National Flag: జాతీయ జెండా వినియోగంపై కేంద్రం కొత్త మార్గదర్శకాలు.. ఉత్తర్వులు జారీ చేసిన హోంమంత్రిత్వ శాఖ

|

Aug 09, 2021 | 2:56 PM

స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా జాతీయ జెండాలను వినియోగించడంపై కేంద్ర ప్రభుత్వం కీలక మార్గదర్శకాలు.

National Flag: జాతీయ జెండా వినియోగంపై కేంద్రం కొత్త మార్గదర్శకాలు.. ఉత్తర్వులు జారీ చేసిన హోంమంత్రిత్వ శాఖ
Indian National Flag
Follow us on

Indian National Flags: స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా జాతీయ జెండాలను వినియోగించడంపై కేంద్ర ప్రభుత్వం కీలక మార్గదర్శకాలను జారీ చేసింది. ఈ మేరకు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు సూచనలు చేసింది. ఈ నేపథ్యంలో ప్లాస్టిక్‌తో తయారు చేసిన జెండాలను ఎట్టిపరిస్థితుల్లోనూ వాడకూడదని హుకుం జారీ చేసింది. ముఖ్యంగా పర్యావరణానికి హాని కలిగించే ప్లాస్టిక్ వాడొద్దని ప్రజలకు అవగాహన కల్పించాలని విజ్ఞప్తి చేసింది. క్లాత్ తయారు చేసిన జెండాలను మాత్రమే వినియోగించాలని సూచించింది.

జాతీయ జెండా ప్రజల నమ్మకాలకు, విశ్వాసాలకు ప్రతీక ఉండాలంటే తగిన గౌరవం ఇవ్వాల్సిన అవసరం ఉందని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. ఏదైనా ముఖ్యమైన కార్యక్రమాలు నిర్వహించినపుడు ప్లాస్టిక్‌తో కాకుండా పేపర్‌తో తయారు చేసిన జెండాలను వాడాలని తెలిపింది. ప్లాస్టిక్ జెండాలు పేపర్ వాటిలా పర్యావరణంలో కలిసిపోవని, అలాగే బయటపడవేయడం సరైంది కాదని పేర్కొంది. ముఖ్యమైన జాతీయ, సాంస్కృతిక కార్యక్రమాల్లో ఫ్లాగ్ కోడ్ ఆఫ్‌ ఇండియా-2002 ప్రకారం పేపర్‌తో తయారు చేసిన జెండాలు వాడుతారనే విషయాన్ని నిర్ధారించుకోవాలని సూచించింది. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ తెలిపింది.

Read Also…  Neeraj Chopra: నీరజ్ చోప్రా కోసం కేంద్ర ప్రభుత్వం ఎంత ఖర్చు చేసిందో తెలిస్తే షాకవుతారు..!