Union Minister Ramdas: కేంద్ర మంత్రి రాందాస్ అథవాలే తనదైన శైలిలో వ్యాఖ్యలు చేసి.. వార్తల్లో నిలిచారు. మదర్స్ డే (Mother’s day) తరహాలోనే.. ఇక నుంచి ‘వైఫ్స్ డే’ (Wives Day)నిర్వహించాలని రాందాస్ అథవాలే డిమాండ్ చేశారు. మహారాష్ట్రలోని సాంగ్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో రాందాస్ అథవాలే మాట్లాడుతూ.. ‘మంచి, చెడు సమయాల్లో భార్య భర్తకు అండగా నిలిస్తే తల్లి జన్మనిస్తుంది’ అని అన్నారు. మాతృదినోత్సవం తరహాలో ‘భార్య దినోత్సవం’ జరుపుకోవాలని కేంద్ర సామాజిక న్యాయ శాఖ సహాయ మంత్రి రాందాస్ అథవాలే డిమాండ్ చేశారు. మహారాష్ట్రలోని సాంగ్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో అథవాలే మాట్లాడుతూ, భార్య .. భర్త జీవితంలో ప్రముఖ పాత్ర పోషిస్తుందని చెప్పారు. “ప్రతి విజయవంతమైన పురుషుడి వెనుక ఒక మహిళ ఉంటుందని చెప్పారు. కనుక మనం భార్యల గొప్పదనాన్ని గుర్తిస్తూ.. ఇక నుంచి భార్యల దినోత్సవాన్ని జరుపుకోవాలి,” అన్నారాయన. అంతర్జాతీయ మాతృ దినోత్సవాన్ని మే నెలలో రెండవ ఆదివారం జరుపుకుంటారని.. ఇదే తరహాలోనే భార్యలకు ఒక రోజు ఉండాలని ఆయన అభిప్రాయపడ్డారు. అయితే ప్రసుత్తం మహారాష్ట్రకు చెందిన రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు, కేంద్ర సామాజిక న్యాయ, సాధికారత శాఖ మంత్రి రాందాస్ అథవాలే ఈ వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశం అయింది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Also Read:
Education: నాకు చదువు చెప్పించండి సర్.. సీఎంను వేడుకున్న 11 ఏళ్ల బాలుడు..!