Union Minister Kishan Reddy: పీయూష్‌ గోయల్‌తో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి భేటీ.. ధాన్యం సేకరణ పరిమితి పెంచాలని విజ్ఞప్తి..

|

Dec 17, 2021 | 10:03 PM

కేంద్ర ఆహార వినియోగదారుల వ్యవహారాల మంత్రి పీయూష్ గోయల్‌తో సమావేశమైన కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి. తెలంగాణ నుంచి ధాన్యం సేకరణ పరిమితి పెంచాలని విజ్ఞప్తి.

Union Minister Kishan Reddy: పీయూష్‌ గోయల్‌తో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి భేటీ.. ధాన్యం సేకరణ పరిమితి పెంచాలని విజ్ఞప్తి..
Kishan Reddy Kcr
Follow us on

కేంద్ర ఆహార వినియోగదారుల వ్యవహారాల మంత్రి పీయూష్ గోయల్‌తో సమావేశమైన కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి. తెలంగాణ నుంచి ధాన్యం సేకరణ పరిమితి పెంచాలని విజ్ఞప్తి చేశారు కిషన్ రెడ్డి. ఇదే డిమాండ్‌తో శనివారం టీఆర్ఎస్ మంత్రుల బృందం ఢిల్లీ వెళ్తోంది. ఈ నేపథ్యంలో పీయూష్‌ గోయల్‌ను  కిషన్‌ రెడ్డి కలవడం ఆసక్తికరంగా మారింది. రైతుల సంక్షేమం కోసమే మోడీ సర్కారు పనిచేస్తోందన్నారు కిషన్‌రెడ్డి. నిబంధనల కన్నా ఎక్కువ ధాన్యమే ఎఫ్‌సీఐ సేకరిస్తోందని వెల్లడించారు.

తెలంగాణ రైతులకు మద్దతుగా కేటాయించిన సేకరణ పరిమితికి మించి బియ్యం సేకరించడాన్ని పరిశీలించాలని అభ్యర్థించినట్లుగా తెలిపారు. 2014-15 ఖరీఫ్‌ సీజన్‌లో తెలంగాణ రైతులకు చెల్లించిన మద్దతు ధరతో పోలిస్తే.. ప్రస్తుతం 700 రెట్లు ఎక్కువ మొత్తం చెల్లిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రానికి సేకరణ ఖర్చులు, ఎంఎస్పీలో 1శాతం డ్రైయేజ్, సొసైటీలకు కమీషన్‌ అదనంగా ఇస్తున్నట్లు వెల్లడించారు.

కేంద్ర ప్రభుత్వం రైతులకు ఇచ్చే మద్దతు ధర మాత్రమే కాకుండా, ధాన్యం సేకరణ చేసే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఛార్జీలు, డ్రైయేజ్ @1% MSP, మూడు నెలల పాటు సొసైటీలకు కమీషన్, మండి లేబర్ ఛార్జీలు, మిల్లింగ్ ఛార్జీలు, గన్నీ బ్యాగ్‌లు, గన్నీల వినియోగ ఛార్జీలు, అడ్మినిస్ట్రేటివ్ ఛార్జీల కోసం అయ్యే వ్యయాన్ని కూడా చెల్లిస్తుంది.

కేంద్ర ఆహార సంస్థ (FCI) ఇప్పుడు నిబంధనల ప్రకారం అసలు కేటాయింపుల కంటే ఎక్కువగానే బియ్యం సేకరణను కొనసాగిస్తోంది. రైతుల ప్రయోజనాలను పరిరక్షించడంలో కేంద్ర ప్రభుత్వం చురుకైన చర్యలతో ముందుకు సాగుతోంది.

ఇవి కూడా చదవండి: మీ ఇంటికి బిర్యానీ ఎవరు తెచ్చారో ఓ సారి చూడండి.. డెలివరీ బాయ్ కాదండోయ్..

Rakesh Jhunjhunwala: 10 సెకెన్లలో రూ. 318 కోట్లు మాయం.. దలాల్ స్ట్రీట్‌లో దగాపడిన బిగ్ బుల్..