Udhayanidhi Stalin: దక్షిణాదిన మరో వారసుడొచ్చాడు.. మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సీఎం తనయుడు..

Udhayanidhi Stalin: ఉదయనిధి స్టాలిన్‌కి పాలిటిక్స్ కొత్తేమీ కాదు. సినిమాల్లో హీరోగా చేస్తూనే రీసెంట్ ఎలక్షన్స్‌లో చురుగ్గా క్యాంపెయిన్ చేసి.. ప్రిన్స్‌ ఆఫ్ డీఎంకే అనిపించుకున్నారు. నెక్ట్స్ జెనరేషన్ పొలిటీషియన్‌గా ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయ్యారు.

Udhayanidhi Stalin: దక్షిణాదిన మరో వారసుడొచ్చాడు.. మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సీఎం తనయుడు..
Udhayanidhi Stalin

Updated on: Dec 14, 2022 | 12:13 PM

ఉదయనిధి స్టాలిన్‌కి పాలిటిక్స్ కొత్తేమీ కాదు. సినిమాల్లో హీరోగా చేస్తూనే రీసెంట్ ఎలక్షన్స్‌లో చురుగ్గా క్యాంపెయిన్ చేసి.. ప్రిన్స్‌ ఆఫ్ డీఎంకే అనిపించుకున్నారు. నెక్ట్స్ జెనరేషన్ పొలిటీషియన్‌గా ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయ్యారు. ఇప్పుడు నాన్న క్యాబినెట్‌లో కుర్చీ వేసుకుని కూర్చున్నారు. మంత్రిగా అన్ని విధాలా ఉదయనిధి అర్హుడే అంటోంది పార్టీ క్యాడర్. అయితే అనూహ్యంగా క్రీడాశాఖ మంత్రిగా బాధ్యతలు అప్పగించారు సీఎం స్టాలిన్. దాంతో ఇవాళ ఉదయం తమిళనాడు క్రీడా శాఖా మంత్రిగా ఉదయనిధి స్టాలిన్ ప్రమాణ స్వీకారం చేశారు. ఆ రాష్ట్ర గవర్నర్ ఉదయనిధిచే మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించారు.

దక్షిణాదిలో వారసత్వం కొత్తేమీ కాదు. 2014-19 చంద్రబాబు గవర్నమెంట్‌లో ఐటీ మంత్రిగా.. తనయుడు నారా లోకేష్ పనిచేశారు. ఐటీ కంపెనీల్ని ఏపీకి రప్పించడానికి దేశదేశాలు పర్యటించారు. ఇక తెలంగాణలో బీఆర్‌ఎస్ యువరాజు కేటీఆర్ ఐటీ శకమైతే ఇప్పటికీ కంటిన్యూ ఔతూనే ఉంది. హైదరాబాద్‌లో ఐటీ హబ్ నిర్మాణంతో మొదలుపెడితే… ఐటీ మంత్రిగా కేటీఆర్ జర్నీ అండర్‌లైన్ చేసుకోదగ్గదే. హైటెక్ నగరం హైదరాబాద్‌ని ఐటీ రంగంలో మేటిగా తీర్చి దిద్దుతున్నారు. ఇదే తరహాలో ఉదయనిధికి కూడా ఐటీ మినిస్ట్రీనో లేదంటే ఇంకేదైనా కీలక పోర్ట్ ఫోలియోనే ఇస్తారనుకున్నారు. కానీ క్రీడా శాఖతో సరిపెట్టారు సీఎం స్టాలిన్.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..