ఉత్తరప్రదేశ్‌లోని సంభాల్‌లో 46 ఏళ్లుగా మూతపడిన శివాలయాన్ని అధికారులు తెరిచారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం ఈ ఆలయ ఆక్రమణలపై సమాచారం అందుకున్న పరిపాలన బృందం సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అప్పుడు ఈ పురాతన ఆలయం వెలుగులోకి వచ్చింది. పోలీసులు ఆలయాన్ని శుభ్రం చేశారు. ఆలయంలో శివలింగంతో పాటు హనుమాన్ విగ్రహం కూడా ఉంది. అంతేకాదు ఈ ఆలయ ప్రాంగణంలో ఒక పురాతన బావి కూడా ఉన్నట్లు పరిశోధనకారులు గుర్తించారు. అక్కడ జరిపిన తవ్వకంలో మరో మూడు విగ్రహాలు వెలుగులోకి వచ్చాయి.
సంభాల్‌లోని ఖగ్గు సరాయ్ ప్రాంతంలోని ఈ ఆలయన్ని కార్తీక శంకర ఆలయంగా గుర్తించారు. అంతేకాదు ఈ ఆలయం సుమారు 300 సంవత్సరాల నాటిదని చెబుతున్నారు. అప్పటి సంఘటనలను గుర్తుచేసుకుంటూ 82 ఏళ్ల విష్ణు శరణ్ రస్తోగి ఈ ప్రాంతం గతంలో హిందువుల ఆధిపత్యంలో ఉండేదని.. ఈ కార్తీక శంకర ఆలయం హిందువుల విశ్వాసానికి కేంద్రంగా ఉందని చెప్పారు. అయితే 1978 అల్లర్ల తర్వాత హిందూ కుటుంబాలు ఈ ఆలయంలో పూజలు చేయడం మానివేశాయన్నారు.
కొన్ని వంటల ఏళ్ల క్రితం పూర్వీకులు ఈ ఆలయాన్ని నిర్మించారని విష్ణు శరణ్ రస్తోగి (82 సంవత్సరాలు) చెప్పారు. ఈ ఆలయానికి దగ్గరలో ఒక రావి చెట్టు ఉంది. ఒక బావి కూడా ఉంది. ప్రజలు ఉదయం, సాయంత్రం ఆలయానికి వచ్చి దర్శనం చేసుకునేవారు. బావి దగ్గర దేవుడిని తలచుకుంటూ కీర్తనలు చేసేవారని చెప్పారు విష్ణు విష్ణు శరణ్. అయితే 1978లో ఈ ప్రాంతలో అల్లర్లు జరిగాయి. అప్పుడు హిందువులు భయంతో ప్రాణాలను అరచేతిట్లో పెట్టుకుని ఈ ప్రాంతం నుంచి పారిపోయారు. చుట్టుపక్కల ముస్లిం జనాభా ఉండడంతో భయంతో ఇక్కడ నుంచి వలస వెళ్లిపోయారు.
విష్ణు శరణ్ రస్తోగి ఈ ప్రాంతం గురించి ఇంకా అనేక విషయాలను పంచుకున్నారు. ఈ ప్రాంతంలో 40 నుంచి 42 హిందూ కుటుంబాలు నివసిస్తుండేవని.. సమీపంలోనే ముస్లిం కుటుంబాలు నివసిస్తూ ఉండేవారని చెప్పారు. అందరిలో సోదరభావం చాలా ఉండేది. ఆలయంలో అన్ని మత సంప్రదాయాలు జరిగాయని చెప్పారు. ఈ ప్రాంతంలోని తమ పూర్వీకులకు సంబంధించిన చివరి ఇల్లు 2005లో అమ్మివేసినట్లు తెలిపారు.
విష్ణు శరణ్ ఈ ఆలయం గురించి ఇంకా అనే విషయాలను పంచుకున్నారు. ఈ ఆలయంలో పూజ చేయడానికి, హారతి ఇవ్వడానికి ఎవరూ మిగిలి లేరు. తమ ఇంటిని కూడా ముస్లిం కుటుంబానికి అమ్మేశామని చెప్పారు. అనంతరం స్థానికులు గుడి పైభాగంలో బాల్కనీలు తీశారు. ఆలయం చుట్టూ 4 అడుగుల ప్రదక్షిణ మార్గం ఉండేది. అయితే గుడి ముందు భాగం మినహా మూడు వైపులా ఆక్రమణకు గురైందని అన్నారు.
గుడి తాళం తమ కుటుంబం వద్దే ఉందని.. ఆ ఆలయ నిర్వహణ తమ కుటుంబానికే చెందింది. అయితే తాము ఆ గుడిని తెరవలేదు, పూజలు చేయలేదు. 40 ఏళ్ల క్రితమే గుడిలో పూజలు చేసేందుకు పూజారిని ఏర్పాటు చేశానని .. అయితే ఆ పూజారికి గుడికి వెళ్లే ధైర్యం చేయలేదు.. ముందు ఆ పుజారీ గుడిలో పూజ చేయడానికి రెండు మూడు రోజులు వెళ్ళాడు.. ఆ తర్వాత ఆ పుజారీ గుడికి వెళ్లి పూజ చేయడనికి నిరాకరించాడని చెప్పారు. ఆక్రమణదారులు బావిని మూసివేశారని, కారు పార్క్ చేసేందుకు దానిపై ర్యాంప్‌ను ఏర్పాటు చేశారని విష్ణు శరణ్ చెప్పారు. గుడి కోసం భూమి తమ కుటుంబం ఇచ్చిందని అన్నారు. ఈ గుడి సుమారు 300 సంవత్సరాల క్రితం నుంచి ఉందని.. కాలక్రమంలో ఈ ప్రాంతంలో హిందువులు తక్కువ అవడంలో ఆలయంలో పూజలు ఆగిపోయాయని తెలిపారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..