పెళ్లై 6 రోజులు.. మొదటి రోజు రాత్రే బాత్రూమ్‌లో రక్తపు మడుగులో పడి ఉన్న వరుడు!
ఉత్తరప్రదేశ్ మీరట్‌లోని ఒక పెళ్లి ఇంట్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. వరుడు తన పెళ్లి రోజు రాత్రి ప్రాణాలు కోల్పోయాడు. అర్థరాత్రి చీకటిలో బాత్రూమ్‌కు వెళ్ళాడు. కానీ అక్కడే కాలు జారి కుప్పకూలిపోయాడు. తలకు బలమైన గాయం కావడంతో, అతని పరిస్థితి విషమించింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. వివాహం జరిగిన 6 రోజులకే అతను మరణించాడు.

కోటి ఆశలతో కొత్త కాపురం ప్రారంభించాలనుకున్న వారి జీవితం విషాదంగా మారింది. ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో జరిగింది ఈ దారుణం. మొదటి రోజు రాత్రి వరుడికి ఏదో జరిగింది. ఆ తర్వాత వధువు కేకలు వేసింది. ఇంతలోనే అంతా జరిగిపోయింది. నిజానికి, రాత్రి రెండు గంటల ప్రాంతంలో చీకటిలో వరుడు మంచం మీద నుండి లేచి బాత్రూమ్‌కు వెళ్ళాడు. కానీ అక్కడ అతను కాలు జారి పడిపోయాడు. దీని కారణంగా అతని తలకు తీవ్ర గాయమైంది. వరుడి కేకలు విన్న వధువు అతని దగ్గరకు వచ్చింది. వరుడు రక్తంలో తడిసి అక్కడే కుప్పకూలిపోయాడు. ఇది చూసి పెళ్లికూతురు కూడా కేకలు వేసింది. వధువు అరుపు విన్న కుటుంబ సభ్యులు కూడా మేల్కొన్నారు. వెంటనే వరుడిని ఆసుపత్రికి తరలించారు. కానీ అతని పరిస్థితి విషమంగా ఉండటంతో, వరుడిని ఢిల్లీకి రిఫర్ చేశారు. అక్కడ చికిత్స పొందుతూ వరుడు మరణించాడు.
ఈ ఘటన కిథోర్‌లోని షాజహాన్‌పూర్‌లో చోటు చేసుకుంది. ఇక్కడ ఒక వధువు వివాహం అయిన ఆరు రోజులకే వితంతువు అయ్యింది. పెళ్లి రోజు రాత్రి బాత్రూమ్‌లో పడిపోవడంతో వరుడు గాయపడ్డాడు. అతని తలకు బలమైన గాయం అయింది. గాయపడిన వరుడిని చికిత్స కోసం వైద్యులు ఢిల్లీకి పంపారు. ఇక్కడ వరుడు చికిత్స పొందుతూ ఆరో రోజున మరణించాడు.
పోలీసుల సమాచారం ప్రకారం, షాజహాన్‌పూర్ నివాసి అమిత్ కుమార్ ఒక నర్సరీలో పనిచేస్తున్నాడు. అతను మార్చి 7న హాపూర్‌లోని గర్హముక్తేశ్వర్‌లో వివాహం చేసుకున్నాడు. వివాహం తర్వాత పెళ్లి ఊరేగింపు సంతోషంగా ఇంటికి తిరిగి వచ్చింది. వధువును ఇంటికి తీసుకువచ్చిన తర్వాత అమిత్ కుమార్‌తో మొదటి రోజు రాత్రి ఏర్పాట్లు చేశారు కుటుంబసభ్యులు. పెళ్లి రోజు రాత్రి 2 గంటల ప్రాంతంలో వరుడు అమిత్ బాత్రూమ్‌కు వెళ్లాడు. బాత్రూమ్‌కు మెట్లు ఎక్కుతుండగా అతని కాలు జారిపోయింది. అమిత్ అక్కడే కిందపడిపోయాడు. అతని తల మెట్లను తాకడంతో రక్తస్రావం అయింది.
ఆ శబ్దం విని పెళ్లికూతురు పరిగెత్తుకుంటూ వచ్చింది. రక్తంలో తడిసిపోయిన అమిత్ ని చూసి ఆమె షాక్ అయ్యింది. ఆమె తన భర్త అమిత్‌ను స్వయంగా పైకి లేపడానికి ప్రయత్నించింది కానీ కుదరలేదు. వధువు ఇతర కుటుంబ సభ్యులను నిద్రలేపి విషయం గురించి తెలియజేసింది. రక్తపు మడుగులో పడి ఉన్న అమిత్‌ను కుటుంబ సభ్యులు వెంటనే కిథోర్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అతని అప్పటికే అతని పరిస్థితి విషమంగా ఉండటంతో ఢిల్లీకి తీసుకెళ్లారు. అయితే అమిత్ చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచాడు. ఈ ఘటనకు సంబంధించి సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
అమిత్ పరిస్థితి మెరుగుపడకపోవడంతో, ఆసుపత్రి వారు అతన్ని ఢిల్లీ ఎయిమ్స్‌కు రిఫర్ చేశారు. ఎయిమ్స్‌లో చికిత్స కొనసాగింది కానీ అమిత్ పరిస్థితి మెరుగుపడలేదు. అమిత్ గురువారం సాయంత్రం కన్నుమూశారు. సాయంత్రం ఆలస్యంగా, కుటుంబం అతని మృతదేహాన్ని తీసుకొని షాజహాన్‌పూర్ చేరుకుని అంత్యక్రియలు నిర్వహించింది. ఆ వధువు కేవలం ఆరు రోజుల్లోనే వితంతువు అయ్యింది. అమ్మాయి, అబ్బాయి వైపులా ఇద్దరూ అమిత్ వెంట ఉన్నారు. ఆరు రోజుల పాటు చికిత్స కొనసాగింది. కానీ తలకు బలమైన గాయం తర్వాత అధిక రక్తస్రావం కారణంగా కోలుకోలేకపోయాడు.
మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




