
ప్రేమ ఎప్పుడైనా, ఎక్కడైనా, ఎవరితోపైన అయినా కలగవచ్చు. దీనికి వయోపరిమితి లేదు. అయితే అమ్మమ్మ వయసున్న స్త్రీ మనవడి వయసున్న అబ్బాయిని ప్రేమిస్తే ఏమవుతుంది? ఇది వినడానికి వింతగా ఉండవచ్చు, కానీ ఇది నిజంగా ఉత్తరప్రదేశ్‌లోని అంబేద్కర్ నగర్‌లో జరిగింది. ఇక్కడ నలుగురు పిల్లల 52 ఏళ్ల తల్లి తనకు మనవడు వరస అయిన 25 ఏళ్ల వ్యక్తితో ప్రేమలో పడింది. ఆ మహిళ తన భర్త, పిల్లలను వదిలి తన ప్రేమికుడైన మనవడితో పారిపోయింది. ఆ తర్వాత ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు.
ఆ మహిళకు ఇది మూడవ వివాహం. నివేదికల ప్రకారం.. పది రోజుల క్రితం బస్ఖారీ పోలీస్ స్టేషన్ ప్రాంతంలోని ప్రతాప్పూర్ బెల్వారియా బస్తీలో నివసిస్తున్న నలుగురు పిల్లల తల్లి అదే గ్రామానికి చెందిన బంధువు అయిన తన మనవడితో పారిపోయింది. వీరిద్దరూ గోవింద్ సాహెబ్ ఆలయంలో వివాహం చేసుకున్నారు. 52 ఏళ్ల ఇంద్రావతి ప్రతాప్పూర్ బెల్వారియా నివాసి. 20 సంవత్సరాల క్రితం చంద్రశేఖర్ ఆజాద్‌ను వివాహం చేసుకున్నట్లు చెబుతున్నారు. ఈ దంపతులకు ఒక కూతురు, ఒక కొడుకు కూడా ఉన్నారు.
అయితే ఇంద్రావతికి చంద్రశేఖర్ తో రెండవ పెళ్లి. అంతకు ముందు ఇంద్రావతికి పెళ్లి జరిగింది.. మొదటి భర్త ద్వారా ఒక కూతురు కూడా ఉంది. అయితే కాలక్రమంలో ఇంద్రావతికి రెండో భర్త చంద్రశేఖర్ పై ప్రేమ తగ్గిపోయింది. అప్పుడు తమ గ్రామంలో నివసిస్తున్న 25 ఏళ్ల ఆజాద్‌తో ప్రేమలో పడింది. ఆజాద్ .. ఇంద్రవతికి వరసకి మనవడు.
ఇద్దరూ వరసకు అమ్మమ్మ, మనవడు అవుతారని గ్రామస్తులు చెబుతున్నారు. వీరిద్దరి ప్రేమ వ్యవహారం విషయం రెండు రోజుల క్రితం లహ్తోర్వా పోలీస్ స్టేషన్‌కు చేరుకుంది, అయితే గత ఆదివారం.. ఇంద్రావతి, ఆజాద్ లు ఇద్దరూ కుటుంబ సభ్యులను లెక్క చేయలేదు.. సమాజం పట్ల ఎటువంటి భయం లేకుండా గోవింద్ సాహెబ్ ఆలయానికి చేరుకుని వివాహం చేసుకున్నారు. అదే సమయంలో వీరి పెళ్లి గురించి తెలిసిన తర్వాత గ్రామస్తులతో పాటు ఇరువురి కుటుంబ సభ్యులు కూడా వీద్దరినీ బహిష్కరించాలని నిర్ణయించుకున్నారు.
ఇంద్రావతి భర్త చంద్రశేఖర్ ఆజాద్ జీవనోపాధి కోసం వేరే నగరంలో నివసిస్తున్నాడని చెబుతున్నారు. ఈ సమయంలో ఇంద్రావతి తమ పక్కనే నివసిస్తున్న ఆజాద్‌తో ప్రేమలో పడింది. అయితే చంద్ర శేఖర్ ఇంటికి తిరిగి వచ్చినప్పుడు.. తన భార్య అక్రమ సంబంధం గురించి తెలుసుకున్నాడు. దీంతో తన భార్య, ఆమె ప్రియుడు కలిసి తనను, తన పిల్లల్ని చంపాలని ప్లాన్ చేస్తున్నారని చంద్రశేఖర్ చెప్పాడు. వాళ్ళు నన్ను, నా ముగ్గురు పిల్లలను విషం పెట్టి చంపాలని ప్లాన్ చేశారు.. అయితే ఆ విషయం తనకు తెలియడంతో మేము ప్రాణాలతో బయట పడినట్లు చెబుతున్నాడు చంద్రశేఖర్.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..