Zojila Tunnel: వచ్చే ఏడాది నాటికి జోజిలా టన్నెల్ పనులు పూర్తి: కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ

|

Sep 28, 2021 | 2:07 PM

Nitin Gadkari Zojila Tunnel Visit: దేశ సరిహద్దుల్లో మేఘా ఇంజినీరింగ్ (MEIL) సంస్థ నిర్మిస్తున్న జోజిలా టన్నెల్ ప్రాజెక్టును కేంద్ర కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ

Zojila Tunnel: వచ్చే ఏడాది నాటికి జోజిలా టన్నెల్ పనులు పూర్తి: కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ
Nitin Gadkari Zojila Tunnel
Follow us on

Nitin Gadkari Zojila Tunnel Visit: దేశ సరిహద్దుల్లో మేఘా ఇంజినీరింగ్ (MEIL) సంస్థ నిర్మిస్తున్న జోజిలా టన్నెల్ ప్రాజెక్టును కేంద్ర కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ పరిశీలించారు. అనంతరం ఈ ప్రాజెక్టులపై అధికారులతో, మేఘా ప్రతినిధులతో సమీక్షించారు. జోజిలా టన్నెల్ జాతీయ భద్రత, సైనిక అవసరాలను తీర్చడానికి, జమ్మూ కాశ్మీర్, లఢఖ్ ప్రాంతాల అభివృద్ధికి, పర్యాటకరంగ అభివృద్దికి దోహదపడుతుందని నితిన్ గడ్కరీ వెల్లడించారు. టన్నెల్ లడఖ్ ప్రాంతం- కార్గిల్, లేహ్‌కి ఏడాది పొడవునా రహదారి కనెక్టివిటీగా ఉంటుందని.. దీనివల్ల యువతకు ఉపాధి లభిస్తుందని పేర్కొన్నారు. దీంతో కేంద్ర పాలిత ప్రాంతాలైన లఢఖ్, జమ్మూకాశ్మీర్ కు నిరంతర కనెక్టివిటీ ఉంటుందని.. రవాణా సమస్యలు తగ్గి అభివృద్ధి జరుగుతుందన్నారు. అయితే.. జోజిలా టన్నెల్ వచ్చే ఏడాది నాటికి పూర్తవుతుందని.. రవాణాకు కూడా అనుమతిస్తామని గడ్కరీ ఆశాభావం వ్యక్తంచేశారు.


వచ్చే ఏడాది చివరి నాటికి దీనిని ప్రారంభిస్తామని ఆశాభావం వ్యక్తంచేశారు. వచ్చే ఏడాది డిసెంబర్ నాటికి పనులు పూర్తిచేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. అయితే.. ఇది వాగ్దానం కాదని.. లక్ష్యమని కచ్చితంగా నెరవేరుతుందంటూ గడ్కరీ ఆశాభావం వ్యక్తంచేశారు. జోజిలా సొరంగ మార్గాన్ని పగలు రాత్రి అనే తేడా లేకుండా నిర్మిస్తున్నారని నితిన్ గడ్కరీ పేర్కొన్నారు. అధికారులతోపాటు, మేఘ సంస్థ ప్రతినిధులు తీవ్రంగా కష్టపడుతున్నారని తెలిపారు. అనేక ఇబ్బందులు పడుతూ పనులు చేస్తున్నారని వివరించారు. జోజిలా టన్నెల్‌ ఆసియాలోనే పొడవైన టన్నెల్ అని గడ్కరీ పేర్కొన్నారు. జోజిలా టన్నెల్ వల్ల యువతకు ఉపాధి లభిస్తుందని పేర్కొన్నారు. కాగా.. త్వరలో మానస సరోవర్ పర్యటనకు వెళ్లనున్నట్లు నితిన్ గడ్కరి తెలిపారు.

పితోరగఢ్ నుంచి మానససరోవర్ వరకు నిర్మిస్తున్న రహదారి 90 శాతం పూర్తయినట్లు వెల్లడించారు. వచ్చే ఏడాది ఏప్రిల్ నాటికి దీని పనులు పూర్తవుతాయని పేర్కొన్నారు. అనంతరం ఆయన జోజిలా టన్నెల్‌ పనులను పరిశీలిస్తూ పలు సూచనలు చేశారు. ఆయన వెంట వీకే సింగ్ ఉన్నారు.

Also Read:

Nitin Gadkari J&K Visit LIVE: జోజిలా టన్నెల్‌ను వీలైనంత త్వరగా పూర్తి చేస్తాం: కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ..

Huzurabad-Badvel ByPoll Date: హుజురాబాద్, బద్వేల్ ఉప ఎన్నికల షెడ్యూల్ విడుదల..