AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sundar Pichai FIR: ఆశ్చర్యం ! గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ పై యూపీ పోలీసుల కేసు, తొలగించిన ఖాకీలు

Google Sundar Pichai : గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ పైన, మరో 17 మందిపైన యూపీలోని వారణాసి పోలీసులు కేసు పెట్టారు. గతవారం వీరిపై ఎఫ్ ఐ ఆర్ నమోదు చేసి అందర్నీ ఆశ్చర్యపరిచారు.

Sundar Pichai FIR: ఆశ్చర్యం ! గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ పై యూపీ పోలీసుల కేసు, తొలగించిన ఖాకీలు
Umakanth Rao
| Edited By: Pardhasaradhi Peri|

Updated on: Feb 13, 2021 | 12:23 PM

Share

Sundar Pichai FIR: గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ పైన, మరో 17 మందిపైన యూపీలోని వారణాసి పోలీసులు కేసు పెట్టారు. గతవారం వీరిపై ఎఫ్ ఐ ఆర్ నమోదు చేసి అందర్నీ ఆశ్చర్యపరిచారు. ప్రధాని  మోదీని కించపరిచేట్టుగా ఉన్న ఓ వీడియో రూపకల్పనలో వీరి ప్రమేయం ఉందన్న ఫిర్యాదు రావడంతో పోలీసులు ఇలా కేసు పెట్టారు. అయితే ఆ తరువాత అబ్బే..అలాంటిదేమీ లేదని తెలిశాక వారి పేర్లను ఎఫ్ ఐ ఆర్ నుంచి తొలగించారు.  సుందర్ పిచాయ్ తో బాటు గూగుల్ కి చెందిన మరో ముగ్గురు ఉన్నతాధికారుల పేర్లు కూడా ఉన్నప్పటికీ.. చివరకు అసలు విషయం తెలిసి.. నాలుక్కరుచుకున్నారు. ఈ వీడియో మొదట వాట్సాప్ గ్రూప్ లో, ఆ తరువాత యూ ట్యూబ్ లో సర్క్యులేట్ అయిందని, దానికి 5 లక్షల వ్యూస్ వచ్చాయని, వారణాసి లోని ఓ వ్యక్తి పోలీసులు ఇచ్చిన ఫిర్యాదులో తెలిపాడు.  ఆ వెంటనే తన మొబైల్ ఫోన్ కు ఎనిమిదిన్నర వేల  బెదిరింపు కాల్స్ వచ్చాయని ఆయన పేర్కొన్నాడు. సుందర్ పిచాయ్ సహా సంజయ్ కుమార్ గుప్తా తదితరుల పేర్లు ఈ ఎఫ్ ఐ ఆర్ లో ఉన్నాయి.

దీనిపై గూగుల్ స్పందన ఇంకా తెలియాల్సి ఉంది. ఈ వీడియో సాంగ్ ను ఘాజీపూర్ లోని మ్యుజిషియన్లు రూపొందించారని, వారితో బాటు రికార్డింగ్ స్టూడియో, స్థానిక మ్యూజిక్ లేబెల్ కంపెనీ నిర్వాహకులకు  కూడా ఈ కేసుతో ప్రమేయమున్నట్టు  పోలీసులు పేర్కొన్నారని తెలుస్తోంది. ఏమైనా గూగుల్ ‘అగ్రనేతలకు’ , ఈ కేసుకు లింక్ ఉన్నట్టు వచ్చిన వార్త కలవరం రేపుతోంది. యూపీ పోలీసుల ‘హడావుడి’ అంతా ఇంత కాదని తెలియడానికి ఈ ఉదంతం కన్నా మరో నిదర్శనం ఇంకేముంటుంది ?

Also Read: 

Covid Vaccine Second Dose: 28రోజుల అనంతరం నేడు రెండో డోసు వ్యాక్సినేషన్, ఎయిమ్స్ చీఫ్, నీతి ఆయోగ్ సభ్యుడు కూడా !

ధూమ్‌-4 సీక్వెల్‌లో విలన్‌గా బాలీవుడ్ సొట్టబుగ్గల సుందరి..? అదిరిపోయే యాక్షన్ సీన్స్‌తో ఇక అభిమానులకు పండగే..