Aadhaar Card: ఆధార్ కార్డుదారులకు అలర్ట్.. ఇకపై ఆన్‌లైన్‌ అథెంటికేషన్స్‌కు ఆధార్‌ కార్డుదారుడి అనుమతి తప్పనిసరి

|

Jan 24, 2023 | 3:21 PM

ఆధార్‌కార్డు, వాటి కాపీలను ఎక్కడపడితే అక్కడ వదిలేయడం, ఆధార్‌ వివరాలను ఇతరులతో పంచుకోవడంపై యూనిక్‌ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (యూఐడీఏఐ) తాజాగా మార్గదర్శకాలను..

Aadhaar Card: ఆధార్ కార్డుదారులకు అలర్ట్.. ఇకపై ఆన్‌లైన్‌ అథెంటికేషన్స్‌కు ఆధార్‌ కార్డుదారుడి అనుమతి తప్పనిసరి
UIDAI Guidelines
Follow us on

బ్యాంక్‌ అకౌంట్‌ ఓపెన్‌ చేయడం నుంచి సంక్షేమ పథకాలను పొందడానికి, ఇన్‌కమ్ ట్యాక్స్ ఫైలింగ్ వరకు ప్రతి దానికి ఆధార్‌ తప్పనిసరైపోయింది. ఐతే ఆధార్‌కార్డు, వాటి కాపీలను ఎక్కడపడితే అక్కడ వదిలేయడం, ఆధార్‌ వివరాలను ఇతరులతో పంచుకోవడంపై యూనిక్‌ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (యూఐడీఏఐ) తాజాగా మార్గదర్శకాలను జారీ చేసింది. ఆధార్‌ నెంబర్‌ను సోషల్‌ మీడియా, ఇతర బహిరంగ వేదికల్లో ప్రదర్శించడం వంటి వాటివి చేయొద్దంటూ ప్రజలను అప్రమత్తం చేసింది. అవసరం అయితే తప్ప ఇతరులతో ఆధార్‌ వివరాలను పంచుకోవద్దంటూ సూచించింది. అధార్ అథెంటికేషన్ చేసే ముందు తప్పనిసరిగా ఆధార్ కార్డుదారుడి అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని యూఐడీఏఐ పేర్కొంది. ఆధార్ అథెంటికేషన్ చేయడానికి ముందు సంబంధిత వ్యక్తి నుంచి పేపర్ ద్వారా లేదా ఎలక్ట్రానిక్ రూపంలో  అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని యూఐడీఏఐ మార్గదర్శకాలను జారీ చేసింది.

ఆధార్ ఆన్‌లైన్ అథెంటికేషన్స్ చేసే రిక్వెస్టింగ్ ఎన్‌టిటీస్ కచ్చితంగా సదరు కస్టమర్ నుంచి ముందుగా అనుమతి తీసుకోవల్సి ఉంటుంది. ఆధార్‌ నుంచి ఏ విధమైన డేటాను తీసుకుంటున్నారో, దేని కోసం తీసుకుంటున్నారో ఆవివరాలను ఆధార్‌ కార్డుదారుడికి తెలియజేయాలని యూఐడీఏఐ తెలిపింది. సమ్మతితో సహా ప్రామాణీకరణ లావాదేవీల రికార్డులు ఆధార్ నిబంధనల ప్రకారం అనుమతించబడిన సమయ వ్యవధిలో మాత్రమే స్టోర్‌ చేయాలని పేర్కొంది. నిర్ణీత కాల పరిమితి ముగిసిన తర్వాత ఆధార్ నిబంధనల ప్రకారం ఈ లాగ్‌లను తప్పనిసరిగా తొలగించాలి. కచ్చితంగా ఆధార్ వివరాలకు మాస్కింగ్ ఉండాలి. అంటే ఆధార్‌లో తొలి 8 నెంబర్లు కనిపించకుండా మాస్క్‌ వేస్తారు. ఇలా చేయడం వల్ల డేటా ప్రైవసీకి ఇబ్బంది ఉండదు. అంతేకాకుండా అనుమతి లేనిదే రిక్వెస్టింగ్ ఎన్‌టిటీస్ ఆధార్ వివరాలను స్టోర్ చేయడం చట్టరీత్యా నేరంగా పరిగణించబడతుందని యూఐడీఏఐ తెల్పింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.