Holi Festival: మొదలైన హొలీ సందడి.. ప్రయాగ్‌రాజ్‌లో మోడీ మాస్కులకు అత్యధిక డిమాండ్

|

Mar 14, 2022 | 3:05 PM

Holi Festival:హొలీ పండగను ప్రపంచ వ్యాప్తంగా ఉన్న హిందువులు(Hindus) అందరూ ఎంతో సంతోషముగా జరుపుకుంటారు. వసంతకాలంలో వచ్చే ఈ రంగుల పండగ సందడి దేశ వ్యాప్తంగా మొదలైంది. ముఖ్యంగా హొలీ..

Holi Festival: మొదలైన హొలీ సందడి.. ప్రయాగ్‌రాజ్‌లో మోడీ మాస్కులకు అత్యధిక డిమాండ్
Uttar Pradesh Holi Fever
Follow us on

Holi Festival:హొలీ పండగను ప్రపంచ వ్యాప్తంగా ఉన్న హిందువులు(Hindus) అందరూ ఎంతో సంతోషముగా జరుపుకుంటారు. వసంతకాలంలో వచ్చే ఈ రంగుల పండగ సందడి దేశ వ్యాప్తంగా మొదలైంది.  ముఖ్యంగా హొలీ పండగ పర్వదినాన్ని నార్త్ ఇండియన్స్ (North Indians) అత్యంత ఘనంగా జరుపుకుంటారు. అయితే హోలీకి ముందే ఉత్తరప్రదేశ్‌(Utterpradesh) లోని ప్రయాగ్‌రాజ్‌లో సందడి మొదలైంది. స్థానిక మార్కెట్‌లలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మాస్క్‌లకు డిమాండ్ పెరిగింది. ఉత్తరప్రదేశ్, గోవా, మణిపూర్ మరియు ఉత్తరాఖండ్‌లలో ఇటీవల ముగిసిన అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ (బిజెపి) విజయం సాధించడం వల్ల మోడీ ఫేస్ మాస్కులకు అత్యంత డిమాండ్‌ ఏర్పడిందని దుకాణదారులు చెబుతున్నారు. మార్కెట్‌లన్నీ ప్రధాని నరేంద్ర మోడీ మాస్క్‌లు, గులాల్ (రంగులు), వాటర్ గన్‌లు తో నిండిపోయాయి.

అయితే గత రెండేళ్లుగా “COVID-19 మహమ్మారి కారణంగా.. ప్రజలు హోలీని జరుపుకోవడానికి ఉత్సాహం చూపలేదు. అయితే ఇప్పుడు కరోనా తగ్గుముఖం పట్టడం, అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు రావడంతో ప్రజల్లో హొలీ జరుపుకోవడం పట్ల మరింత ఆసక్తి నెలకొంది. ప్రస్తుతం మోడీ మాస్క్‌లకు డిమాండ్ ఎక్కువగా ఉండటంతో పాటు అమ్మకాలు కూడా బాగానే ఉన్నాయి. గత రెండేళ్లుల్లో తమ వ్యాపారం అంతంత మాత్రంగా ఉండగా.. ఈ ఏడాది వ్యాపారం బాగా జరుగుతోంది’’ అని ఓ దుకాణదారు హర్షం వ్యక్తం చేశాడు. ఈ సంవత్సరం హోలీని కుంకుమపువ్వుతో జరుపుకుంటారని అన్నారాయన.

Holi

‘‘ఎక్కువమంది ప్రజలు మోడీ  మాస్కులు అడుగుతున్నారు. ఎన్నికలు ముగిశాయి.. ఫలితాలు వచ్చాయి.. ఈసారి హోలీ బాగానే ఉండబోతోంది. అమ్మకాలు పెరిగాయి. ద్రవ్యోల్బణం లేదు” అని మరో దుకాణదారుడు మహ్మద్ నసీమ్ అన్నారు.

హోలీ అనేది హిందువుల పండుగ అయితే.. ముస్లిం, సిక్కు, భౌద్ధులు ఇలా అన్ని మతాల ప్రజలు జరుపుకుంటారు. వసంత రుతువు ప్రారంభాన్ని సూచిస్తూ.. ఈ  సందర్భంగా తమ ఆనందాన్ని అందరితోనూ పంచుకుంటారు. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా ముందురోజు హోలికా దహనం కార్యక్రమాన్ని వేడుకగా నిర్వహిస్తారు. హొలీ రోజున ప్రజలు ఒకరిపై ఒకరు రంగులు పూసుకుంటారు. భారత దేశం వసుదైక కుటుంబం.. భిన్నత్వంలో ఏకత్వాన్ని ఈ హొలీ పండగ ద్వారా చాటి చెబుతారు.

 

Also Read:

Bahubali 3: మాహిష్మతి రాజ్యం నుంచి కొత్త వార్త రానుంది.. బాహుబలి 3పై జక్కన్న ఆసక్తికర వ్యాఖ్యలు..

Mumbai Cafe: ఆ కేఫ్‌లో పనిచేసే ఉద్యోగులంతా వారే.. ముందు నువ్వు మారు.. ప్రపంచం అదే మారుతుందంటున్న యజమాని