కనిపించకుండా పోయిన బరేలీలో దాక్కున్న పాకిస్తానీ గూఢచారి..! ఇంతకీ ఆమె ఎక్కడ?
ఉత్తరప్రదేశ్‌లోని బరేలీ జిల్లాలో నకిలీ పత్రాలతో ప్రభుత్వ ఉపాధ్యాయురాలిగా మారిన పాకిస్తానీ మహిళ మూడు నెలలుగా కనిపించడంలేదు. మూడు నెలల క్రితం విద్యా శాఖ ఆ మహిళపై ఫిర్యాదు చేసింది. కానీ ఇప్పటివరకు పోలీసులు ఆమెను అరెస్టు చేయలేకపోయారు. బరేలీ పోలీసుల నుంచి తప్పించుకున్న ఆ పాకిస్తానీ మహిళ ఎక్కడికి వెళ్లిందనే ప్రశ్న తలెత్తుతుంది?

పాకిస్తాన్ నుండి వచ్చిన పౌరులను తిరిగి పంపించే ప్రక్రియ దేశవ్యాప్తంగా జరుగుతోంది. ఇంతలో, ఉత్తరప్రదేశ్‌లోని బరేలీ జిల్లా నుండి ఒక షాకింగ్ కేసు వెలుగులోకి వచ్చింది. ఇక్కడ షుమైలా ఖాన్ అనే పాకిస్తానీ మహిళ మూడు నెలలుగా పరారీలో ఉంది. నకిలీ పత్రాల ద్వారా ఉద్యోగం సంపాదించినందుకు ఆమెపై కేసు నమోదైంది. మూడు నెలల క్రితం, ప్రాథమిక విద్యా శాఖ బరేలీలోని ఫతేగంజ్ వెస్ట్ పోలీస్ స్టేషన్‌లో షుమైలా ఖాన్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసింది. బరేలీ, రాంపూర్ సహా పలు ప్రాంతాల్లో పోలీసులు ఆమె కోసం గాలిస్తున్నారు. కానీ ఆమె జాడ దొరకలేదు.
షుమైలా ఖాన్ ఫతేగంజ్ వెస్ట్ ప్రాంతంలోని మాధోపూర్ ప్రాథమిక పాఠశాలలో అసిస్టెంట్ టీచర్‌గా పనిచేస్తున్నారు. దర్యాప్తులో ఆమె మొదట పాకిస్తాన్ పౌరురాలిగా తేలింది. ఉద్యోగం పొందడానికి, ఆమె రాంపూర్ SDM కార్యాలయం నుండి నకిలీ నివాస ధృవీకరణ పత్రాన్ని తయారు చేసి, నియామకం సమయంలో దానిని సమర్పించారు. దర్యాప్తులో, ఆ సర్టిఫికెట్ నకిలీదని తేలింది. షుమైలా ఖాన్ 2015 సంవత్సరంలో అసిస్టెంట్ టీచర్‌గా నియమితులయ్యారు. నియామకం కోసం సమర్పించిన పత్రాల దర్యాప్తులో ఆమె పాకిస్తాన్ పౌరురాలనే విషయాన్ని దాచి తప్పుడు పత్రాల ఆధారంగా ప్రభుత్వ ఉద్యోగం పొందినట్లు తేలింది.
నివాస ధ్రువీకరణ పత్రం రద్దు చేసిన ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం, ఉద్యోగం నుండి తొలగించింది. దర్యాప్తులో, రాంపూర్ తహసీల్దార్ సదర్, షుమైలా తప్పుడు సమాచారం అందించడం ద్వారా నివాస ధృవీకరణ పత్రాన్ని పొందారని పేర్కొన్నారు. దీని తరువాత ఆమె సర్టిఫికేట్ రద్దు చేసింది రాష్ట్ర ప్రభుత్వం. విద్యా శాఖ ఆమెను అనేకసార్లు వివరణ కోరింది. కానీ ప్రతిసారీ సర్టిఫికెట్ ప్రామాణికత సందేహాస్పదంగా ఉన్నట్లు తేలింది. ఫలితంగా, అక్టోబర్ 3, 2024న, జిల్లా ప్రాథమిక విద్యా అధికారి (BSA) షుమైలా ఖాన్‌ను సస్పెండ్ చేసి, ఆమెను ఆ పదవి నుండి తొలగించారు. దీంతో కేసు నమోదు చేసి, షుమైలా ఖాన్‌ను అరెస్టు చేయడానికి నిరంతర ప్రయత్నాలు జరుగుతున్నాయని నార్త్ ఎస్పీ ముఖేష్ చంద్ర మిశ్రా తెలిపారు. రాంపూర్‌కు ఒక పోలీసు బృందాన్ని పంపామని, త్వరలోనే ఆమెను అరెస్టు చేస్తామని తెలిపారు.
అదే సమయంలో, ఈ విషయంలో ఒక కేసును జిల్లా ప్రాథమిక విద్యా అధికారి దృష్టికి తీసుకెళ్లినట్లు ఇన్‌చార్జ్ అధికారి ఎడి బేసిక్ డాక్టర్ అజిత్ కుమార్ తెలిపారు. షుమైలా ఖాన్ నివసించిన ప్రాంతంలోని స్థానికులు, షుమైలా ఖాన్ పాకిస్తాన్ గూఢచారి అయి ఉండవచ్చనే అనుమానాన్ని వ్యక్తం చేశారు. ఆమె నిజం బయటపడగానే, కనిపించకుండా పోయిందని భావిస్తు్న్నారు. ఆమె ఇక్కడ 9 సంవత్సరాలుగా ప్రభుత్వ ఉద్యోగంలో పనిచేశారు. కానీ ఆమె గురించి ఇతర విషయమాలు ఏవీ కూడా ఎవరికీ తెలియదు. ఇది ఆశ్చర్యకరం..!
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




