అర్థరాత్రి గర్ల్‌ఫ్రెండ్ ఇంటికెళ్లిన అబ్బాయి.. కట్ చేస్తే, తల్లిదండ్రుల ఎంట్రీ.. తీన్మార్ సీన్
ఉత్తరప్రదేశ్‌లో ఆశ్చర్యక ఘటన వెలుగు చూసింది. ఒక యువకుడు అర్థరాత్రి తన స్నేహితురాలిని కలిసేందుకు ఆమె ఇంటికి వెళ్లాడు. అప్పుడే సడెన్‌గా యువతి కుటుంబ సభ్యులు వచ్చారు. ఇంట్లో కూతురితో పాటు యువకుడిని చూసిన తల్లిదండ్రులు అతన్ని బంధించి.. ఉందయం పంచాయతీ పెట్టి ఇద్దరికి పెళ్లి చేశారు.

ఉత్తరప్రదేశ్‌లో తన స్నేహితురాలిని కలిసేందుకు అర్ధరాత్రి ఆమె ఇంటికి వెళ్లిన ఒక యువకుడికి ఊహించని పరిణామం ఎదురైంది. అతను తన స్నేహితురాలితో రహత్యసంగా మాట్లాడుతుండగా ఇంట్లోకి వచ్చిన కుటుంబసభ్యులు అతన్ని పట్టుకొని బంధించి.. ఉదయం పంచాయతీ పెట్టి.. ఇద్దరికి వివాహం జరిపించారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. వివరాల్లోకి వెళితే.. ఉత్తరప్రదేశ్‌లోని జలౌన్ జిల్లాలోని సున్హేటా గ్రామంలో ఈ ఘటన వెలుగు చూసింది.
హమీర్‌పూర్ జిల్లాకు చెందిన నిర్మల్ సింగ్ అనే యువకుడు తన స్నేహితురాలిని కలవడానికి అర్థరాత్రి ఆమె ఇంటికి రహస్యంగా వెళ్లాడు. అయితే ఒక వివాహ వేడుకకు వెళ్లిన యువతి కుటుంబ సభ్యులు కరెక్ట్‌గా అదే సమయంలో ఇంటికి వచ్చారు. ఇంట్లో తమ కుమార్తెతో ఉన్న యువకుడిని చూసి వాళ్లు షాక్ అయ్యారు. కోపంతో ఆ యువకుడిని పట్టుకొని.. రాత్రంతా ఇంట్లో బందీగా ఉంచారు. ఉదయం గ్రామ పెద్దలను పిలిచి పంచాయతీ పెట్టి.. అందరి సమక్షంలో గ్రామంలోని ఆలయంలో వారిద్దరికి వివాహం జరిపించారు.
ఇందుకు సంబంధించిన న్యూస్ వైరల్ కావడంతో ఈ సంఘటన స్థానికంగా తీవ్ర చర్చకు దారి తీసింది. కొందరు నెటిజన్లు కుటుంబం కఠిన నిర్ణయాన్ని సమర్థించగా మరికొందరు దీన్ని వ్యక్తిగత స్వేచ్ఛకు భంగంగా పరిగణించారు.
गर्लफ्रेंड के घर में रोमांस.. लड़की के परिजनों ने पकड़ा.. बंधक बना रात भर धुनाई.. सुबह की किरण खुश खबरी लाई। मन्दिर में हुए 7 फेरे….
UP में जालौन जनपद के सुनहेटा गांव में एक युवक निर्मल सिंह को चोरी-छिपे प्रेमिका से मिलने जाना भारी पड़ गया। रात के अंधेरे में प्रेमिका के घर… pic.twitter.com/ZildRCEvlP
— TRUE STORY (@TrueStoryUP) October 6, 2025
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
