‘నువ్వు లేని లోకంలో నేను బతకలేను’ స్నేహితుడి చితిపై దూకి వ్యక్తి ఆత్మహుతి

స్నేహితుడి మరణాన్ని జీర్ణించుకోలేకపోయాడో వ్యక్తి. అంతే.. ఒక్కసారిగా స్నేహితుడి చితిపైకి దూకి ఆత్మహుతికి పాల్పడ్డాడు. ఈ షాకింగ్‌ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని ఫిరోజాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే..

నువ్వు లేని లోకంలో నేను బతకలేను స్నేహితుడి చితిపై దూకి వ్యక్తి ఆత్మహుతి
Funeral Pyre

Updated on: May 28, 2023 | 7:28 PM

స్నేహితుడి మరణాన్ని జీర్ణించుకోలేకపోయాడో వ్యక్తి. అంతే.. ఒక్కసారిగా స్నేహితుడి చితిపైకి దూకి ఆత్మహుతికి పాల్పడ్డాడు. ఈ షాకింగ్‌ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని ఫిరోజాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే..

ఉత్తరప్రదేశ్‌లోని ఫిరోజాబాద్ జిల్లా నాగ్లా ఖంగార్ ప్రాంతానికి చెందిన అశోక్ (42) గత కొంత కాలంగా క్యాన్సర్‌తో బాధపడుతున్నాడు. ఈ క్రమంలో అతను శనివారం ఉదయం అతడు మరణించాడు. అదే రోజు ఉదయం 11 గంటలకు యమునా నది ఒడ్డున ఉన్న శ్మశాన వాటికలో కుటుంబ సభ్యులు అంత్యక్రియలు నిర్వహించారు. అశోక్‌ స్నేహితుడు ఆనంద్‌ (40) కూడా అంత్యక్రియలకు హాజరయ్యాడు. అశోక్‌ మృతదేహానికి చితి వెలిగించిన తర్వాత బంధువులు ఒక్కొక్కరిగా వెనుదిరగసాగారు. ఇంతలో ఆనంద్‌ ఉన్నట్టుండి ఒక్కసారిగా స్నేహితుడి చితిపైకి దూకాడు.

వెంటనే అక్కడున్నవారు చితి పైనుంచి అతన్ని బయటకు లాగారు. మంటల ధాటికి అప్పటికే ఆనంద్‌కు తీవ్రగాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం తొలుత జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా.. మెరుగైన వైద్యం కోసం ఆగ్రా మెడికల్‌ కాలేజీ హాస్పిటల్‌కు తరలించారు. ఐతే మార్గం మధ్యలోనే అనంద్‌ మరణించాడు. స్నేహితుడి కోసం ఆనంద్‌ ప్రాణాలు తీసుకోవడం స్థానికంగా చర్చనీయాంశమైంది. సమాచారం అందుకున్న పోలీసులు ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు ప్రారంభించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us