High Speed Train: ముంబయి – అహ్మదాబాద్ మధ్య హైస్పీడ్ రైల్ ప్రాజెక్టు.. మరికొన్ని మార్గాల్లోనూ.. అశ్వనీ వైష్ణవ్..

|

Feb 03, 2023 | 4:21 PM

దేశంలో రైల్వే సౌకర్యాలను మెరుగుపరిచేందుకు మోడీ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇప్పటికే ప్రధాన నగరాల మధ్య వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైళ్లు నడిపిస్తుండగా.. వీటితో పాటు హైస్పీడ్ రైళ్లు నడిపించేందుకు ప్రణాళికలు చేస్తున్నారు..

High Speed Train: ముంబయి - అహ్మదాబాద్ మధ్య హైస్పీడ్ రైల్ ప్రాజెక్టు.. మరికొన్ని మార్గాల్లోనూ.. అశ్వనీ వైష్ణవ్..
High Speed Train
Follow us on

దేశంలో రైల్వే సౌకర్యాలను మెరుగుపరిచేందుకు మోడీ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇప్పటికే ప్రధాన నగరాల మధ్య వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైళ్లు నడిపిస్తుండగా.. వీటితో పాటు హైస్పీడ్ రైళ్లు నడిపించేందుకు ప్రణాళికలు చేస్తున్నారు. దేశంలో ముంబయి – అహ్మదాబాద్ మధ్య హైస్పీడ్ రైల్ ప్రాజెక్టు మంజూరైందని కేంద్ర మంత్రి అశ్వనీ వైష్ణవ్ అన్నారు. జపాన్ ప్రభుత్వ ఆర్థిక, సాంకేతిక సహకారంతో ఈ ప్రాజెక్టు చేపట్టినట్లు వెల్లడించారు. చైనా సహా కొన్ని దేశాల్లో హైస్పీడ్ రైల్ వ్యవస్థ ఉందన్న ఆయన.. మన దేశంలో మరో 7 మార్గాల్లో హైస్పీడ్ రైల్ ప్రాజెక్టు ప్రతిపాదనలున్నాయని చెప్పారు. వాటికి సంబంధించి సర్వే, డీపీఆర్ పనులు జరుగుతున్నాయన్నారు. అందులో ముంబై-పూణే-హైదరాబాద్ మార్గం కూడా ఉందని వివరించారు. మిగతావి ఢిల్లీ-వారణాశి, ఢిల్లీ-అహ్మదాబాద్, ఢిల్లీ-అమృత్‌సర్, ముంబై-నాగ్‌పూర్, చెన్నై-బెంగళూరు-మైసూరు, వారణాశి-హౌరా మార్గాలుగా ఉన్నాయి.

అత్యధిక ఖర్చుతో కూడుకున్న ప్రాజెక్టులైనందున డీపీఆర్, టెక్నో-ఎకనమిక్ ఫీజిబిలిటీ, వనరుల లభ్యత, ఆర్థిక పరమైన అంశాలను దృష్టిలో పెట్టుకుని మంజూరు చేస్తున్నాం. శాస్త్రీయ పద్ధతిలో రైల్వే టైమ్ టేబుల్ రేషనలైజేషన్ చేస్తున్నాం. తద్వారా సమయానికి రైళ్లు నడవడంతో పాటు సేఫ్టీ కూడా మెరుగుపడుతుంది.

      – రాజ్యసభలో కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్

ఇవి కూడా చదవండి

మరోవైపు.. బుల్లెట్‌ రైలును కూడా అందుబాటులోకి తీసుకువచ్చేలా కేంద్ర చర్యలు చేపడుతోంది. ఇక బుల్లెట్ రైలు ప్రాజెక్ట్ సిద్ధం కావడానికి 3 సంవత్సరాల కంటే ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉంది. ఈ విషయమై రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ మాట్లాడుతూ.. 2026 ఆగస్టు నెల నుండి దేశంలోని మొట్టమొదటి బుల్లెట్ రైలు ట్రాక్‌పై పరుగెత్తడం ప్రారంభం అవుతుందని, ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా ప్రాజెక్టును నిరంతరం పర్యవేక్షిస్తున్నారని అన్నారు. 2026 ఆగస్టు నుంచి బుల్లెట్ రైలు నడుస్తుందని రైల్వే మంత్రి వెల్లడించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..