Nirmala Sitharaman Clarifies on Vizag steel Plant : విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై కేంద్రప్రభుత్వం మరోసారి తేల్చి చెప్పింది. లోక్‌సభలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ సమాధానమిస్తూ.. నష్టాల్లో ఉన్న ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేటీకరిస్తామని స్పష్టం చేశారు. ఈ ఆర్థిక సంవత్సరంలో పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా.. రూ.1.75 లక్షల కోట్లు సమీకరించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టు ఆమె వెల్లడించారు. అయితే, విశాఖ స్టీల్ ప్లాంట్‌లో నష్టాలు రావడానికి అనేక కారణాలున్నాయని, రుణ భారం పెరగడం, తక్కువ ఉత్పాదకత ముఖ్యకారణాలని ఆమె వివరించారు. ఇందులో భాగంగా విశాఖ స్టీల్‌ను ప్రైవేటీకరించాలని నిర్ణయం తీసుకున్నట్టు మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు.
మరోవైపు, కేంద్రం పట్టువిడుపు లేకుండా ముందుకు వెళుతోందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. ఆంధ్రుల మనోభావాలకు విలువ లేకుండా పోయిందని వాపోతున్నారు. చేస్తానన్నవి చేయకుండా… హక్కుతో సాధించుకున్నదాన్ని లేకుండా చేస్తున్నారని మండిపడుతున్నారు. 32 మంది ప్రాణత్యాగాలకు విలువ లేకుండా పోయిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు మూడు నెలలుగా ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అఖిలపక్షాలు, ప్రతిపక్షాలు ఉద్యమిస్తున్నారు. విశాఖలో కార్యకలాపాలను స్తంభింపచేసి నిరసన తెలుపుతున్నారు.
ఇదీ చదవండిః uttarakhand cm ప్రధాని నరేంద్రమోదీపై ఉత్తరాఖండ్ కొత్త ముఖ్యమంత్రి తీరత్ సింగ్ రావత్ కీలక వ్యాఖ్యలు..!