UP Panchayat Elections 2021 : ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి అలహాబాద్ హైకోర్టు భారీ షాక్ ఇచ్చింది. త్వరలో జరగనున్న పంచాయతీ ఎన్నికలకు స్టే విధించింది. ఇందుకు సంబంధించి విచారణ చేపట్టిన అలహాబాద్ హైకోర్టు లక్నో బెంచ్ కీలక తీర్పు ఇచ్చింది. రిజర్వేషన్ల ప్రక్రియను ఖరారు చేయడానికి కోర్టు మధ్యంతర స్టే ఇచ్చింది.
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మూడంచెల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని ఆ రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. అయితే, ఎన్నికల ప్రక్రియలో రిజర్వేషన్లు సరిగాలేవని అలహాబాద్ హైకోర్టు తప్పుబట్టింది. లోకల్ బాడీ ఎన్నికల నిర్వహణపై స్టే విధించింది. రిజర్వేషన్ల ప్రక్రియను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై విచారణ జరిపి లక్నో బెంట్ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కేసు తదుపరి విచారణను మార్చి 15 కు వాయిదా వేసింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలతో యూపీ ప్రభుత్వం సమాధానం ఇవ్వాలని ఆదేశించింది.
యూపీ ప్రభుత్వం పంచాయతీ ఎన్నికలకు సిద్ధమైంది. ఇందుకు సంబంధించిన షెడ్యూల్‌ను ఆ రాష్ట్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. అయితే, రిజర్వేషన్ల ప్రక్రియను ఖరారు చేయడంపై హైకోర్టు శుక్రవారం మధ్యంతర స్టే ఇచ్చింది. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఎన్నికలను కోర్టు సమన్లు జారీ చేసింది. అజయ్ కుమార్ తరఫున దాఖలు చేసిన పిల్‌పై జస్టిస్ రితురాజ్ అవస్థీ, జస్టిస్ మనీష్ మాథుర్ ధర్మాసనం ఈ ఉత్తర్వులను జారీ చేసింది. పిటిషన్ 11 ఫిబ్రవరి 2021 న జారీ చేసిన ఆదేశాన్ని సవాలు చేస్తూ పిల్ దాఖలైంది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు 2015 లో జరిగాయని అల్తాఫ్ మన్సూర్ కోర్టులో తెలిపారు. అప్పటి రిజర్వేషన్లను ఆధారంగా చేసుకుని ప్రస్తుతం ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైందని అజయ్ కుమార్ హైకోర్టు ధర్మసనానికి నివేదించారు. యోగి ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరిస్తుందని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఇందుకు అనుగుణంగా ఎన్నికలకు వెళ్తున్నారంటూ ధర్మాసనానికి నివేదించారు.
కాగా, 16 సెప్టెంబర్ 2015 నాటి ఆదేశం ఇప్పటికీ అమలులో ఉందని ప్రభుత్వం తరపు న్యాయవాది వాదించారు. అటువంటి పరిస్థితిలో, ప్రస్తుత ఎన్నికలలో రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తి కానందున 2015 ప్రాథమిక సంవత్సరంగా పరిగణిస్తున్నట్లు వివరించారు. ఈ వాదనలు విన్న తరువాత, కోర్టు మధ్యంతర ఉత్తర్వులను జారీ చేసింది. రిజర్వేషన్ల ప్రక్రియను నిలిపివేసినట్లు ప్రకటించింది.
హైకోర్టు ఆదేశాల మేరకు అదనపు ప్రధాన కార్యదర్శి పంచాయతీ రాజ్ మనోజ్ కుమార్ సింగ్ అన్ని జిల్లాలకు ఉత్తర్వులు జారీ చేశారు. రిజర్వేషన్లను ఖరారు చేసే పనిలో నిమగ్నమైనందున ఎన్నికలను నిలిపివేశామని పేర్కొన్నారు. పంచాయతీ సార్వత్రిక ఎన్నికలు -2021 కోసం రిజర్వేషన్లు, కేటాయింపుల ప్రక్రియను ఖరారు చేయవద్దని ఆయన అన్ని జిల్లా న్యాయాధికారులను కోరారు. వాస్తవానికి, ఫిబ్రవరి 11 న, యుపీ ప్రభుత్వం మూడంచెల పంచాయతీ ఎన్నికలకు రిజర్వేషన్ నిబంధనలు జారీ చేసింది. రోటేషన్ పద్దతిలో రిజర్వు చేసి సీట్లను నిర్ణయించాలని నిర్ణయించింది.
గత ఐదు ఎన్నికలలో ఎప్పుడూ రిజర్వేషన్లు రాని పోస్టులను ప్రాధాన్యతా ప్రాతిపదికన రిజర్వ్ చేయాలి. అలాగే, 2015 సంవత్సరంలో ఏ తరగతికి రిజర్వ్ చేయబడిందో, ఈసారి ఆ తరగతిలో పోస్ట్ రిజర్వ్ చేయవద్దని నిర్ణయించారు. ఈ క్రమంలో, గ్రామ అధిపతి, గ్రామం, ప్రాంతం, జిల్లా పంచాయతీ సభ్యులకు రిజర్వేషన్ల కేటాయింపుల తాత్కాలిక జాబితాను జారీ చేశారు. తుది జాబితాను మార్చి 16 లోగా విడుదల చేయాల్సి ఉంది. ఇక, అలహాబాద్ హైకోర్టు నిర్ణయంతో పంచాయతీ ఎన్నికలు నిలిచిపోయాయి.
58,194 గ్రాము ప్రధాన్
7,31,813 వార్డు సభ్యులు
75,805 ఏరియా పంచాయతీ సభ్యులు
826 బ్లాక్ హెడ్స్
75 జిల్లా పంచాయతీ అధ్యక్షులు
ఇదీ చదవండిః సానుభూతి రాజకీయాలతో లాభం లేదు.. దమ్ముంటే స్వచ్ఛమైన రాజకీయాలు చెయాలి -మంత్రి పేర్నినాని