Treasure: మట్టిని తవ్వుతుండగా మెరుస్తూ కనిపించింది.. ఏంటా అని చూడగా..

|

Oct 10, 2024 | 9:41 AM

గ్రేటర్ నోయిడా సమీపంలో మట్టిని తవ్వుతుండగా భారీ మొత్తంలో వెండి నాణేలు, ఆభరణాలు దొరికాయన్న సమాచారంతో గ్రామమంతా ఎగబడింది. అధికారులు వచ్చే సమయానికి మొత్తం లూటీ చేశారు.

Treasure: మట్టిని తవ్వుతుండగా మెరుస్తూ కనిపించింది.. ఏంటా అని చూడగా..
Field
Follow us on

గ్రేటర్ నోయిడా సమీపంలో మట్టిని తవ్వుతుండగా భారీ మొత్తంలో వెండి నాణేలు, ఆభరణాలు దొరికాయన్న సమాచారంతో గ్రామమంతా ఎగబడింది. అధికారులు వచ్చే సమయానికి మొత్తం లూటీ చేశారు. సమాచారం అందుకున్న
పురావస్తు శాఖ బృందం దన్‌కౌర్‌లోని రాజ్‌పూర్ కాలా గ్రామానికి చేరుకుంది.

దంకౌర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రాజాపూర్ కాలా గ్రామంలోని పొలంలో మట్టి కోసం తవ్వకాలు జరిపారు. దీంతో భారీ మొత్తంలో నిధి లభ్యమైంది. గ్రామస్తులకు పొలాల్లో వెండి నాణేలు, పెద్ద మొత్తంలో నగలు లభించాయి. నిర్మాణంలో ఉన్న ఇంటిని నింపేందుకు పొలంలో తవ్వకాలు చేపట్టారు. ఈ సమయంలో, పొలంలో ఉన్న నిధి గురించి ప్రజలకు సమాచారం వచ్చింది. అనంతరం నిధిని దోచుకునేందుకు గ్రామస్తుల మధ్య పోటీ నెలకొంది. నిధిని కనుగొన్నట్లు సమాచారం అందుకున్న పురావస్తు శాఖ ఈ అంశంపై దర్యాప్తు ప్రారంభించింది.

ఆదివారం(అక్టోబర్ 6) రాత్రి గ్రామపెద్ద కైలాష్‌ పొలంలో తవ్వకాలు జరుపుతున్నట్లు గ్రామస్తులు తెలిపారు. మట్టి నింపేందుకు ట్రాలీల్లో మట్టిని తీసుకొచ్చారు. మరుసటి రోజు గ్రామస్థులు రోడ్డుపై మట్టితో చెల్లాచెదురుగా ఉన్న కొన్ని నాణేలను గుర్తించారు. ఆ తర్వాత దారిలో విస్తరించిన మట్టిలో నాణేలను గ్రామస్థులు గుర్తించారు. వాటిని వెతుకుంటూ ప్రధాన పొలానికి చేరుకున్నారు. దీంతో పెద్ద ఎత్తున నాణేలు, అభరణాలను గుర్తించిన గ్రామస్తులు, ఎగబడి లూటీ చేశారు. ఎవరికి దొరికినంతా వారు ఎత్తుకెళ్లారు.

నిధి దొరికిందన్న సమాచారం అందిన వెంటనే గ్రామస్థులు గుంపులుగా నిధిని దోచుకోవడం ప్రారంభించారు. గ్రామస్థులు పెద్ద మొత్తంలో వెండి ఆభరణాలు, నాణేలను కనుగొన్నట్లు సమాచారం. అదే సమయంలో, లోహ నిర్మాణం మొఘల్, బ్రిటీష్ కాలం నాటిదని భావిస్తున్నారు. తవ్వకాల్లో ఇప్పటి వరకు 20 కిలోల వెండి నాణేలు, నగలు లభించినట్లు గ్రామస్తులు చెబుతున్నారు. నిధి బయటపడినట్లు సమాచారం అందిన వెంటనే పురావస్తు శాఖ అధికారులు గ్రామస్తుల నుంచి 18 నుంచి 20 రకాల ఆభరణాలను స్వాధీనం చేసుకుని విచారణ చేపట్టారు.

ప్రతి నగరానికి దాని స్వంత చరిత్ర ఉంది. త్రేతాయుగంలో రావణుడి బంధువు గౌతమ్ బుద్ధ నగర్‌లోని బిస్రాఖ్ గ్రామానికి చెందిన వ్యక్తిగా భావిస్తారు. రావణుడు ఈ గ్రామంలోనే జన్మించాడని ప్రతీతి. అలాగే, దంకౌర్ పట్టణం మహాభారత కాలానికి సంబంధించినది. దంకౌర్ పట్టణంలో ఉన్న గురు ద్రోణాచార్యుల విగ్రహం ముందు ఏకలవ్య విలువిద్యలో ప్రావీణ్యం సంపాదించాడని నమ్ముతారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..