Anurag Thakur: స్వచ్ఛభారత్‌లో భాగస్వామ్యం కావాలి.. మెగా డ్రైవ్ ప్రారంభోత్సవంలో కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్..

|

Oct 19, 2022 | 10:50 AM

స్వచ్ఛ భారత్ ప్రచారంలో ప్రజల భాగస్వామ్యాన్ని పెంచడం కోసం.. స్వచ్ఛ కార్యకలాపాలను ముమ్మరం చేసేందుకు ఈ కార్యక్రమం చేపట్టినట్లు అనురాగ్ ఠాకూర్ తెలిపారు.

Anurag Thakur: స్వచ్ఛభారత్‌లో భాగస్వామ్యం కావాలి.. మెగా డ్రైవ్ ప్రారంభోత్సవంలో కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్..
Anurag Thakur
Follow us on

స్వచ్ఛభారత్ దిశగా కేంద్రం అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో మరోసారి క్లీన్లీనెస్ డ్రైవ్ ప్రచారంతో.. వ్యర్థాలను సేకరిస్తోంది. దీనిలో భాగంగా కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ ఢిల్లీలోని చందినీ చౌక్ నుండి స్వచ్ఛ భారత్ 2022 కింద మెగా క్లీన్‌నెస్ డ్రైవ్‌ను ప్రారంభించారు. బుధవారం ఉదయం చాందినీ చౌక్‌లో ఈ మెగా డ్రైవ్ ప్రారంభ కార్యక్రమం జరిగింది. స్వచ్ఛ భారత్ ప్రచారంలో ప్రజల భాగస్వామ్యాన్ని పెంచడం కోసం.. స్వచ్ఛ కార్యకలాపాలను ముమ్మరం చేసేందుకు ఈ కార్యక్రమం చేపట్టినట్లు అనురాగ్ ఠాకూర్ తెలిపారు. దీనిలో భాగంగా యువజన వ్యవహారాల శాఖ, దాని అనుబంధ సంస్థలను స్వచ్ఛ భారత్ 2022 క్లీన్లీనెస్ ప్రచారంలో భాగస్వామ్యం చేయడమే లక్ష్యంతో ఈ డ్రైవ్ ప్రారంభించినట్లు తెలిపారు.

నెల రోజుల పాటు దేశవ్యాప్తంగా కొనసాగే.. స్వచ్ఛ భారత్ 2022 క్లీన్లీనెస్ డ్రైవ్ ఈ నెల 1న ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో ప్రారంభమైంది. నెల రోజుల వ్యవధిలో కోటి కిలోల వ్యర్థాలను సేకరించాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమం ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఠాకూర్ మాట్లాడుతూ.. గత 18 రోజుల్లో 84 లక్షల కిలోలకు పైగా వ్యర్థాలు సేకరించినట్లు తెలిపారు. నిర్ణిత సమయంలో ఈ డ్రైవ్ పూర్తవుతుందని.. స్వచ్ఛ భారత్ లక్ష్యమే.. కేంద్రం నినాదమని తెలిపారు.

ఇవి కూడా చదవండి

ప్రతిఒక్కరూ స్వచ్ఛ భారత్ కల సాకారం చేసేందుకు తోడ్పాటునందించాలని కోరారు. ప్రధాని మోడీ పిలుపునిచ్చిన స్వచ్ఛ భారత్ కార్యక్రమం ప్రపంచానికే స్ఫూర్తినిచ్చిందని కొనియాడారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం..