Union Cabinet approves: కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం.. ఏపీతోపాటు మరో నాలుగు రాష్ట్రాలకు 4జీ కనెక్టివిటీ..

|

Nov 17, 2021 | 5:42 PM

మోడీ క్యాబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. కేబినెట్ తీసుకున్న నిర్ణయాలను కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ మీడియాకు తెలిపారు. క్యాబినెట్‌లో..

Union Cabinet approves: కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం.. ఏపీతోపాటు మరో నాలుగు రాష్ట్రాలకు 4జీ కనెక్టివిటీ..
Follow us on

మోడీ క్యాబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. కేబినెట్ తీసుకున్న నిర్ణయాలను కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ మీడియాకు తెలిపారు. క్యాబినెట్‌లో తీసుకున్న నిర్ణయం గురించి సమాచారం ఇస్తూ.. ప్రస్తుతం మొబైల్ కనెక్టివిటీ లేని ప్రదేశాలను టెలికాం సౌకర్యంతో అనుసంధానించాలని ప్రభుత్వం నిర్ణయించిందని అనురాగ్ ఠాకూర్ తెలిపారు. ఇది కాకుండా, గ్రామీణ ప్రాంతాలను రోడ్లతో అనుసంధానించడానికి ప్రధాన మంత్రి గ్రామీణ సడక్ యోజన మళ్లీ ప్రారంభించబడుతుంది. దీంతో దేశంలోని గ్రామాలు, గ్రామాలు రోడ్ల ద్వారా అనుసంధానం కానున్నాయి.

మొబైల్ టవర్ కనెక్టివిటీ కింద పలు రాష్ట్రాలను ఎంపిక చేసింది కేంద్ర కేబినెట్. ఐదు రాష్ట్రాల్లోని 44 జిల్లాల్లో 7000 గ్రామాలకు ఈ సౌకర్యం అందుబాటులోకి రానుంది. ఇందులో మన ఆంధ్రప్రదేశ్‌తోపాటు  ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, మహారాష్ట్ర, ఒడిశా రాష్ట్రాలు ఉన్నాయి. మొబైల్ కనెక్టివిటీ ఈ రాష్ట్రాలలోని గ్రామాలు అనుసంధానించబడతాయి. ఈ గ్రామాల్లో 4జీ మొబైల్ సౌకర్యం అందుబాటులోకి రానుంది. ఈ ప్రాజెక్ట్ దాదాపు రూ.6466 కోట్లతో చేపడుతున్నారు.

ప్రధాన మంత్రి గ్రామ్ సడక్ యోజన మూడవ దశ.. 

రోడ్డు కనెక్టివిటీ గురించి మాట్లాడుతూ.. ప్రధాన్ మంత్రి గ్రామ్ సడక్ యోజనలో భాగంగా మొదటి, రెండు దశలు గతంలో అమలు చేయబడ్డయన్నారు. ఇప్పుడు దాని మూడో దశ ప్రారంభం కానుంది. దీని కింద దేశంలో ఇంకా రోడ్డు సౌకర్యం లేని గ్రామాలు, గ్రామీణ ప్రాంతాలను అనుసంధానం చేస్తారు. పెద్ద వంతెనలతో సహా అటవీ ప్రాంతాలు, కొండ ప్రాంతాలు, నదులు, వాగులపై ఈ రహదారిని నిర్మించనున్నారు.

33822 కోట్ల బడ్జెట్

ప్రధాన మంత్రి గ్రామీణ సడక్ యోజన ఫేజ్-1, ఫేజ్-2 మరియు లెఫ్ట్ వింగ్ తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల్లో (RCPLWEA) రోడ్ కనెక్టివిటీ స్కీమ్‌ల కొనసాగింపుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఇందుకు రూ.33,822 కోట్ల అంచనా వ్యయం అవుతుందని ఇందులో కేంద్రం వాటా రూ.22,978 కోట్లు ఉంటుందని చెప్పారు.

ఐదు రాష్ట్రాలలో యూనివర్సల్ సర్వీస్ ఆబ్లిగేషన్ ఫండ్ ( USOF) ద్వారా కవర్ చేయబడని 7,287 గ్రామాలకు మొబైల్ కనెక్టివిటీ అందించబడుతుంది. దీని కోసం ₹ 6,466 కోట్లు ఖర్చు అవుతుంది.  ఈ ప్రతిపాదనకు బుధవారం కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపిందని సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ మీడియాకు తెలిపారు.

ఇవి కూడా చదవండి: Air pollution: ఉద్యోగులు ప్రజా రవాణాను వినియోగించండి.. ప్రభుత్వం కీలక ఆదేశాలు..

PM Narendra Modi: ఈనెల 19న యూపీ పర్యటనకు ప్రధాని మోదీ.. ఎందుకోసమంటే..