మహిళను వెంటనే ఆసుపత్రికి తరలించారు. మహిళ పరిస్థితి విషమంగా మారడంతో, ఆమెను మెరుగైన వైద్యం కోసం రెఫర్ చేసినా మహిళను రక్షించలేకపోయారు. భూమి కబ్జా విషయంలో ఆ మహిళ తన భర్త, మామతో గొడవ పడుతున్నట్లు సమాచారం. కాగా, ప్రస్తుతం నిందితుడైన కుమారుడిని పోలీసులు అరెస్టు చేశారు.

అలీగఢ్‌కు చెందిన హేమలత అనే 50 ఏళ్ల మహిళ ఇంటి స్వాధీనం విషయంలో అత్తమామలతో గొడవ పడుతోంది. మహిళ భర్త సుమారు 18 ఏళ్ల క్రితం మృతి చెందినట్లు సమాచారం. ఆ తర్వాత మహిళ తన పిల్లలతో కలిసి ఖైర్ గ్రామంలోని దార్కన్ నగరియా గ్రామంలోని తన మామ, అత్త ఇంటికి వచ్చింది. మహిళకు మొత్తం ముగ్గురు కుమారులు ఉండగా, వారిలో ఇద్దరు కుమారులు ఫరీదాబాద్‌లో పనిచేస్తున్నారు. పెద్ద కుమారుడు వివాహం చేసుకుని మరోచోట కాపురం పెట్టాడు. అయితే కొద్ది రోజుల క్రితం హేమలత తన మేనమామ, అత్తమామలు తనను బెదిరించి దుర్భాషలాడుతున్నారని ఆరోపించారు. ఈ ఘటనపై పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి చార్జిషీట్‌ దాఖలు చేశారు. పోలీసులు ఇరువర్గాలను పోలీస్ స్టేషన్‌కు పిలిచి రాజీ కుదిర్చారు.

మామ చంద్రభాన్‌ కుటుంబసభ్యులతో కలిసి రాగా, హేమలత తన కుమారుడితో కలిసి పోలీస్‌ స్టేషన్‌కు చేరుకుంది. ఇల్లు ఖాళీ చేసేందుకు రూ.5 లక్షలు ఇచ్చేందుకు అత్తమామలు సిద్ధపడగా, మహిళ, ఆమె కుమారుడు రూ.10 లక్షల ఇవ్వాలని డిమాండ్ చేశారు. అందుకు కుటుంబసభ్యులు నిరాకరించడంతో పెట్రోల్ బాటిల్‌తో బెదిరింపులకు పాల్పడ్డారు. అయితే ఆమె కొడుకు ఒక్కసారిగా లైటర్‌తో నిప్పంటించాడు. బాటిల్‌కు మంటలు అంటుకోవడంతో ఆ మహిళ కాలిపోయింది. పోలీసులు కాపాడేందుకు ప్రయత్నించగా చేతులు కాలాయి. వెంటనే మహిళను ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. నిందితుడైన కుమారుడిని వెంటనే అరెస్టు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారించే పనిలో నిమగ్నమయ్యారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..