Yogi Adithyanath: అయోధ్య నగరిలో కేబినేట్ భేటి .. ఉత్తరప్రదేశ్‌ చరిత్రలోనే ఇదొక అరుదైన ఘటం

|

Nov 09, 2023 | 10:05 PM

అయోధ్యలో ఉత్తరప్రదేశ్‌ కేబినెట్‌ భేటీ జరగడం ప్రాధాన్యతను సంతరించుకుంది. కేబినెట్‌ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అయోధ్య అభివృద్దికి రూ.30 వేల కోట్లతో ప్రణాళికను సిద్దం చేసినట్టు తెలిపారు యోగి ఆదిత్యనాథ్. పవిత్ర అయోధ్య నగరిలో ఉత్తరప్రదేశ్‌ కేబినెట్‌ అయోధ్యలో తొలిసారిగా సమావేశమయ్యింది. రాష్ట్ర చరిత్రలో ఇది అరుదైన ఘట్టంగా చెప్పుకోవచ్చు. రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ నేతృత్వంలోని మంత్రి వర్గం సమావేశమైంది.

Yogi Adithyanath: అయోధ్య నగరిలో కేబినేట్ భేటి .. ఉత్తరప్రదేశ్‌ చరిత్రలోనే ఇదొక అరుదైన ఘటం
Uttar Pradesh Chief Minister Yogi Adityanath Held A Cabinet Meeting In Ayodhya
Follow us on

అయోధ్యలో ఉత్తరప్రదేశ్‌ కేబినెట్‌ భేటీ జరగడం ప్రాధాన్యతను సంతరించుకుంది. కేబినెట్‌ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అయోధ్య అభివృద్దికి రూ.30 వేల కోట్లతో ప్రణాళికను సిద్దం చేసినట్టు తెలిపారు యోగి ఆదిత్యనాథ్. పవిత్ర అయోధ్య నగరిలో ఉత్తరప్రదేశ్‌ కేబినెట్‌ అయోధ్యలో తొలిసారిగా సమావేశమయ్యింది. రాష్ట్ర చరిత్రలో ఇది అరుదైన ఘట్టంగా చెప్పుకోవచ్చు. రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ నేతృత్వంలోని మంత్రి వర్గం సమావేశమైంది. సాధారణంగా రాజధాని లక్నోలో జరిగే ఈ కేబినెట్‌ భేటీ ఇలా అయోధ్యలో జరగడం రాష్ట్ర చరిత్రలో ఇదే తొలిసారి.

ఉత్తరప్రదేశ్‌లో కొత్త డ్రోన్‌ పాలసీ, అయోధ్య అభివృద్దికి రూ.30 వేల కోట్లతో ప్రత్యేక ప్రణాళికల గురించి సుదీర్ఘంగా చర్చించారు. ఉదయం అయోధ్యకు చేరుకున్న సీఎం, మంత్రులు తొలుత హనుమాన్‌ గర్హి ఆలయాన్ని సందర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అక్కడి నుంచి రామ్‌లల్లా ఆలయాన్ని దర్శించుకొన్నారు. తరువాత శ్రీ రామజన్మభూమి మందిర్‌ నిర్మాణం జరుగుతున్న ప్రాంతాన్ని సందర్శించారు. అక్కడి నుంచి రామకథ మ్యూజియంకు చేరుకున్నారు. అక్కడే యోగి నేతృత్వంలో రాష్ట్ర కేబినెట్‌ సమావేశమైంది. ఈ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్రంలో కొత్త డ్రోన్‌ పాలసీ తీసుకొస్తామన్నారు సీఎం యోగి. అయోధ్య అభివృద్దికి కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలు రూ.30 వేల కోట్లతో ప్రత్యేక ప్రణాళికను సిద్దం చేసినట్టు చెప్పారు. నవంబరు 9న అయోధ్యలో కేబినెట్‌ సమావేశం నిర్వహించడానికి మరో ప్రత్యేకత కూడా ఉంది.

1989లో ఇదే రోజున అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి విశ్వ హిందూ పరిషత్‌ శంకుస్థాపన చేసింది. 2019 నవంబరు 9న బాబ్రీ మసీదు-రామ జన్మభూమి కేసులో సుప్రీంకోర్టు చారిత్రక తీర్పు వెలువరించింది. ఈ తీర్పుతో అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి మార్గం సుగమమైంది. రాష్ట్రంలో డ్రోన్‌ పాలసీ తీసుకుకావాలని కేబినెట్‌ సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్టు యోగి తెలిపారు. ఈనెల 27న అఖిలపక్ష సమావేశం ఉంటుంది. నవంబర్‌ 28 నుంచి అసెంబ్లీ శీతాకాల సమావేశాలు జరుగుతాయి. వారం రోజుల పాటు ఈ సమావేశాలు జరిగే అవకాశం ఉంది. కొన్ని చట్టాలు తీసుకోస్తామన్నారు. అయోధ్య అభివృద్దిపై ఈ సమావేశంలో ప్రజంటేషన్‌ ఇచ్చాం. ప్రధాని మోదీ మార్గనిర్ధేశంతో అయోధ్యతో పాటు ఉత్తరప్రదేశ్‌ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని వివరించారు. అయోధ్యలో కేబినెట్‌ భేటీ సందర్భంగా భద్రతను కట్టుదిట్టం చేశారు పోలీసు ఉన్నతాధికారులు. నగరమంతటా ఏటీఎస్‌ బృందాలను మోహరించారు. 2019లో కూడా యోగి సర్కారు లక్నోలో ప్రయాగ్‌రాజ్‌లో కేబినెట్‌ సమావేశం నిర్వహించింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోెసం ఇక్కడ క్లిక్ చేయండి..