శాసన మండలి లోకి ఉద్ధవ్ థాక్రే ! సీఎం సీటు పదిలం

మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉధ్ధవ్ థాక్రే శాసన మండలికి ఏకగ్రీవంగా ఎన్నిక కానున్నారు. ఈ నెల 21 న మండలి ఎన్నికలు జరగనున్నాయి. తమ ఇద్దరు అభ్యర్థుల్లో ఒకరిని ఉపసంహరించుకుంటున్నామని కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది.

శాసన మండలి లోకి ఉద్ధవ్ థాక్రే ! సీఎం సీటు పదిలం

Edited By:

Updated on: May 11, 2020 | 10:41 AM

మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉధ్ధవ్ థాక్రే శాసన మండలికి ఏకగ్రీవంగా ఎన్నిక కానున్నారు. ఈ నెల 21 న మండలి ఎన్నికలు జరగనున్నాయి. తమ ఇద్దరు అభ్యర్థుల్లో ఒకరిని ఉపసంహరించుకుంటున్నామని కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. మొత్తం 9 సీట్లలో తమ అభ్యర్థులు అయిదుగురు మాత్రమే ఉంటారని రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ బాలా సాహెబ్ థోరట్ తెలిపారు. బీజేపీ నలుగురు అభ్యర్థులను నిలబెట్టింది. గత నెల 24 తో ఎమ్మెల్సీల పదవీకాలం ముగిసింది. మండలిలోని తొమ్మిది స్థానాలకూ ఎన్నిక ఏకగ్రీవం కావాలని థాక్రే కోరుతున్నారు. కరోనాపై పోరును కొనసాగించేందుకు తనకు ఎక్కువ సమయం అవసరమని ఆయన భావిస్తున్నారని శివసేన నేత సంజయ్ రౌత్ తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికలకు నామినేషన్ల దాఖలుకు గడువు రేపటితో ముగియనుంది. స్క్రూటినీ కూడా రేపే ! నామినేషన్ల ఉపసంహరణకు ఈ నెల 14 చివరితేదీ ! థాక్రే ఉభయ సభల్లో దేనిలోనూ సభ్యుడు కాని  విషయం గమనార్హం. ఎమ్మెల్సీగా ఎన్నికయితే ఇక ఆయన పదవి పదిలంగా ఉంటుంది.