నిర్భయ దోషులను ఉరితీయబోయేది ఇతడేనా..!
దిశ హత్యాచారం కేసులో నిందితుల ఎన్‌కౌంటర్ నేపథ్యంలో మరోసారి నిర్భయ కేసు తెర పైకి వచ్చింది. నిర్భయ దోషులను ఉరి తీయాలంటూ పలువురు ఆందోళనకారులు తమ నిరసనను తెలుపుతున్నారు. ఈ క్రమంలో ఆ దోషులను ఉరి తీసేందుకు ఢిల్లీలోని తీహార్ జైలులో ఏర్పాట్లు మొదలయ్యాయని గత కొన్ని రోజులుగా వార్తలు గుప్పుమంటున్నాయి. ఇక నిర్భయపై అత్యాచారం జరిగిన డిసెంబర్ 16వ తేదీనే ఆ మానవ మృగాలను ఉరి తీయబోతున్నట్లు సమాచారం. అయితే తీహార్ జైలులో ప్రస్తుతం తలారీలు […]
దిశ హత్యాచారం కేసులో నిందితుల ఎన్‌కౌంటర్ నేపథ్యంలో మరోసారి నిర్భయ కేసు తెర పైకి వచ్చింది. నిర్భయ దోషులను ఉరి తీయాలంటూ పలువురు ఆందోళనకారులు తమ నిరసనను తెలుపుతున్నారు. ఈ క్రమంలో ఆ దోషులను ఉరి తీసేందుకు ఢిల్లీలోని తీహార్ జైలులో ఏర్పాట్లు మొదలయ్యాయని గత కొన్ని రోజులుగా వార్తలు గుప్పుమంటున్నాయి. ఇక నిర్భయపై అత్యాచారం జరిగిన డిసెంబర్ 16వ తేదీనే ఆ మానవ మృగాలను ఉరి తీయబోతున్నట్లు సమాచారం. అయితే తీహార్ జైలులో ప్రస్తుతం తలారీలు ఎవరూ లేకపోగా.. ఆ జైలు అధికారులు యూపీ జైళ్ల శాఖకు లేఖ రాశారు. తమకు ఇద్దరు తలారీలు కావాలంటూ వారు ఆ లేఖలో పేర్కొన్నారు. దీనిపై లఖ్‌నవు అదనపు డీజీపీ ఆనంద్ కుమార్ మాట్లాడుతూ.. లఖ్‌నవుకు చెందిన తలారీ అనారోగ్యంగా ఉన్నాడని, అయితే మేరఠ్‌కు చెందిన తలారీ సిద్ధంగా ఉన్నాడని పేర్కొన్నారు.
కాగా మేరఠ్‌కు చెందిన తలారీ పేరు పవన్ జలాద్. ఈ విషయంపై ఆయన ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ.. నాకు తెలిసి ఆ దోషులందరినీ ఉరి తీయబోతున్నారని అనుకుంటున్నా. దీనికి సంబంధించి మేరఠ్ జైలు అధికారుల నుంచి నాకు ఎలాంటి సమాచారం అందలేదు. ఒకవేళ ఆదేశాలు వస్తే 24గంటల్లోనే తీహార్ జైలుకు చేరుకొని నా డ్యూటీని నెరవేరుస్తా అని చెప్పుకొచ్చారు. కాగా పవన్ జవాద్ దేశంలోనే ప్రొఫెషనల్‌గా గుర్తింపు పొందారు. గతంలో సీరియల్ కిల్లర్ అయిన సురేందర్ కోలిని ఇతడే ఉరి తీశారు. అయితే నిర్భయ హత్య కేసులో మొత్తం ఆరుగురిని దోషులుగా తేల్చారు. అక్షయ్ థాకూర్, ముఖేష్ సింగ్, వినయ్ శర్మ, పవన్ గుప్తా, రామ్ సింగ్, మొహమ్మద్ అఫ్రోజ్‌లను తేల్చారు. వారిలో రామ్ సింగ్ 2015లో జైల్లో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇక మైనర్ అయిన మొహమ్మద్ అఫ్రోజ్(అలియాస్ రాజు) జువైనల్ యాక్ట్ కింద మూడేళ్లు జైలు శిక్ష అనుభవించి బయటకు వచ్చేశాడు. ఇప్పుడు మిగిలిన నలుగురికి ఉరి తీయబోతున్నట్లు తెలుస్తోంది.