Mahakumbh-2025: మహాకుంభ మేళాలో మరో ప్రమాదం. కుప్పకూలిన పిపా వంతెన.. కొనసాగుతున్న రెస్క్యూ..!

ప్రయాగ్‌రాజ్ మహాకుంభ్‌లో మరో ప్రమాదం జరిగింది. సంగం ప్రాంతం వెలుపలి ఫఫామౌ ప్రాంతంలో గంగా నదిపై నిర్మించిన పిపా వంతెన కుప్పకూలింది. చాలా మంది సమాధి అయ్యారని భయపడుతున్నారు. ప్రస్తుతం ఘటనా స్థలంలో పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యల్లో నిమగ్నమై ఉన్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Mahakumbh-2025: మహాకుంభ మేళాలో మరో ప్రమాదం. కుప్పకూలిన పిపా వంతెన.. కొనసాగుతున్న రెస్క్యూ..!
Mahakumbh Accident

Updated on: Jan 31, 2025 | 9:46 PM

ప్రయాగ్‌రాజ్ మహాకుంభ్‌లో మరో ప్రమాదం జరిగింది. శుక్రవారం(జనవరి 31) మధ్యాహ్నం పవిత్ర సంగం ప్రాంతం వెలుపలి ఫఫామౌ ప్రాంతంలో గంగా నదిపై నిర్మించిన పిపా వంతెన ఒక్కసారిగా విరిగిపోయింది. వంతెన కూలిపోవడంతో చాలా మంది చిక్కుకుపోయి ఉంటారని భావిస్తున్నారు. ప్రస్తుతం ఘటనా స్థలంలో పరిస్థితి తీవ్రంగానే ఉంది. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యల్లో నిమగ్నమయ్యారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. జనవరి 29న మౌని అమావాస్య స్నానం రోజు సంగం ప్రాంతంలో జరిగిన తొక్కిసలాటలో 30 మంది భక్తులు మరణించగా, 60 మంది గాయపడ్డ సంగతి తెలిసిందే..!

మౌని అమావాస్య రోజు నుండి మహాకుంభానికి పెద్ద సంఖ్యలో భక్తులు పవిత్ర స్నానానికి తరలివస్తున్నారు. ప్రయాగ్‌రాజ్ నగర ప్రాంతం నుండి సంగం ప్రాంతం వరకు భక్తుల ప్రవాహం కొనసాగుతోంది. ఎక్కడ చూసినా భక్తులే దర్శనమిస్తున్నారు. వీరంతా బసంత్ పంచమి స్నానానికి సంగం ప్రాంతంలో విడిది చేస్తున్నారు. ఇతర భక్తులు కూడా అక్కడికి చేరుకుంటున్నారు.

ఈ ప్రమాదం జరిగిన ఫాఫమౌ ప్రాంతానికి సంగమం 10 కిలోమీటర్ల దూరంలో ఉంది. లక్నో, రాయ్‌బరేలీ, అయోధ్య, అమేథీ, సుల్తాన్‌పూర్, ప్రతాప్‌గఢ్‌ల నుంచి భక్తులు ఈ మార్గం గుండా వచ్చి వెళుతున్నారు. ఫాఫమౌలో గంగా నదిపై రెండు లేన్ల వంతెనను నిర్మించారు. మహాకుంభాన్ని దృష్టిలో ఉంచుకుని అధికారులు రెండు లైన్ల వంతెనకు ఆనుకుని పిపా వంతెనను నిర్మించింది. అంతే కాకుండా స్టీల్ బ్రిడ్జిని కూడా నిర్మించారు. దీని ద్వారా భక్తులు వచ్చి వెళ్లేందుకు ఏర్పాట్లు చేశారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..