Uttar Pradesh: యూపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం.. ఆస్తుల బదిలీ విషయంలో భారీ ఊరట..!

|

Jun 16, 2022 | 7:47 PM

Uttar Pradesh: సంచలన నిర్ణయాలు తీసుకోవడంలో ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌కు పెట్టింది పేరు. మొదటి నుంచి తన పాలనలో అధికారులను ఉరుకులు పరుగులు..

Uttar Pradesh: యూపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం.. ఆస్తుల బదిలీ విషయంలో భారీ ఊరట..!
Follow us on

Uttar Pradesh: సంచలన నిర్ణయాలు తీసుకోవడంలో ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌కు పెట్టింది పేరు. మొదటి నుంచి తన పాలనలో అధికారులను ఉరుకులు పరుగులు పెట్టిస్తుంటారు. ఇక ఇంటి యజమానుల విషయంలో యూపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కుటుంబ సభ్యుల మధ్య ఆస్తి బదిలీపై స్టాంప్ డ్యూటీని మినహాయించాలని యోగి ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం ఇలాంటి లావాదేవీలపై 7 శాతం స్టాంప్ డ్యూటీ విధిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో ఇప్పుడు యూపీలో తమ ప్రియమైన వారికి ఆస్తులను బదిలీ చేయడం సులభతరం కానుంది. ఇప్పుడు ప్రాపర్టీ రిజిస్ట్రీ రూ.5,000, రూ.1,000 ప్రాసెసింగ్ చార్జీతో జరుగుతుంది. అలా అయితే ప్రాపర్టీ ధరలో 7 శాతంతో కేవలం రూ.6,000 స్టాంపు రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. యూపీ ఆస్తి బదిలీపై ప్రస్తుతం 7 శాతం స్టాంప్ డ్యూటీ విధిస్తోంది ప్రభుత్వం. రిజిస్ట్రేషన్ ఖర్చు కారణంగా, కుటుంబాలు ఆస్తి బదిలీకి తరచుగా పవర్ ఆఫ్ అటార్నీని ఉపయోగిస్తాయి. దీని వలన ప్రభుత్వానికి భారీ ఆర్థిక నష్టం కలుగుతుంది.

స్టాంపులు, రిజిస్ట్రేషన్ మంత్రి రవీంద్ర జైస్వాల్ వివరాల ప్రకారం.. ఇంతకు ముందు ఆస్తి యజమానిగా, ఎవరైనా దానిని తన బిడ్డకు లేదా మరేదైనా దగ్గరి బంధువుకు బదిలీ చేయాలనుకుంటే బదిలీ చేయవచ్చు లేదా విక్రయించవచ్చు. మరణానికి ముందు బదిలీ అయినట్లయితే డబ్బు లావాదేవీలు జరగకపోతే, అదే వ్యక్తులు ఇంట్లో నివసిస్తున్నట్లయితే, స్టాంప్ డ్యూటీ ఎక్కువగా వసూలు చేయబడుతోంది. దీని కారణంగా ఎవరైనా చనిపోయే ముందు ప్రజలు ఆస్తిని పంపిణీ చేయలేరు. కొత్త నిబంధన ఈ సమస్యను పరిష్కరిస్తుంది.

ఇప్పుడు తక్కువ ధరకే రిజిస్ట్రేషన్ అందుబాటులోకి వచ్చినందున ప్రజలు పవర్ ఆఫ్ అటార్నీపై ఆధారపడకుండా ఆస్తి సమస్యలను సక్రమంగా పరిష్కరించుకోవడానికి ఇష్టపడతారని ఆయన అన్నారు. ఈ చర్య వల్ల ప్రభుత్వానికి భారీ నష్టం వాటిల్లుతుంది. దేశ రాజధాని ఢిల్లీలో ట్రాన్స్‌ఫర్ ఛార్జీ ఖరీదైనదిగా మారింది. ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (MCD) దేశ రాజధానిలో రూ. 25 లక్షల కంటే ఎక్కువ ఆస్తి కొనుగోలుపై బదిలీ ఛార్జీని 1 శాతం పెంచింది. బదిలీ ఛార్జీ పురుషులకు 4 శాతం, మహిళలకు 3 శాతం ఉంటుంది. ఆస్తులను వాటి ప్రాంతం ఆధారంగా ఎ, బి, సి, డి, ఇ, ఎఫ్, జి, హెచ్‌లుగా ఎనిమిది కేటగిరీలుగా విభజించారు. ఆస్తుల అమ్మకం, కొనుగోలుపై ఢిల్లీ ప్రభుత్వం స్టాంప్ డ్యూటీని విధిస్తుంది. స్టాంప్ డ్యూటీ నుండి బదిలీ ఛార్జీ వేరు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి