Smriti Irani: కేంద్ర మంత్రి స్మృతి ఇరానీకి కరోనా పాజిటీవ్.. ఐసోలేషన్‌లో ఉన్నానంటూ ట్విట్..

|

Jun 19, 2022 | 10:39 PM

తాజాగా నిర్వహించిన పరీక్షలో కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు స్మృతి ఇరానీ ఆదివారం రాత్రి పేర్కొన్నారు. ఈ మేరకు స్మృతి ఇరానీ ట్వీట్ చేశారు.

Smriti Irani: కేంద్ర మంత్రి స్మృతి ఇరానీకి కరోనా పాజిటీవ్.. ఐసోలేషన్‌లో ఉన్నానంటూ ట్విట్..
Smriti Irani
Follow us on

Smriti Irani Tests Covid-19 Positive: దేశంలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. ఈ క్రమంలో సామాన్యుల నుంచి ప్రముఖుల వరకు అందరూ కరోనా బారిన పడుతున్నారు. తాజాగా.. కేంద్ర మహిళా, శిశు అభివృద్ధి శాఖ మంత్రి స్మృతి జుబిన్ ఇరానీ కోవిడ్ -19 బారిన పడ్డారు. తాజాగా నిర్వహించిన పరీక్షలో కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు స్మృతి ఇరానీ ఆదివారం రాత్రి పేర్కొన్నారు. ఈ మేరకు స్మృతి ఇరానీ ట్వీట్ చేశారు. రాజేంద్ర నగర్‌లో బీజేపీ నిర్వహించిన కార్యక్రమానికి హాజరు కాలేకపోయినందుకు క్షమాపణలు చెప్పిన ఇరానీ.. తనకు వైరస్ పాజిటివ్‌గా‌గా తేలినట్లు చెప్పారు. ప్రస్తుతం తాను ఐసోలేషన్‌లో ఉన్నానంటూ పేర్కొన్నారు. కాగా.. స్మృతీ ఇరానీ గతంలో 2020లో కరోనావైరస్ బారిన పడ్డారు. ఆ సమయంలో తనను కలిసిన వారంతా పరీక్షలు చేయించుకోవాలని.. కరోనా నిబంధనలు పాటించాలని సూచించారు.

గత కొన్ని వారాలుగా భారతదేశంలో కోవిడ్-19 కేసులు పెరుగుతున్నాయి. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ డేటా ప్రకారం.. భారతదేశంలో ఆదివారం 12,899 కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో కేసుల సంఖ్య 4,32,96,692కి పెరిగింది. అయితే క్రియాశీల కేసుల సంఖ్య 72,474కి పెరిగింది. దీంతోపాటు ఈ మహమ్మారి కారణంగా 15 మరణించారు. దీంతో మరణాల సంఖ్య 5,24,855కి చేరింది. మొత్తం ఇన్ఫెక్షన్‌లలో యాక్టివ్ కేసులు 0.17 శాతం ఉండగా.. రికవరీ రేటు 98.62 శాతంగా ఉంది. కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 4,26,99,363కి పెరిగింది. ఇదిలాఉంటే.. దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ డ్రైవ్ కింద దేశంలో ఇప్పటివరకు 196.14 కోట్ల కోవిడ్ -19 వ్యాక్సిన్ డోసులను అందించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..