Education: నాకు చదువు చెప్పించండి సర్.. సీఎంను వేడుకున్న 11 ఏళ్ల బాలుడు..!

Education: ఆ పిల్లాడికి నిండా 12ఏళ్ల వయసు కూడా ఉండదు. కానీ.. తాను పడుతున్న ఇబ్బందులను ఏకంగా సీఎంకే విన్నవించుకున్నాడు. సారూ.. నాకు న్యాయం చేయండి.

Education: నాకు చదువు చెప్పించండి సర్.. సీఎంను వేడుకున్న 11 ఏళ్ల బాలుడు..!
Boy
Follow us

|

Updated on: May 16, 2022 | 6:45 AM

Education: ఆ పిల్లాడికి నిండా 12ఏళ్ల వయసు కూడా ఉండదు. కానీ.. తాను పడుతున్న ఇబ్బందులను ఏకంగా సీఎంకే విన్నవించుకున్నాడు. సారూ.. నాకు న్యాయం చేయండి. నాకు నాణ్యమైన చదువు చెప్పించండంటూ బాలుడి విజ్ఞప్తిని విన్న సీఎం నితీశ్‌ కుమార్‌ అవాక్కయ్యారు. బాలుడి ధైర్యాన్ని అభినందించారు. బాలుడి చదువుకు కావాల్సిన ఏర్పట్లు చేయాలని అక్కడికక్కడే అధికారులను ఆదేశించారు. నలంద జిల్లాలో సీఎం నితీశ్‌ కుమార్‌ పర్యటలో జరిగిందీ ఆసక్తికర ఘటన. బీహార్‌లో నితీశ్‌ కుమార్‌ అధికారంలోకి వచ్చాక సంపూర్ణ మద్యపాన నిషేధం అమలు చేశారు. అయినా కొందరు చాటుమాటుగా నాటుసారా తయారు చేస్తూనే ఉన్నారు. ఇలా రోజూ తాగివస్తున్న కొందరు తల్లిదండ్రులు పిల్లల భవిష్యత్తును పట్టించుకోవడం మానేశారు. ఇదే పరిస్థితి సోనూకుమార్‌ అనే విద్యార్థికి ఎదురైంది. స్కూలుకు వెళ్లేందుకు తన తండ్రి డబ్బు ఇవ్వకుండా మద్యానికే తగలేస్తుండడంతో తీవ్ర ఆవేదనకు గురయ్యాడు. తన బాధను ఎవరికి చెప్పుకోవాలో అర్థంకాలేదు. అదే సమయంలో సీఎం నితీశ్‌ నలంద పర్యటనకు రావడం తెలుసుకున్నాడు ఆరోతరగతి చదువుతున్న బాలుడు. ఇంకేముంది?. ఎలాంటి బెరుకు, భయం లేకుండా సీఎంతో తన బాధను వెళ్లగక్కుకున్నాడు. చలించిన సీఎం నితీశ్‌.. బాలుడి కోరిక మేరకు నాణ్యమైన ప్రమాణాలు పాటించే పాఠశాలలో చేర్పించాలని ఆదేశించడంతో బాలుడి ఆనందానికి అవుధులు లేకుండా పోయాయి. బాలుడి ధైర్యాన్ని సీఎంతోపాటు స్థానికులు అభినందనలతో ముంచెత్తుతున్నారు.