Union Cabinet: ఆ 3 వ్యవసాయ చట్టాల రద్దుకు మంత్రి వర్గం ఆమోదం.. కేంద్ర కేబినెట్‌ కీలక నిర్ణయం..

|

Nov 24, 2021 | 2:38 PM

కేంద్ర కేబినెట్‌ కీలక నిర్ణయం తీసుకుంది. 3 వ్యవసాయ చట్టాల రద్దుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఇప్పటికే సాగు చట్టాలను వెనక్కి తీసుకుంటున్నట్టు ప్రకటించారు..

Union Cabinet: ఆ 3 వ్యవసాయ చట్టాల రద్దుకు మంత్రి వర్గం ఆమోదం.. కేంద్ర కేబినెట్‌ కీలక నిర్ణయం..
Farm Laws
Follow us on

కేంద్ర కేబినెట్‌ కీలక నిర్ణయం తీసుకుంది. 3 వ్యవసాయ చట్టాల రద్దుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఇప్పటికే సాగు చట్టాలను వెనక్కి తీసుకుంటున్నట్టు ప్రకటించారు ప్రధాని మోదీ. అన్నదాతల అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకొని మూడు చట్టాలను రద్దు చేస్తున్నట్టు వెల్లడించారు. ఈ శీతాకాల సమావేశాల్లోనే సాగు చట్టాల రద్దు బిల్లును పార్లమెంట్‌ ముందుకు తీసుకురానున్నారు.

అలాగే క్రిప్టో కరెన్సీపై కూడా కీలక నిర్ణయం తీసుకోనుంది కేంద్ర కేబినెట్‌. ఇప్పటికే క్రిప్టో కరెన్సీపై బిల్లును సిద్ధం చేసింది కేంద్రం. ది క్రిప్టో కరెన్సీ అండ్‌ రెగ్యులేషన్‌ ఆఫ్‌ అఫీషియల్ డిజిటల్‌ కరెన్సీ బిల్లు, 2021 పేరుతో బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనుంది.

ఈ శీతాకాల సమావేశాల ఎజెండాలో క్రిప్టో కరెన్సీ బిల్లును చేర్చింది కేంద్రం. ఆర్బీఐ ఆధ్వర్యంలో సొంత డిజిటల్‌ కరెన్సీ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తోంది. అదే సమయంలో ప్రైవేట్‌ క్రిప్టో కరెన్సీని కొన్ని మినహాయింపులతో బ్యాన్‌ చేసే అవకాశముంది. ప్రైవేట్‌ క్రిప్టో కరెన్సీలో నల్లధనం భారీగా దాచిపెట్టే అవకాశముందని భావిస్తోంది ఆర్బీఐ.

ఇవి కూడా చదవండి: ప్రపంచ బ్యాంక్‌తో ఏపీ సర్కార్ ఒప్పందం.. 250 మిలియన్‌ డాలర్లతో విద్యా ప్రమాణాల పెంపు..

Petrol Diesel Price: వాహనదారులకు గుడ్‌న్యూస్.. దిగివస్తున్న పెట్రోల్ ధరలు.. కేంద్ర వ్యూహం ఇదే..