Amit Shah: మోడీ పాలనలో ఒక్క ఇంచ్ భూమి కూడా కబ్జా కాలేదు.. కేంద్ర హోం మంత్రి షాకింగ్ కామెంట్స్..

|

Dec 13, 2022 | 12:50 PM

హిమసీమల్లో పొలిటికల్ వేడి పెరుగుతోంది. పొరుగు దేశం చైనాపై కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌షా సంచలన కామెంట్స్‌ చేశారు. 1962 లో చైనా భారత భూభాగాన్ని ఆక్రమించిందన్న ఆయన.. చైనా దూతల నుంచి కాంగ్రెస్‌...

Amit Shah: మోడీ పాలనలో ఒక్క ఇంచ్ భూమి కూడా కబ్జా కాలేదు.. కేంద్ర హోం మంత్రి షాకింగ్ కామెంట్స్..
Amit Shah
Follow us on

హిమసీమల్లో పొలిటికల్ వేడి పెరుగుతోంది. పొరుగు దేశం చైనాపై కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌షా సంచలన కామెంట్స్‌ చేశారు. 1962 లో చైనా భారత భూభాగాన్ని ఆక్రమించిందన్న ఆయన.. చైనా దూతల నుంచి కాంగ్రెస్‌ నేతలు డబ్బులు తీసుకున్నారని ఆరోపించారు. రాజీవ్‌ గాంధీ ఫౌండేషన్‌ కోసం డబ్బులు తీసుకున్నారన్న అమిత్ షా..మోదీ టైమ్‌లో ఒక్క ఇంచు భూమి కూడా కబ్జా కాలేదని స్పష్టం చేశారు. నిన్న భారత్‌ చైనా సరిహద్దుల్లో యుద్ధవాతావరణం నెలకొన్న విషయం తెలిసిందే. అరుణాచల్‌ ప్రదేశ్‌లోని తూర్పుకొండల్లో అగ్గిపుట్టింది. డ్రాగన్‌ కంట్రీ కుట్రలకు ఎల్‌ఏసీలోని తవాంగ్‌ సెక్టార్‌ రణక్షేత్రంగా మారింది. భారత్‌ చైనా సైనికుల మధ్య నిన్న జరిగిన ఘర్షణ ఇప్పుడు యావత్‌ దేశంలో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఓవైపు రాళ్ళ వర్షం… మరోవైపు ఆయుధాలతో దాడులు… భారత భూభాగంలోకి తోసుకొస్తూ…వెర్రి వేషాలు…యుద్ధనీతిని తుంగలో తొక్కి….అంతర్జాతీయ చట్టాలకు నీళ్ళొదిలి…ఇష్టారాజ్యంగా సరిహద్దుల్లో అలజడి సృష్టిస్తోంది చైనా. అప్పుడు గాల్వాన్‌… ఇప్పుడు తవాంగ్‌….కానీ అప్పుడూ ఇప్పుడూ సేమ్‌ సీన్‌…డ్రాగన్‌ కంట్రీ యుద్ధానికి కాలుదువ్వుతోంది.

భారత్‌ – చైనా మధ్య గాల్వాన్‌ సీన్‌ మళ్లీ రిపీట్‌ అయ్యింది. తవాంగ్‌ సెక్టార్‌ లో భారత భూభాగంలోకి చొచ్చుకొని వచ్చిన చైనా సైనికులను భారత సైన్యం ధీటుగా ఎదుర్కొంది. చైనా సైన్యానికి చుక్కలు చూపించింది. ఎక్కడైతే ఆయుధాలు నిషేధమో అక్కడే మరోసారి ఆయుధ ప్రయోగానికి సిద్ధమైంది చైనా. ఇరు దేశాల సైనికుల మధ్య పరస్పర దాడుల్లో నెత్తురు పారింది. డిసెంబర్‌ 9వ తేదీన ఈ ఘటన జరిగినట్టు భారత సైన్యం ధృవీకరించింది. బాహాబాహీ పోరులో అనేక మందికి గాయాలయ్యాయి. ఈ ఘర్షణలో అనేక మంది సైనికులు గాయపడ్డారు. అనేక మంది సైనికులకు కాళ్ళూ, చేతులూ విరిగాయి. తీవ్రంగా గాయపడ్డవారిని ఆసుపత్రిలో చేర్చారు. ఆర్మీ ఆస్పత్రిలో 9 మంది భారతీయ సైనికులకు చికిత్స జరుగుతోంది.

మరోసారి డిసెంబర్‌ 11న తిరిగి డ్రాగన్‌ కంట్రీ కుట్రలు బట్టబయలయ్యాయి. భారత భూభాగంలోకి చొచ్చుకొచ్చిన చైనాకి చుక్కలు చూపించారు భారత సైనిక సింహాలు. 22 చైనా ట్రూపులకు… భారత సైన్యం ధీటుగా బుద్ధి చెప్పింది…..యుద్ధరక్కసి డ్రాగన్‌ కుట్రలను ధీటుగా ఎదుర్కొంది భారత సైన్యం. ఈ ఘర్షణలో 30 మంది సైనికులు గాయపడ్డారు. అందులో 20 మందికి పైగానే చైనా సైనికులకు తీవ్రగాయాలయినట్టు తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం..