రూ. 500 పెట్టుబడి పెట్టి, ఆదాయంలో వాటా సంపాదించండి.. టాక్సీ డ్రైవర్లకు అమిత్ షా బంపర్ ఆఫర్

కేంద్ర హోంమంత్రి అమిత్ షా భారత్ టాక్సీ డ్రైవర్లతో బహిరంగంగా సంభాషించి వారి సమస్యలు, సూచనలను విన్నారు. కష్టపడి పనిచేసే వ్యక్తి లాభం పొందాలని అమిత్ ఆకాంక్షించారు. సహకార రంగం ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యతనిస్తుందని, కష్టపడి పనిచేసే వారు ప్రయోజనాలను పొందుతారని ఆయన అన్నారు. సహకార రంగాన్ని బలోపేతం చేయడం ప్రభుత్వానికి ప్రాధాన్యత అని ఆయన స్పష్టం చేశారు.

రూ. 500 పెట్టుబడి పెట్టి, ఆదాయంలో వాటా సంపాదించండి.. టాక్సీ డ్రైవర్లకు అమిత్ షా బంపర్ ఆఫర్
Amit Shah Interact With Bharat Taxi Drivers

Updated on: Feb 23, 2026 | 2:16 PM

కేంద్ర హోం, సహకార మంత్రి అమిత్ షా సోమవారం (ఫిబ్రవరి 23) భారత్ టాక్సీ డ్రైవర్లతో సంభాషించారు. భారతదేశపు మొట్టమొదటి సహకార ఆధారిత రైడ్-హెయిలింగ్ ప్లాట్‌ఫామ్ అయిన భారత్ టాక్సీని అమిత్ షా ఫిబ్రవరి 5న ఢిల్లీలో ప్రారంభించారు. రెండు నెలల పైలట్ ప్రాజెక్టుగా ఈ ప్రయోగం విజయవంతమైంది. ఈ సేవ మొదట ఢిల్లీ-ఎన్‌సిఆర్, గుజరాత్‌లో ప్రారంభించారు. రెండేళ్లలో అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు విస్తరించనున్నారు.

ఈ నేపథ్యంలోనే అమిత్ షా భారత్ టాక్సీ డ్రైవర్లతో బహిరంగంగా సంభాషించి వారి సమస్యలు, సూచనలను విన్నారు. కష్టపడి పనిచేసే వ్యక్తి లాభం పొందాలని అమిత్ ఆకాంక్షించారు. సహకార రంగం ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యతనిస్తుందని, కష్టపడి పనిచేసే వారు ప్రయోజనాలను పొందుతారని ఆయన అన్నారు. సహకార రంగాన్ని బలోపేతం చేయడం ప్రభుత్వానికి ప్రాధాన్యత అని ఆయన స్పష్టం చేశారు.

“కేవలం రూ. 500 మాత్రమే పెట్టుబడి పెడితే చాలు. మూడేళ్ల తర్వాత భారత్ టాక్సీ రూ. 25 కోట్లు సంపాదిస్తుంది. అందులో 20% అంటే రూ. 5 కోట్లు మీ మూలధనంగా భారత్ టాక్సీ ఖాతాలో జమ చేయడం జరుగుతుంది. టాక్సీ నడిపిన కిలోమీటర్ల సంఖ్యను బట్టి అదనంగా 80% మీ ఖాతాకు తిరిగి ఇవ్వడం జరుగుతుంది” అని మంత్రి అమిత్ షా అన్నారు. “ప్రస్తుతం, మీకు స్థిర అద్దె లభిస్తుంది. కానీ మీరు యజమాని కాబట్టి, లాభాలలో మీకు కూడా వాటా ఉండాలి. కాబట్టి, మీరు ఆ వాటాను పొందబోతున్నారు, అయితే, మొదటి మూడు సంవత్సరాలు ఓపిక పట్టాలి.” అని అమిత్ షా తెలిపారు.

భారతదేశంలో రైడ్-హెయిలింగ్ సర్వీస్ మార్కెట్ ప్రస్తుతం ఉబెర్, ఓలా, రాపిడో వంటి కొన్ని సంస్థలచే ఆధిపత్యం చెలాయిస్తోంది. జూన్ 6, 2025న ప్రారంభించి మల్టీ-స్టేట్ కోఆపరేటివ్ సొసైటీస్ చట్టం, 2002 కింద నమోదు చేయడం జరిగింది. భారత్ టాక్సీ డ్రైవర్ల మధ్య ప్రత్యక్ష లాభాల భాగస్వామ్యంతో జీరో-కమిషన్, సర్జ్-ఫ్రీ ధరల నమూనాపై పనిచేస్తుంది. ఇది విదేశీ పెట్టుబడితో రైడ్-హెయిలింగ్ ప్లాట్‌ఫామ్‌లకు స్థానిక ప్రత్యామ్నాయంగా ప్లాట్‌ఫామ్‌ను ఉంటుందని అమిత్ షా తెలిపారు. “సహకార ఆలోచన, పద్ధతిని సరిగ్గా అర్థం చేసుకుంటే, ఎలాంటి ప్రశ్నలు తలెత్తవు. సహకారం అంటే కలిసి పనిచేయడం, కలిసి లాభాలు సంపాదించడం.” అని అమిత్ స్పష్టం చేశారు.

“భారత్ టాక్సీ లక్ష్యం ఏ ప్రైవేట్ కంపెనీ లాగా లాభాలు ఆర్జించడం మాత్రమే కాదు, ప్రజలను శక్తివంతం చేయడమే. అన్ని ఖాతాలు పారదర్శకంగా ఉంటాయి. మీకు ముందుగానే అన్ని సమాచారం అందించడం జరగుతుంది. ఈ వ్యవస్థ సహకార సూత్రాలపై పనిచేస్తుంది, ప్రైవేట్ కంపెనీ లాగా కాదు. భారత్ టాక్సీ మిమ్మల్ని ఎప్పుడూ దోపిడీ చేయదు.” అని అమిత్ షా భరోసా ఇచ్చారు. “ఇంత పెద్ద సంస్థను నిర్మించడానికి దేశంలోని ఐదు అతిపెద్ద సహకార సంస్థలను విలీనం చేయడం జరిగింది. మీ సంఖ్య పెరిగేకొద్దీ, భాగస్వామి కావాలనుకునే ఏ సారథి అయినా 500 రూపాయల వాటా తీసుకొని యజమాని కావచ్చు. భారత్ టాక్సీ డైరెక్టర్ల బోర్డు ఎన్నికైనప్పుడు, కొన్ని సీట్లు సారథి సభ్యులకు రిజర్వ్ చేయడం జరిగింది. మీ ప్రయోజనాలను పూర్తిగా చూసుకుంటారు” అని హోం మంత్రి అన్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us