ఉత్తరప్రదేశ్ బండాలో కుర్హారా అనే ఊరుంది.. ఊరన్నాక గుడి ఉంటుంది కదా! అక్కడ సీతారాముల ఆలయం ఉంది.. ఆ గుడికి రామ్‌కుమార్ దాస్ ప్రధాన పూజారిగా వ్యవహరిస్తున్నారు..గుడి బాగోగులు కూడా ఆయనే చూసుకుంటున్నారు.ఇప్పుడాయనకు బోలెడంత కష్టం వచ్చిపడింది. తాను పండించిన పంటను అమ్ముకోలేక అవస్థలు పడుతున్నాడా పూజారి.. ధాన్యాన్ని అమ్ముకోవాలంటే ఇప్పుడాయనకు అర్జెంట్‌గా ఆధార్‌కార్డు కావాలి.. అది కూడా దేవుడిది! మీరు విన్నది కరెక్టే .. అధికారులు అడుగుతున్నది దేవుడి ఆధార్ కార్డే! అదెక్కడ్నుంచి తెచ్చేది భగవంతుడా ? అని తాను నిత్యం పూజించే రాములవారిని వేడుకుంటున్నాడు రామ్‌కుమార్‌దాస్..
అసలేం జరిగిందంటే.. ఆలయానికి సంబంధించిన భూమిలో రామ్‌కుమార్‌దాస్ గోధుమ పంట వేశారు. బాగా కష్టపడ్డారు కాబట్టి వంద క్వింటాళ్ల పంట చేతికొచ్చింది. రెండు రోజుల కిందటపంటలను అమ్ముకునేందుకు ఆన్‌లైన్‌లో రిజిస్టర్ చేసుకున్నారు. గోధుమ పంటను తీసుకుని ప్రభుత్వ మార్కెట్ యార్డ్‌కు వెళ్లారు. ధాన్యం కొనాలంటే భూమి ఎవరి పేరు మీద రిజిస్టర్ అయి ఉందో వారి ఆధార్‌కార్డు తీసుకురావాలన్నారు అధికారులు. ఆ మాట విన్న రామ్‌కుమార్ దాస్‌కు మైండ్ బ్లాంకయ్యింది. ఏం చేయాలో తెలియక రాముడిని వేడుకున్నాడు.. ఎందుకంటే ఆ భూమి సీతారాముల పేరు మీద రిజిస్టర్ అయి ఉంది. ఇప్పుడు ఆయనకు అర్జెంట్‌గా రాముడు, సీతాదేవి ఆధార్‌కార్డులు కావాలి. ఆ సీతారాములు మాత్రం ఎక్కడ్నుంచి ఆధార్‌గార్డులు తీసుకురాగలరు?
ఇదంతా లాభం లేదనుకున్న రామ్‌కుమార్ దాస్ సబ్ రిజిస్టార్ కార్యాలయానికి వెళ్లి తన గోడంతా వెలిబుచ్చుకున్నారు. సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ సౌరభ్ శుక్లా ఆయన ఆవేదనంతా విన్నారు. తానేమీ చేయలేనని చేతులెత్తేశారు.. ఆధార్ లేకుండా రిజిస్ట్రేషన్ చేయలేమని, రిజిస్ట్రేషన్ లేకుండా పంట కొనలేమని చల్లగా చెప్పారు. లాస్టియర్ తాను 150 క్వింటాళ్ల ధాన్యాన్ని ప్రభుత్వ మార్కెట్‌లో అమ్మానని, ఇప్పుడెందుకు ఈ రూల్స్ పెట్టారో అర్థం కావడం లేదని అంటున్నారు దాస్. గత కొన్నేళ్లుగా తాను దేవుడి మాన్యంలో పండిన పంటను ఇక్కడే విక్రయిస్తున్నానని, ఇలాంటి పరిస్థితిని ఎప్పుడూ తనకు రాలేదని వాపోతున్నారు. ఇప్పుడు పంట అమ్మితేనే తనకు నాలుగు డబ్బులు వస్తాయని, అవి రాకుంటే తన కుటుంబం ఆకలితో అలమటిస్తుందని అంటున్నారు. జిల్లాల సరఫరా అధికారి గోవింద్ ఉపాధ్యాయనేమో మఠాలు, ఆలయాల నుంచి వచ్చే పంట ఉత్పత్తులను కొనుగోలు చేయవద్దని నిబంధనలు స్పష్టంగా ఉన్నాయంటున్నారు. పాపం రామ్‌కుమార్ దాస్ కష్టాలను ఎవరు తీరుస్తారో!
మరిన్ని ఇక్కడ చూడండి: చీర కట్టులో గుర్రపు స్వారీ చేస్తున్న మోనాలిసా..నెట్టింట్లో వైరల్ గా మారిన వీడియో.: woman riding a horse video.
Corona 3rd wave : తెలుగు రాష్ట్రాలుపై థర్డ్ వెవ్ కలవరం..అప్రమత్తం అయిన ప్రభుత్వాల సంచలన నిర్ణయాలు.