PM Narendra Modi: అలా అస్సలు చేయొద్దు.. బీజేపీ నేతకు వార్నింగ్ ఇచ్చిన ప్రధాని మోదీ.. ఆ తర్వాత ఏం జరిగిందో చూడండి..

|

Feb 21, 2022 | 1:38 PM

BJP leader touches PM Modi's feet: ప్రధానమంత్రి నరేంద్రమోదీ హుందాతనం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రాజకీయాల్లో సరికొత్త అధ్యాయాన్ని లిఖించి.. ప్రధాని మోదీ ప్రపంచ అగ్రనాయకుల్లో ఒకరిగా నిలిచారు.

PM Narendra Modi: అలా అస్సలు చేయొద్దు.. బీజేపీ నేతకు వార్నింగ్ ఇచ్చిన ప్రధాని మోదీ.. ఆ తర్వాత ఏం జరిగిందో చూడండి..
Pm Modi
Follow us on

BJP leader touches PM Modi’s feet: ప్రధానమంత్రి నరేంద్రమోదీ హుందాతనం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రాజకీయాల్లో సరికొత్త అధ్యాయాన్ని లిఖించి.. ప్రధాని మోదీ ప్రపంచ అగ్రనాయకుల్లో ఒకరిగా నిలిచారు. అందుకే అందరూ ఆయన్ను గొప్ప నేతగా అభివర్ణిస్తుంటారు. ప్రధాని మోదీ హుందాతనం.. ప్రసంగాలు, సందర్భానుసారంగా వ్యవహారశైలి ఇలా అన్ని విషయాలు ఆయన అభిమానులను ఆకట్టుకుంటుంటాయి. తాజాగా.. ఓ ఎన్నికల (UP Election 2022) సభలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ.. ప్రవర్తించిన విధానం అందర్ని ఆకట్టుకుంటోంది. తనకు పాదాభివందనం చేస్తున్న బీజేపీ నాయకుడిని ప్రధాని మోదీ (PM Narendra Modi) వద్దని వారించారు.. ఆ తర్వాత ఆయన కాళ్లకే నమస్కరించారు. ఇదంతా చూసిన నేతలు, బీజేపీ శ్రేణులు.. ప్రధాని మోదీ హుందాతనం అంటే ఇదేనంటూ ప్రశంసిస్తున్నారు. దీంతోపాటు ఈ సన్నివేశానికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. అదేంటో ఇప్పుడు చూద్దాం..

యూపీ ఎన్నికల్లో భాగంగా ప్రధాని మోదీ ఆదివారం ఉన్నావ్‌లో జరిగిన ఎన్నికల సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీజేపీ ఉన్నావ్ జిల్లా అధ్యక్షుడు అవధేష్ కతియార్ ప్రధాని మోదీ పాదాలను తాకేందుకు ప్రయత్నించారు. ఈ సందర్భంలో ప్రధాని నరేంద్రమోదీ ఇలా చేయవద్దంటూ.. ఆయనకు సూచించారు. అనంతరం ఆయనకే నమస్కారం చేస్తూ ప్రధాని మోదీ కనిపించారు. సభలో బీజేపీ యూపీ చీఫ్ స్వతంత్ర దేవ్ సింగ్.. ఉన్నావ్ జిల్లా అధ్యక్షుడు అవధేష్ కతియార్‌‌ను శ్రీరాముడి విగ్రహాన్ని ప్రధానికి బహూకరించాలని కోరారు. ఈ సమయంలో ఈ సన్నివేశం చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వీడియోలు వైరల్ కావడంతో.. మోదీ అభిమానులు ఆయన్ను ప్రశంసిస్తూ కామెంట్లు చేస్తున్నారు.

కాగా.. ఈ సభలో ప్రసంగించిన ప్రధాని మోదీ.. సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ పై విరుచుకుపడ్డారు. వారంతా వారి ప్రయోజనం కోసమే చూసుకుంటారని.. బీజేపీ అందరి ప్రయోజనాల కోసం పనిచేస్తుందన్నారు. బీజేపీ మళ్లీ అధికారంలోకి రావడం ఖాయమంటూ ప్రధాని మోదీ ఆశాభావం వ్యక్తంచేశారు. కాగా.. యూపీ ఎన్నికల్లో భాగంగా ఫిబ్రవరి 23 న నాలుగో దశ పోలింగ్ జరగనుంది. ఉన్నావ్ జిల్లాలో ఆరు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. 403 మంది సభ్యులున్న ఉత్తరప్రదేశ్‌ శాసనసభకు ఏడు దశల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. చివరి దశ మార్చి 7న జరగనుంది. ఓట్ల లెక్కింపు మార్చి 10న జరగనుంది.

Also Read:

Sonu Sood: పంజాబ్‌ మోగాలో సోనూసూద్‌కు ఈసీ ఝలక్.. కారును సీజ్‌ చేసిన పోలీసులు..

UP Election 2022: ఓటు వేసి.. సోషల్ మీడియాలో షేర్ చేసిన మేయర్‌.. ఆ తర్వాత దిమ్మతిరిగే షాక్..