ప్రభుత్వం ఏర్పాటుకు ముందుకు రాని విపక్షం, పుదుచ్చేరిలో రాష్ట్రపతి పాలనకు కేంద్ర కేబినెట్ ఆమోదం.

| Edited By: Anil kumar poka

Feb 24, 2021 | 2:41 PM

పుదుచ్ఛేరిలో రాష్ట్రపతి పాలన విధింపును కేంద్ర కేబినెట్ ఆమోదించింది.  ఇటీవల అసెంబ్లీలో జరిగిన విశ్వాస పరీక్షలో మాజీ  సీఎం నారాయణస్వామి తన మెజారిటీని నిరూపించుకోలేక..రాజీనామా చేశారు.

ప్రభుత్వం ఏర్పాటుకు ముందుకు రాని విపక్షం,  పుదుచ్చేరిలో రాష్ట్రపతి పాలనకు కేంద్ర కేబినెట్ ఆమోదం.
Follow us on

పుదుచ్ఛేరిలో రాష్ట్రపతి పాలన విధింపును కేంద్ర కేబినెట్ ఆమోదించింది.  ఇటీవల అసెంబ్లీలో జరిగిన విశ్వాస పరీక్షలో మాజీ  సీఎం నారాయణస్వామి తన మెజారిటీని నిరూపించుకోలేక..రాజీనామా చేశారు. అంతకు ముందే మొత్తం ఆరుగురు సభ్యుల రాజీనామాలతో ప్రభుత్వం మైనారిటీలో పడిపోయింది.  పుదుచ్చేరిలో రాజకీయ సంక్షోభం తలెత్తడానికి మాజీ లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీయే కారణమని నారాయణస్వామి పదేపదే ఆరోపిస్తూ వచ్చారు. ఈ కేంద్ర పాలిత ప్రాంతఅసెంబ్లీ కి  రానున్న ఏప్రిల్-మే నెలల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఇక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు విపక్షాలు విముఖత వ్యక్తం చేశాయ్టి. ఒకవేళ ఇందుకు ప్రయత్నించినా పెద్దగా ప్రయోజనం ఉండదని ఇవి భావించాయి. ఇటీవల పుదుచ్చేరిని సందర్శించిన కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కూడా ఇక్కడ రాజకీయ కార్యక్రమాల్లోచురుకుగా  పాల్గొనకుండా మత్స్య కారులకు సంబంధించిన ఈవెంట్లకు హాజరయ్యారు. మొత్తానికి పుదుచ్చేరి లో రాష్ట్రపతి పాలన విధించవచునన్న ఊహాగానాలు నిజమయ్యాయి.  రాష్ట్రపతి పాలన కు  కేంద్ర మంత్రివర్గం ఆమోద ముద్ర వేయడం తాజా పరిణామం.

Also Read:

పాలమూరు జిల్లాలో దారుణం..! చిన్న పిల్లాడని చూడకుండా కడతేర్చారు కర్కోటకులు.. కిడ్నాప్ గురైన బాలుడి దారుణ హత్య..!

పింక్ బాల్ టెస్ట్: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్.. రెండు మార్పులతో బరిలోకి టీమిండియా..