12 ఏళ్ళ పిల్లలకూ ఇక వ్యాక్సిన్, ఫైజర్ కంపెనీకి అధికారాలు ఇవ్వనున్న అమెరికా ? త్వరలో ఆమోదం లభించే సూచన

12-15 ఏళ్ళ మధ్య వయస్కులకు కూడా కోవిడ్ 19 వ్యాక్సిన్ ఇచ్ఛే అధికారాలను ఫైజర్ బయో ఎన్ టెక్ కంపెనీకి కట్టబెట్టాలని అమెరికా యోచిస్తోంది. పిల్లలకు, టీనేజర్లకు తమ టీకామందు...

12 ఏళ్ళ పిల్లలకూ ఇక వ్యాక్సిన్, ఫైజర్ కంపెనీకి అధికారాలు ఇవ్వనున్న అమెరికా ? త్వరలో ఆమోదం లభించే సూచన
Us Likely To Authorize Pfizer For Age 12 And Up

Edited By: Anil kumar poka

Updated on: May 04, 2021 | 11:39 AM

12-15 ఏళ్ళ మధ్య వయస్కులకు కూడా కోవిడ్ 19 వ్యాక్సిన్ ఇచ్ఛే అధికారాలను ఫైజర్ బయో ఎన్ టెక్ కంపెనీకి కట్టబెట్టాలని అమెరికా యోచిస్తోంది. పిల్లలకు, టీనేజర్లకు తమ టీకామందు ఇచ్చే అధికారాలను తమకు ఇవ్వాలని ఫైజర్ సంస్థ అమెరికా అధికారులకు దరఖాస్తు పెట్టుకుంది. అయితే యూఎస్ లోని ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్ డీ ఏ) ఈ వ్యాక్సిన్ కి సంబంధించి ఎమర్జెన్సీ యూజ్ ఆథరైజేషన్ రూల్స్ ని సవరించాల్సి ఉంటుంది. కానీ ప్రాసెస్ నేరుగా జరగాల్సి ఉంటుందని సీఎన్ ఎన్ వార్తాసంస్థ తెలిపింది. ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ వచ్చేవారం మొదట్లో ఇందుకు ఆమోదం తెలపవచ్ఛునని భావిస్తున్నారు. ఈ సంస్థ నిర్ణయం తీసుకున్న అనంతరం-సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ ప్రివెన్షన్ అడ్వైజరీ కమిటీ సమావేశమై ఈ టీకామందును ఎలా వినియోగించుకోవాలన్న విషయమై సిఫారసు చేయనుంది. ఫైజర్ కంపెనీ ఉత్పత్తి చేస్తున్న వ్యాక్సిన్ ని ప్రస్తుతం యూఎస్ లో 16 ఏళ్ళు పైబడినవారికి ఇస్తున్నారు. తాము 12-15 ఏళ్ళ మధ్య వయసున్న వారిని ఎంపిక చేసుకుని రెండు వేలకు పైగా క్లినికల్ ట్రయల్స్ నిర్వహించామని, మంచి ఫలితాలు వచ్చ్చాయనితెలిపిన ఫైజర్ సంస్థ- ఇందుకు సంబంధించిన డేటాను మార్చి నెలలో ప్రభుత్వానికి అందజేసినట్టు వెల్లడించింది. ఈ వ్యాక్సిన్ తీసుకున్న పిల్లల్లో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కనబడలేదని, ఈ టీకామందు సురక్షితమైనదేనని ఈ కంపెనీ పేర్కొంది. పిల్లలు, టీనేజర్లపై ఇంకా టెస్టింగులు కొనసాగుతున్నాయని స్పష్టం చేసింది.

కాగా మోడెర్నా కంపెనీ కూడా పిల్లలపై తమ వ్యాక్సిన్ ట్రయల్స్ నిర్వహిస్తోంది. వీటి ఫలితాలు వచ్చే సమ్మర్ లో విడుదల కావచ్చు. ఇక జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీ కూడా తమ వ్యాక్సిన్ ని బాలలకు ఇచ్చి చూస్తే ఎలా ఉంటుందని యోచిస్తోంది. అయితే అమెరికాలో చాలామంది తమ పిల్లలను వ్యాక్సిన్ ప్రయోగానికి పంపాలన్న ఈ కంపెనీల కోర్కెకు సుముఖంగా లేరు. అసలు చాలామంది వ్యాక్సిన్ తీసుకోవడానికి ఇష్ట పడడంలేదని తెలుస్తోంది.
మరిన్ని చదవండి ఇక్కడ : ఓటీటీలో దుమ్మురేపుతున్న పవన్ కళ్యాణ్ వీడియో వకీల్ సాబ్ … :Vakeel Saab creates record OTT video.
మూగజీవాలపై యాసిడ్ దాడి ..?ఏపీ లో మరో భయం! యాసిడ్ లంపి వైరస్ హడల్ వైరల్ వీడియో …