సయీద్‌ని త్వరగా విచారించండి.. పాక్‌కు అమెరికా సూచన

| Edited By: Ravi Kiran

Dec 12, 2019 | 6:13 PM

ముంబై పేలుళ్ల సూత్రధారి హఫీజ్ సయీద్ ని పూర్తి స్థాయిలో ప్రాసిక్యూట్ చేసి,, విచారణ త్వరగా చేపట్టాలని పాకిస్తాన్ ను అమెరికా కోరింది. (దీన్ని బట్టి కౌంటర్ టెర్రరిజంపై పాక్ రెండు నాల్కల ధోరణి ని అమెరికా అనుమానిస్తోందని అర్థమవుతోంది). సయీద్ ని, అతని నలుగురు సహచరులను లాహోర్ లోని యాంటీ టెర్రరిజం కోర్టు మంగళవారం తీవ్రంగా తప్పు పట్టింది . ఉగ్రవాద కార్యకలాపాల కోసం నిధులు సేకరిస్తున్నాడని అభియోగాన్ని మోపింది. ముంబైలో 2008 లో జరిగిన […]

సయీద్‌ని త్వరగా విచారించండి.. పాక్‌కు అమెరికా సూచన
Follow us on

ముంబై పేలుళ్ల సూత్రధారి హఫీజ్ సయీద్ ని పూర్తి స్థాయిలో ప్రాసిక్యూట్ చేసి,, విచారణ త్వరగా చేపట్టాలని పాకిస్తాన్ ను అమెరికా కోరింది. (దీన్ని బట్టి కౌంటర్ టెర్రరిజంపై పాక్ రెండు నాల్కల ధోరణి ని అమెరికా అనుమానిస్తోందని అర్థమవుతోంది). సయీద్ ని, అతని నలుగురు సహచరులను లాహోర్ లోని యాంటీ టెర్రరిజం కోర్టు మంగళవారం తీవ్రంగా తప్పు పట్టింది . ఉగ్రవాద కార్యకలాపాల కోసం నిధులు సేకరిస్తున్నాడని అభియోగాన్ని మోపింది.

ముంబైలో 2008 లో జరిగిన పేలుళ్లలో అమెరికన్లతో బాటు 160 మందికి పైగా మృతి చెందగా… అనేకమంది గాయపడ్డారు. అయితే ఈ ‘ సూత్రధారిని ‘ మాత్రం పాకిస్తాన్ ప్రాసిక్యూట్ చేయలేదు. దీంతో అంతర్జాతీయ పరిశీలకులు, నిపుణులు.. ఉగ్రవాదంపై పోరు జరుపుతున్నామన్న పాక్ ప్రకటనలపై అనుమానాలు వ్యక్తం చేశారు. అమెరికాలో దక్షిణ, మధ్య ఆసియా వ్యవహారాలపై గల కమిటీ చైర్ పర్సన్ అయిన అలీస్ వెల్స్.. ఇదే సందేహాన్ని తన ట్వీట్ లో పేర్కొన్నారు. హఫీజ్ సయీద్ ని, అతని సహచరులను పాక్ ‘ అభిశంసించడం ‘ హర్షణీయమేనని, ముఖ్యంగా సయీద్ ని పూర్తి స్థాయిలో ప్రాసిక్యూట్ చేయాలని ఆమె కోరారు.

ఉగ్రవాదుల మనీ లాండరింగ్ కు సంబంధించిన లావాదేవీలపై ప్యారిస్ లోని ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ అనే వాచ్ డాగ్ ఓ కన్నేసి ఉంచుతోంది. ఆ నేపథ్యంలో.. ఉగ్రవాదం అదుపునకు చర్యలు తీసుకోనిపక్షంలో పాకిస్తాన్ ను ఈ సంస్థ బ్లాక్ లిస్టులో పెట్టవచ్చు. .