Union Cabinet: గ్రీన్ ఎనర్జీ కారిడార్‌పై కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం.. రెండోదశలో ఏపీ సహా 7 రాష్ట్రాల్లో ట్రాన్స్‌మిషన్ లైన్లు

|

Jan 06, 2022 | 9:13 PM

Green Energy Corridor: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో ఈరోజు పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపింది. ఇందులో రెండో దశ గ్రీన్ ఎనర్జీ కారిడార్‌కు ఆమోదం లభించింది.

Union Cabinet: గ్రీన్ ఎనర్జీ కారిడార్‌పై కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం.. రెండోదశలో ఏపీ సహా 7 రాష్ట్రాల్లో ట్రాన్స్‌మిషన్ లైన్లు
Union Cabinet
Follow us on

Union Cabinet on Green Energy Corridor: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో ఈరోజు పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపింది. ఇందులో రెండో దశ గ్రీన్ ఎనర్జీ కారిడార్‌కు ఆమోదం లభించింది. ఈ మేరకు ఇవాళ కేబినెట్‌ కమిటీ ఆఫ్‌ ఎకనామిక్‌ అఫైర్స్‌ నిర్ణయం తీసుకోగా.. కేంద్ర మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ కేబినెట్‌ నిర్ణయాలను వెల్లడించారు. దీంతో పాటు నేపాల్‌లో చైనా ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని, పొరుగు దేశానికి సంబంధించి కూడా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

కేబినెట్ గురువారం రెండు నిర్ణయాలు తీసుకుంది, అందులో మొదటిది ఇంట్రా స్టేట్ ట్రాన్స్‌మిషన్ సిస్టమ్ గ్రీన్ ఎనర్జీ కారిడార్‌కు సంబంధించినది. రెండో దశకు ఇవాళ మంత్రివర్గం ఆమోదం తెలిపింది. దాదాపు 12 వేల కోట్ల రూపాయలను ఈ పథకం కోసం ఖర్చు చేయనున్నారు. ఈ పథకం ద్వారా 10,750 సర్క్యూట్ కిలోమీటర్ల ట్రాన్స్‌మిషన్ లైన్ వేయనున్నారు. ఫేజ్ 2 కింద, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, కేరళ, ఉత్తరప్రదేశ్, తమిళనాడు, రాజస్థాన్ వంటి 7 రాష్ట్రాల్లో ట్రాన్స్‌మిషన్ లైన్లు వేయనున్నారు. రెండవ దశ 2021-22 నుండి 2025-26 వరకు కొనసాగుతుంది. దశ మొత్తం ఖర్చులో కేంద్రం నుంచి వచ్చే సాయం 33 శాతం. అంతర్జాతీయ సంస్థ కేఎఫ్‌డబ్ల్యూ నుంచి అదే వాటాను రాష్ట్రాలకు రుణం రూపంలో అందజేస్తారు. అదే సమయంలో మొదటి దశలో 80 శాతం పనులు పూర్తయినట్లు కేంద్ర మంత్రి తెలిపారు. మొదటి దశ వ్యయం రూ.10 142 కోట్లు.. కాగా, ఈ ప్రాజెక్టులు శిలాజ రహిత వనరుల నుండి విద్యుత్ పొందే లక్ష్యాన్ని చేరుకోవడంలో కీలక మైలురాయిగా కేంద్ర మంత్రి పేర్కొన్నారు. అదే సమయంలో, ఉత్తరాఖండ్‌లోని ధార్చులలో మహంకాళి నదిపై భారత – నేపాల్ మధ్య వంతెన నిర్మాణానికి మంత్రివర్గం మరొక నిర్ణయంలో ఆమోదం తెలిపింది. ఈ బ్రిడ్జిపై త్వరలో ఎంఓయూ కుదుర్చుకోనున్నామని, ఇరుదేశాల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేసేందుకు ఇది దోహదపడుతుందని కేంద్ర మంత్రి తెలిపారు.


గ్రీన్ ఎనర్జీ కారిడార్ అంటే ఏమిటి?
న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ మంత్రిత్వ శాఖ ప్రకారం, గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్ట్ లక్ష్యం సౌర, పవన శక్తి వంటి పర్యావరణ అనుకూల వనరుల నుండి గ్రిడ్ ద్వారా సాంప్రదాయ పవర్ స్టేషన్ల సహాయంతో దేశంలోని ఇతర ప్రాంతాలకు విద్యుత్‌ను రవాణా చేయడం. రాష్ట్రాలు అవసరాన్ని బట్టి గ్రీన్ ఎనర్జీని ఉత్పత్తి చేసుకోవచ్చని, అయితే, ట్రాన్స్‌మిషన్ ఖర్చు చాలా ఎక్కువ కాబట్టి, ఈ విద్యుత్తును ఇతర ప్రాంతాలకు పంపడంలో సమస్య ఉందని, అందుకే గ్రీన్ కారిడార్ ప్లాన్ చేశామని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ అన్నారు. ఇది రాష్ట్రాలు అవసరమైన మౌలిక సదుపాయాలను సృష్టించడానికి దేశ వినియోగంలో గ్రీన్ ఎనర్జీ వాటాను పెంచడానికి సహాయపడుతుంది. 2015-16లో, గ్రీన్ ఎనర్జీ నుంచి ఉత్పత్తయ్యే విద్యుత్‌ను వినియోగించుకునేందుకు ఇంట్రా స్టేట్ ట్రాన్స్‌మిషన్ సిస్టమ్ ప్రాజెక్ట్‌కు మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపింది. ఎనిమిది రాష్ట్రాలు తమిళనాడు, రాజస్థాన్, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, మధ్యప్రదేశ్ మొదటి దశలో ఉన్నాయి.

Read Also…  Telangana Covid19: తెలంగాణలో మళ్లీ కరోనా కల్లోలం.. నిన్న వెయ్యి దాటిన కేసులు, ఇవాళ రెండు వేలకు చేరువగా నమోదు!