యూపీలో పోలీసుల అరాచకాలు, దౌర్జన్యాలు పెరిగిపోతున్నాయి. వట్టి పుణ్యానికి అమాయకులపై జులుం ప్రదర్శిస్తున్నారు. బాధితులు, విపక్ష నేతలు సైతం ఎన్ని సార్లు వీరి ఆగడాల గురించి ప్రభ్జుత్వానికి ఫిర్యాదు చేసినా ఫలితం లేకుండా పోతోంది. నిన్న బాగ్ పట్ లోని ఓ వ్యాక్సినేషన్ సెంటర్లో జరిగిన ఓ ఘటనే ఇందుకు నిదర్శనంగా చూపుతున్నారు. ఈ సెంటర్లో వ్యాక్సిన్ తీసుకోవడానికి వచ్చిన 20 ఏళ్ళ యువకుడిని అక్కడే ఉన్న పోలీసులు అడ్డగించి అతడ్ని ఇష్టం వచ్చినట్టు లాఠీలతో బాదారు. తనను ఎందుకు కొడుతున్నారని ప్రశ్నించిన పాపానికి వాళ్ళు మరింత రెచ్చిపోయారు. నిర్దాక్షిణ్యంగా ఎక్కడ బడితే అక్కడ కొట్టారు. దీంతో ఆ యువకుడు అక్కడి నుంచి వెళ్ళిపోయి తన ఇంటికి దూరంగా ఉన్న చెట్టుకు ఉరేసుకుని సూసైడ్ చేసుకున్నాడు. ఇతడిపై తమ ‘ప్రతాపం’ చూపాక ఖాకీలు అతడి ఇంటికి వెళ్లి అతని తల్లిపై కూడా దాడి చేశారు. వ్యాక్సినేషన్ సెంటర్ లో జరిగిన గొడవను ఎవరో తమ సెల్ లో చిత్రీకరించి వీడియో ను రిలీజ్ చేశారు. కాగా తన కుమారుని ఆత్మహత్యకు ఈ పోలీసులే కారణమని, వారు తన భార్యపై కూడా దాడి చేశారనిమృతుని తండ్రి పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశాడు.
వారు వెంటనే డ్యూటీ నుంచి పదిమంది పోలీసులను తొలగించారు. యువకుని సూసైడ్ కి ప్రేరేపించారన్న ఆరోపణపై ఐదుగురిపై కేసు పెట్టారు. అసలు ఈవ్యాక్సినేషన్ సెంటర్లో జరిగిన గొడవకు కారణమేమిటన్న దానిపై ఖాకీలు దర్యాప్తు జరుపుతున్నారు. రాష్ట్రంలో నేరాలు, ఘోరాలు పెరిగిపోతున్నాయని, శాంతి భద్రతలు క్షీణిస్తున్నాయని సమాజ్ వాదీ పార్టీ, కాంగ్రెస్, బహుజన్ సమాజ్ పార్టీ వంటి నేతలు పదేపదే ఆరోపిస్తున్నారు. ఈ యువకుని కుటుంబానికి న్యాయం జరగాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది.
మరిన్ని ఇక్కడ చూడండి : చిరంజీవి, ఎన్టీఆర్ చెప్పారని 4ఏళ్లు.. నేర్చుకున్నా..! యువహీరో తో ఇంట్రస్టింగ్ ఇంటర్వ్యూ:Hero Teja Sajja video.
ఈ టీవీ ధర వింటే…మూర్ఛపోవడం ఖాయం..సరికొత్త టెక్నాలజీ రూపొందించిన శాంసంగ్:Samsung The Wall Video
మంచుకొండల్లో చిక్కుకున్న యంగ్ హీరో.. అడ్వంచరస్ టూర్‌లో బిజీ బిజీ..: Navdeep Video.