ఖమేనీ మరణంపై ఇస్తివా ముఫ్తీ భావోద్వేగం.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో!

ఇరాన్ సుప్రీం నాయకుడు ఆయతుల్లా అలీ ఖమేనీ మరణ వార్త ప్రపంచవ్యాప్తంగా ఆయన అభిమానులను శోకసంద్రంలో ముంచేసింది. ఇటు భారతదేశంలోని షియా సమాజం కూడా తీవ్ర దుఃఖం, ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తోంది. ఈ సందర్భంలో జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ కుమార్తె, పిడిపి నాయకురాలు ఇల్తిజా ముఫ్తీ తన సోషల్ మీడియా ఖాతాలో ఖమేనీకి నివాళులు అర్పిస్తూ ఒక భావోద్వేగ వీడియోను పోస్ట్ చేశారు.

ఖమేనీ మరణంపై ఇస్తివా ముఫ్తీ భావోద్వేగం.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో!
Pdp Leader Iltija Mufti Emotional

Updated on: Mar 01, 2026 | 6:40 PM

ఇరాన్ సుప్రీం నాయకుడు ఆయతుల్లా అలీ ఖమేనీ మరణ వార్త ప్రపంచవ్యాప్తంగా ఆయన అభిమానులను శోకసంద్రంలో ముంచేసింది. ఇటు భారతదేశంలోని షియా సమాజం కూడా తీవ్ర దుఃఖం, ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తోంది. ఈ సందర్భంలో జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ కుమార్తె, పిడిపి నాయకురాలు ఇల్తిజా ముఫ్తీ తన సోషల్ మీడియా ఖాతాలో ఖమేనీకి నివాళులు అర్పిస్తూ ఒక భావోద్వేగ వీడియోను పోస్ట్ చేశారు. ఈ వీడియోలో, ఖమేనీ ఒక పిల్లవాడితో మాట్లాడుతున్న ఫోటోను పంచుకున్నారు.

పిడిపి నాయకురాలు, మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ కుమార్తె ఇల్తిజా ముఫ్తీ ఈ వీడియోకు ‘‘నిజంగా, మనం అల్లాహ్ కు చెందినవాళ్ళం. మనమందరం అల్లాహ్ వద్దకు తిరిగి వెళ్తాము.’’ అని క్యాప్షన్ ఇచ్చారు. ‘ ఇది ఇస్లాంలో మరణానికి సంబంధించిన సంతాపం.

ఇల్తిజా ముఫ్తీ షేర్ చేసిన వీడియో సోషల్ మీడియాలో చాలా పాతది. అందులో, ఒక పిల్లవాడు ఇరాన్ నాయకుడు ఖమేనీతో మాట్లాడుతూ, “దయచేసి నేను అమరవీరుడవ్వాలని ప్రార్థించండి” అని అంటున్నాడు. ఖమేనీ స్పందిస్తూ, “ముందుగా, ఎదగండి, బాగా చదువుకోండి, జ్ఞానాన్ని పొందండి, ఇన్షా అల్లాహ్, ఇస్లాంకు ప్రయోజనకరంగా ఉండండి.. దీర్ఘకాలం జీవించండి, తరువాత అమరవీరుడిగా మారండి.” ఈ వీడియో ఖమేనీ తర్వాత అనేక ఖాతాలలో షేర్ చేయడంతో చాలా వైరల్ అవుతోంది.

ఆయతుల్లా అలీ ఖమేనీని ప్రపంచం మొత్తం, ముఖ్యంగా ఇస్లామిక్ ప్రపంచం అమరవీరుడిగా కీర్తిస్తోంది. 86 సంవత్సరాల వయస్సులో కూడా, ఆయన అమెరికా – ఇజ్రాయెల్‌కు తలొగ్గడానికి నిరాకరించారు. ఖమేనీకి భారతదేశంలో పెద్ద సంఖ్యలో అభిమానులు ఉన్నారు. దేశరాజధాని ఢిల్లీ సహా పలు ప్రాంతాల్లోని షియా సమాజం నిరసన తెలిపేందుకు వీధుల్లోకి వచ్చింది. షియా నాయకులు ప్రపంచ వేదికపై ఖమేనీకి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us