Marriage: మరదలు పెట్టిన చిచ్చుకు వరుడు బలి.. పీఠల మీదే పెళ్లిని క్యాన్సిల్ చేసిన వధువు..

|

Jun 20, 2023 | 12:30 PM

పెళ్లి చూపుల్లో అమ్మాయి, అబ్బాయి మాట్లాడుకోవడం చాలా సందర్భాల్లో మనం చూస్తూనే ఉంటాం. ఈ సందర్భంలో ఇరువురి మనసులోని సందేహాలను, ప్రశ్నలను ఒకరినొకరు అడిగి నివృత్తి చేసుకుంటారు. ఆ తరువాత ఇద్దరికీ ఓకే అనిపిస్తే..

Marriage: మరదలు పెట్టిన చిచ్చుకు వరుడు బలి.. పీఠల మీదే పెళ్లిని క్యాన్సిల్ చేసిన వధువు..
Marriage
Follow us on

పెళ్లి చూపుల్లో అమ్మాయి, అబ్బాయి మాట్లాడుకోవడం చాలా సందర్భాల్లో మనం చూస్తూనే ఉంటాం. ఈ సందర్భంలో ఇరువురి మనసులోని సందేహాలను, ప్రశ్నలను ఒకరినొకరు అడిగి నివృత్తి చేసుకుంటారు. ఆ తరువాత ఇద్దరికీ ఓకే అనిపిస్తే.. మ్యారేజ్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తారు. అయితే, ఇక్కడ పెళ్లికి ముందు కాకుండా.. సరిగ్గా పెళ్లి సమయంలో ప్రశ్నలు అడిగారు. ఆ ప్రశ్న ఏకంగా పెళ్లి క్యాన్సిల్ అయ్యేందుకు కారణమైంది. ఇక్కడ మరో ట్విస్ట్ ఏంటంటే.. ఆ వరుడి ప్లేస్‌లో మరో వరుడు వచ్చి అమ్మాయికి తాళి కట్టాడు. ఇంతకీ అసలేం జరిగిందో పూర్తి వివరాలు తెలుసుకుందాం..

ఉత్తరప్రదేశ్‌లోని ఘాజీపూర్‌లో గల సైద్‌పూర్‌కు చెందిన శివశంకర్‌కు.. బసంత్ పట్టి నివాసి రంజనతో వివాహం నిశ్చయమైంది. ఇరువురి కుటుంబాలు పరస్పర అంగీకారంతో ఈ వివాహాన్ని నిశ్చయించుకున్నాయి. తిలక్ వేడుక కూడా ఆరు నెలల క్రితమే జరిగింది. జూన్ 11న వివాహ తేదీని నిర్ణయించారు. పెళ్లి తేదీ ఖరారైన తర్వాత యువతి, యువకుడు ఇద్దరూ ఫోన్‌లో నిత్యం మాట్లాడుకునేవారు. కానీ, పెళ్లి పీఠలపైనే ఈ పెళ్లి ఆగిపోయింది.

చిచ్చు పెట్టిన చెల్లెలి ప్రశ్న..

కూతురు పెళ్లికి తండ్రి ఏర్పాట్లన్నీ పూర్తి చేశాడు. వరుడు తన కుటుంబ సభ్యులతో కలిసి ఊరేగింపుగా బసంత్ పట్టికి చేరుకున్నాడు. అంతా హ్యాపీగా ఉన్నారు. వధువు కుటుంబ సభ్యులు వారికి ఘనంగా స్వాగతం పలికారు. అంతాబాగనే ఉండగా.. ఇంతలో వధువు చెల్లెలు వచ్చి బావ అయిన శివశంకర్‌ను ఆటపట్టించాలనుకుంది. ఇందులో భాగంగా అతన్ని మన దేశ ప్రధాని ఎవరు? అని ప్రశ్న వేసింది. దాంతో వరుడు అసౌకర్యానికి గురయ్యాడు. మరదలు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పలేకపోయాడు. దీంతో వధువు కుటుంబ సభ్యులందరూ కామెంట్స్ చేశారు. ప్రధాని పేరు చెప్పలేకపోవడాన్ని అవమానంగా భావించిన వధువు.. ఈ పెళ్లి చేసుకోబోనంటూ ప్రకటించింది.

ఇవి కూడా చదవండి

పెళ్లిలో బిగ్ ట్విస్ట్..

వధువు పెళ్లి చేసుకోనని ప్రకటించడంతో అంతా గందరగోళం నెలకొంది. ఈ పెళ్లికి వరుడు తమ్ముడు అనంత్ కూడా వచ్చాడు. పెద్దవాడు కాకపోతే చిన్నవాడిని పెళ్లి చేసుకోవాలంటూ కోరాడు వరుడి తండ్రి రామావతార్. దానికి వధువు కుటుంబ సభ్యులు నిరాకరించారు. ఇలా కాసేపు ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఆగ్రహంతో ఊగిపోయిన వరుడి తండ్రి రామావతార్.. తన తుపాకీతో వధువును బెదిరించాడు. తన చిన్న కొడుకును పెళ్లి చేసుకోవాలంటూ వార్నింగ్ ఇచ్చాడు. దాంతో బెదిరిపోయిన అమ్మాయి, ఆమె కుటుంబ సభ్యులు పెళ్లికి అంగీకరించారు. పెళ్లి కార్యక్రమం ముగిసిన తరువాత.. వధువును తమ ఇంటికి తీసుకువచ్చారు వరుడి తల్లిదండ్రులు. ఆ వెంటనే వధువు కుటుంబ సభ్యులు వరుడి ఇంటికి వచ్చి ఘర్షణకు దిగారు. తమ అమ్మాయిని తమ వెంట పంపాలంటూ డిమాండ్ చేశారు. ఈ వివాదంపై పోలీసులకు సమాచారం అందించారు. ఆ తరువాత సైలెంట్ అయ్యారు. అయితే, ఈ వివాదంపై స్పందించిన పోలీసులు.. తమకు ఎవరూ లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేయలేదని, ఫిర్యాదు అందితే వెంటనే చర్యలు తీసుకుంటామని తెలిపారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..