Minister Narayan Rane: కేంద్ర మంత్రికి పోలీసుల అరెస్ట్ వారెంట్.. మహారాష్ట్రలో రాజకీయ దుమారం

|

Aug 24, 2021 | 12:36 PM

మహారాష్ట్రలో శివసేన, బీజేపీ మధ్య వివాదం మరింత ముదిరింది. కేంద్రమంత్రి నారాయణ్ రాణేపై మహారాష్ట్ర పోలీసులు కేసు నమోదు చేయడం సంచలనం రేపింది.

Minister Narayan Rane: కేంద్ర మంత్రికి పోలీసుల అరెస్ట్ వారెంట్.. మహారాష్ట్రలో రాజకీయ దుమారం
Union Minister Narayan Rane
Follow us on

Union Minister Narayan Rane: మహారాష్ట్రలో శివసేన, బీజేపీ మధ్య వివాదం మరింత ముదిరింది. కేంద్రమంత్రి నారాయణ్ రాణేపై మహారాష్ట్ర పోలీసులు కేసు నమోదు చేయడం సంచలనం రేపింది. మ‌హారాష్ట్ర పోలీసులు ఆయనను అరెస్టు చేయ‌బోతున్నారు అనే అంశం ఇప్పడు దేశవ్యాప్తంగా ఆస‌క్తిదాయ‌కంగా మారింది. పాల్ఘార్ జిల్లాలోని వాసాయి, విరార్ ప్రాంతాల్లో కేంద్ర మంత్రి నారాయణ్ రాణే జన్ ఆశీర్వాద్ యాత్ర చేపట్టారు. అయితే ఈ సందర్భంగా కోవిడ్ మార్గదర్శకాలను ఉల్లంఘించారంటూ శివసేన నేతలు ఆరోపించారు. ప్రభుత్వ ఉత్తర్వులను ఉల్లంఘించి జన్ ఆశీర్వాద యాత్రలో పాల్గొన్నందుకు కేంద్రమంత్రి నారాయణ్ రాణేతోపాటు బీజేపీ నేతలపై మానిక్ పూర్, తులింజ్, కాశిమీరా, వలీవ్,వసాయ్, విరార్, నాసిక్ పోలీసు స్టేషన్లలో కేసులు నమోదు చేశారు. కరోనావైరస్ మహమ్మారి మధ్య సామాజిక దూర నిబంధనలను ఉల్లంఘించినందుకు మంత్రిపై నాసిక్ పోలీసులు కేసు నమోదు చేసి, అరెస్టు ఉత్తర్వులు సైతం జారీ చేశారు. దీంతో కేంద్రమంత్రి నారాయణ్ రాణేను అరెస్టు చేయనున్నారనే వార్తలు వెలువడ్డాయి. యాత్రలో పాల్గొన్న కేంద్ర మంత్రి నారాయణ్ రాణేతోపాటు జన ఆశీర్వాద యాత్ర నిర్వాహకులపై ఐపీసీ, ఎపిడెమిక్ డిసీజెస్ యాక్ట్ , డిజాస్టర్ మేనేజ్‌మెంట్ యాక్ట్ నిబంధనల కింద అభియోగాలు మోపారని, అయితే ఇంకా మంత్రిని అరెస్టు చేయలేదని పోలీసులు వివరించారు.

మరోవైపు, స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో తడబడిన మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్‌ ఠాక్రేను చెంపదెబ్బ కొడతానన్న.. కేంద్రమంత్రి నారాయణ్‌ రాణే వ్యాఖ్యలపై దుమారం చెలరేగుతోంది. చెంపదెబ్బ వ్యాఖ్యలకు నిరసనగా నారాయణ్‌ రాణే ఇంటిని ముట్టడించేందుకు యత్నించారు శివసేన నేతలు, కార్యకర్తలు. నాసిక్‌లో శివ‌సేన కార్యక‌ర్తలు బీజేపీ ఆఫీస్‌పై రాళ్ల దాడి చేయ‌గా.. ముంబైలో ఇరువర్గాలు బాహాబాహీకి దిగాయి. దీంతో ఆందోళనకారులపై లాఠీఛార్జ్‌ చేశారు పోలీసులు. పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఇంత‌కీ.. ఎందుకు త‌ను ఠాక్రేను కొట్టాల‌నుకున్నట్టో కూడా రాణే చెప్పుకొచ్చారు. ఈ విష‌యంలో ఆయ‌న‌పై పోలీసుల‌కు ఫిర్యాదులు కూడా చేశాయి. ఈ నేప‌థ్యంలో సొంత రాష్ట్రంలో జ‌న అశీర్వాద యాత్రను చేస్తున్న రాణేను పోలీసులు అరెస్టు చేయ‌వ‌చ్చనే ప్రచారం జ‌రుగుతోంది. మరోవైపు నాసిక్‌లో నారాయణ్‌రాణేపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు పోలీసులు. కేంద్రమంత్రిని కోర్టులో ప్రవేశపెడతామని తెలిపారు.

Read Also… Rahul Murder: తాడు వేసి బిగించిందొకరు.. దిండుతో అదిమిపట్టిందొకరు.. రాహుల్ మర్డర్‌ కేసులో వీడుతున్న మిస్టరీ..

Koganti Satyam: పోలీసుల అనుమానం నిజమైంది.. ఆయన పేరులో సత్యం ఉంది. కానీ చెప్పేదంతా అసత్యం.. !