Zojila tunnel – MEIL: మేఘా ఇంజినీరింగ్ (MEIL) సంస్థ ఆధ్వర్యంలో అత్యద్భుతంగా నిర్మితమవుతున్న జోజిలా టన్నెల్ (Zojila tunnel)- జెడ్-మోర్ టన్నెల్ ప్రాజెక్టులను కేంద్ర కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ సందర్శిస్తున్నారు. అనంతరం ఈ ప్రాజెక్టులపై అధికారులతో, మేఘా ప్రతినిధులతో సమీక్షించనున్నారు. జోజిలా టన్నెల్ జాతీయ భద్రత, సైనిక అవసరాలను తీర్చడానికి, జమ్మూ కాశ్మీర్, లఢఖ్ ప్రాంతాల అభివృద్ధికి, పర్యాటకరంగ అభివృద్దికి దోహదపడనుంది. ఈ టన్నెల్ లడఖ్ ప్రాంతం- కార్గిల్, లేహ్‌కి ఏడాది పొడవునా రహదారి కనెక్టివిటీని అందించనుంది.
త్వరలో మానస సరోవర్ పర్యటనకు వెళ్లనున్నట్లు నితిన్ గడ్కరి తెలిపారు. పితోరగఢ్ నుంచి మానససరోవర్ వరకు నిర్మిస్తున్న రహదారి 90 శాతం పూర్తయినట్లు వెల్లడించారు. వచ్చే ఏడాది ఏప్రిల్ నాటికి దీని పనులు పూర్తవుతాయని పేర్కొన్నారు.
केंद्रीय मंत्री श्री @nitin_gadkari जी, श्रीमती कांचन गडकरी जी और राज्यमंत्री @Gen_VKSingh जी ने श्रीनगर- लेह राष्ट्रीय राजमार्ग पर सोनमर्ग को ॲाल वेदर कनेक्टीविटी से जोडने वाली Z Morh टनल का मुआयना किया, हाल ही में इस टनल के खुदाई का काम पूरा हुआ है। pic.twitter.com/JRfT05TBGn
— Office Of Nitin Gadkari (@OfficeOfNG) September 28, 2021
జోజిలా టన్నెల్ వచ్చే ఏడాది నాటికి పూర్తవుతుందని.. రవాణాకు కూడా అనుమతిస్తామని కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఆశాభావం వ్యక్తంచేశారు. వచ్చే ఏడాది నాటికి దీనిని ప్రారంభిస్తామని పేర్కొన్నారు. వచ్చే ఏడాది డిసెంబర్ నాటికి పనులు పూర్తిచేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. అయితే.. ఇది వాగ్దానం కాదని.. లక్ష్యమని కచ్చితంగా నెరవేరుతుందంటూ గడ్కరీ ఆశాభావం వ్యక్తంచేశారు.
జోజిలా సొరంగ మార్గాన్ని పగలు రాత్రి అనే తేడా లేకుండా నిర్మిస్తున్నారని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ పేర్కొన్నారు. అధికారులతోపాటు, మేఘ సంస్థ కష్టపడుతున్నాయని తెలిపారు. ఇక్కడ పని చేసేందుకు అనేక ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. అయితే.. జోజిలా టన్నెల్ ఆసియాలోనే పొడవైన టన్నెల్ అని పేర్కొన్నారు. జోజిలా టన్నెల్ వల్ల యువతకు ఉపాధి లభిస్తుందని పేర్కొన్నారు.
4.15 కిలోమీటర్ల పాటు నిర్మితమవుతున్న జోజిలా టన్నెల్ ను వేగవంతంగా పూర్తిచేస్తామని గడ్కరీ తెలిపారు. మేఘ ఆధ్వర్యంలో పనులు శరవేగంగా జరుగుతున్నాయని.. వీలైనంత త్వరగా ప్రాజెక్టు పూర్తవుతుందని తెలిపారు.
మేఘ ఇంజినీరింగ్ సంస్థ నిర్మిస్తున్న ఆసియాలోనే అతిపెద్ద జోజిలా టన్నెల్ ప్రాజెక్టు సందర్శనకు కేంద్ర రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ చేరుకున్నారు.
2013లో యూపీఏ హయాంలో దీన్ని నిర్మించాలని నిర్ణయించారు. ఆ తర్వాత మోదీ సర్కార్ హయాంలో 4 సార్లు టెండర్లు పిలిచినా సఫలం కాలేదు. ఆ తర్వాత మేఘా (MEIL) సంస్థ దీని నిర్మాణానికి నడుంబిగించింది. మేఘా ఆధ్వర్యంలో 2020 అక్టోబర్లో పనులు ప్రారంభమై.. సొరంగ మార్గం పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి.
అత్యాధునికంగా నిర్మిస్తున్న జోజిలా టన్నెల్ లో సీసీటీవీ కెమెరాలు, ఓవర్ హైట్ వాహనాలను గుర్తించడం, ఆటోమెటిక్ ఫైర్ డిటెక్షన్, ఫైర్ అలారం, ఇక స్పీడ్ లిమిట్ 80 కిలోమీటర్లకు పరిమితం చేస్తూ నిర్మిస్తున్నారు.
జోజిలా టన్నెల్ నిర్మాణంతో.. శ్రీనగర్, ద్రాస్, కార్గిల్, లేహ్ మధ్య రోడ్ మార్గం సులభం అవుతుంది. ప్రస్తుతం ఈ రహదారి సంవత్సరంలో 6 నెలలపాటు మూసివేయబడుతుంది. ఈ సొరంగం పూర్తయిన తర్వాత లడఖ్ నుండి కాశ్మీర్ మధ్య దూరం 3గంటల 15 నిమిషాలపాటు తగ్గుతుంది. 15 నిమిషాల్లో గమ్య స్థానానికి చేరుకోవచ్చు.
ఈ జోజిలా టన్నెల్ సాధారణ ప్రజలతోపాటు పర్యాటకులకు, భారత సైన్యానికి చాలా ముఖ్యమైనది. ఇది పూర్తయిన తర్వాత అన్ని వాతావరణ పరిస్థితుల్లో లడఖ్ ప్రాంతానికి కశ్మీర్ లోయతో కనెక్టెవిటీ ఉంటుంది. శ్రీనగర్, కార్గిల్, లేహ్ ప్రాంతాలు రవాణా అనుసంధానంలో ఉంటాయి.
జోజిలా సొరంగం దాదాపు 14.15 కి.మీ. ఇది ఆసియాలో పొడవైన సొరంగం. ఈ టన్నెల్ పూర్తయిన అనంతరం మూడున్నర గంటల ప్రయాణం.. కేవలం 15 నిమిషాల్లోనే పూర్తికానుంది. దీంతో ఈ ప్రాంత ప్రజల కష్టాలు తీరనున్నాయి.
దీని పనులు 2020 అక్టోబర్లో ప్రారంభమయ్యాయి. ఇక్కడ వాతావరణ పరిస్థితుల వల్ల ఆర్నెల్లపాటు సరుకులు రవాణా సాధ్యం కాని పరిస్థితి నెలకొని ఉంటుంది. అందువల్ల అన్ని వాతావరణ పరిస్థితుల్లో రవాణాకు ఉపయోగపడేలా.. ఏడాది పొడవునా కనెక్టివిటినీ అందించేందుకు ఈ టన్నెల్ నిర్మిస్తున్నారు.
జోజిలా టన్నెల్.. ఆసియాలోని అతి పొడవైన సొరంగ మార్గం. ఇది శ్రీనగర్, కార్గిల్, లేహ్‌ను కలిపే లైఫ్‌లైన్. సముద్ర మట్టానికి 11,578 అడుగుల ఎత్తులో దీనిని నిర్మిస్తున్నారు.
జోజిలా టన్నెల్‌ను రూ.2,300 కోట్లతో నిర్మిస్తున్నారు. సోన్‌మార్గ్‌ని నుంచి శ్రీనగర్, లడఖ్ మధ్య అన్ని వాతావరణ పరిస్థితుల్లో రవాణా కనెక్టివిటీకి అనుగుణంగా 14.15 కిమీ పొడవున జోజిలా సొరంగ మార్గాన్ని నిర్మిస్తున్నారు. దీనిని 2026 నాటికి పూర్తిచేసేందుకు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ జోజిలా టన్నెల్‌ని మేఘా ఇంజనీరింగ్ & ఇన్‌ఫ్రా లిమిటెడ్ నిర్మిస్తోంది.
మేఘా ఇంజినీరింగ్ (MEIL) సంస్థ ఆధ్వర్యంలో అత్యద్భుతంగా నిర్మితమవుతున్న జోజిలా టన్నెల్ (Zojila tunnel)- జెడ్-మోర్ టన్నెల్ ప్రాజెక్టులను కేంద్ర కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ సందర్శించి.. పనులను పరిశీలిస్తారు.
మేఘా ఇంజినీరింగ్ (MEIL) సంస్థ ఆధ్వర్యంలో నిర్మితమవుతున్న జోజిలా టన్నెల్- జెడ్-మోర్ టన్నెల్ ప్రాజెక్టులను కేంద్ర కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ మరికాసేపట్లో సందర్శించనున్నారు.