ఇదేందయ్యా ఇదీ.. అమ్మాయిగా మారడానికి ఆ పార్ట్ కట్ చేసుకున్నాడు.. చివర్లో ఊహించని ట్విస్ట్..

ఓ యువకుడు చేసిన పని అతడి ప్రాణాల మీదకు తెచ్చింది. సొంత వైద్యం కాస్త ఆస్పత్రిలో ఉండేలా చేసింది. సదరు యువకుడు ఏకంగా ప్రైవేట్ పార్ట్‌నే కట్ చేసుకుని షాక్‌కు గురి చేశాడు. అసలు ఎందుకు కట్ చేసుకున్నాడు. ఏం జరిగింది..? అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం..

ఇదేందయ్యా ఇదీ.. అమ్మాయిగా మారడానికి ఆ పార్ట్ కట్ చేసుకున్నాడు.. చివర్లో ఊహించని ట్విస్ట్..
Upsc Aspirant Attempts Gender Change

Updated on: Sep 12, 2025 | 5:54 PM

ప్రస్తుత డిజిటల్ యుగంలో ప్రతీ పనికి ఇంటర్‌నెట్‌నే ఆశ్రయిస్తున్నారు. మిగితావాటికి ఓకే గానీ.. హెల్త్‌కు సంబంధించిన విషయాల్లో అప్రమత్తంగా ఉండడం అవసరం. గతంలో ఓ వ్యక్తి యూట్యూబ్‌లో చూసి భార్యకు డెలివరీ చేయడం, మరో వ్యక్తి సొంతంగా చికిత్స చేసుకోవడం వంటివి ప్రాణాల మీదికి తెచ్చాయి. అయినా అటువంటి ఘటనలు ఆగడం లేదు. ప్రయాగ్‌రాజ్‌లో ఒక యువకుడు తీసుకున్న నిర్ణయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. అబ్బాయిగా పుట్టి, అమ్మాయిగా మారాలని అనుకోవడం మామూలే కానీ.. దాని కోసం యూట్యూబ్‌లో వీడియోలు చూసి, తన ప్రైవేట్ భాగాన్ని తానే కోసుకోవడం షాకింగ్. ఈ స్టోరీలో మెయిన్ ట్విస్ట్ ఏంటంటే.. ఆ యువకుడు ఎవరి సహాయం లేకుండా ఒక నకిలీ డాక్టర్ చెప్పిన మాటలు విని, మెడికల్ షాపులో ఇంజెక్షన్లు, బ్లేడ్ కొనుక్కున్నాడు. తన గదిలో ఒంటరిగా ఉన్నప్పుడు అనస్థీషియా ఇంజెక్షన్ తీసుకుని ఈ సెల్ఫ్ సర్జరీ చేసుకున్నాడు. ఇంజెక్షన్ ప్రభావం ఉన్నంత సేపు బానే ఉన్నా.. అది తగ్గిన తర్వాత నొప్పి తట్టుకోలేక విలవిలలాడిపోయాడు. రక్తం కారిపోవడంతో ప్రాణాల మీదకు వచ్చింది.

చిన్నప్పటి నుంచే..

ఆ యువకుడు తాను అబ్బాయిని కాదని, అమ్మాయిని అని చిన్నప్పటి నుంచే భావించేవాడు. దాదాపు 14 సంవత్సరాల వయస్సు నుండి అతనిలో ఈ ఆలోచనలు మొదలయ్యాయి. కానీ తన కుటుంబ సభ్యులకు ఈ విషయం చెప్పే ధైర్యం చేయలేకపోయాడు. అమేథీ జిల్లాకు చెందిన ఈ యువకుడు.. తల్లిదండ్రులకు ఏకైక కుమారుడు కావడంతో ఒత్తిడికి లోనై ప్రయాగ్‌రాజ్‌కు వచ్చి యూపీఎస్సీ కోసం ప్రిపేర్ అవుతున్నాడు.

నొప్పితో విలవిల

కాగా అనస్థీషియా ప్రభావం ఉన్నంత వరకు అంతా బాగానే ఉన్నా, దాని ప్రభావం తగ్గిపోగానే తీవ్రమైన నొప్పి మొదలవడంతో యువకుడు విలవిలలాడిపోయాడు. గంటసేపు నొప్పిని భరించిన తర్వాత, రక్తం ఎక్కువగా పోవడంతో, చివరికి ఇంటి యజమానికి విషయం చెప్పాడు. ఇంటి యజమాని వెంటనే అంబులెన్స్‌కు ఫోన్ చేసి, అతడిని ఆస్పత్రికి తరలించాడు. ప్రస్తుతం అతడి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు తెలుస్తోంది.

ఆ యువకుడు ఒక రకమైన జెండర్ వ్యాధితో బాధపడుతున్నాడని వైద్యులు తెలిపారు. ఈ సమస్య ఉన్నవాళ్లు తమ శరీరానికి, తమ మనసులోని జెండర్‌కు సంబంధం లేదని భావిస్తారు. సరైన వైద్య సహాయం తీసుకోకపోవడం వల్ల ఇలాంటివి జరుగుతాయని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. అదృష్టవశాత్తు ఇంటి యజమాని అతన్ని సరైన సమయంలో హాస్పిటల్‌లో చేర్చడం వల్ల ప్రాణాలు నిలిచాయి. ఇప్పుడు అతనికి మానసిక వైద్యులు కౌన్సెలింగ్ ఇస్తున్నారు. ఇలాంటి విషయాల్లో నకిలీ వైద్యులను నమ్మకుండా, సరైన నిపుణులను సంప్రదించడం ఎంత ముఖ్యమో ఈ ఘటన మరోసారి రుజువు చేసింది.