యూపీ బీజేపీలో మరో విషాదం చోటుచేసుకుంది. రాష్ట్రానికి చెందిన ఎమ్మెల్యే జన్ మేజయ్‌సింగ్ కన్నుమూశారు. ఆయన వయస్సు 75 ఏళ్లు. గురువారం అర్ధరాత్రి గుండెపోటు రావడంతో.. వెంటనే ఆయన్ను స్థానిక ఆస్పత్రికి తరలించారు. అనంతరం అక్కడి నుంచి డాక్టర్ రాం మనోహర్ లోహియా ఆస్పత్రికి తరలించారు. ఈ క్రమంలో ఫేస్ మేకర్ అమరుస్తుండగా హార్ట్ స్ట్రోక్‌తో మరణించారు. ఈ విషయాన్ని డాక్టర్ విక్రం సింగ్ తెలిపారు. కాగా, ఎమ్మెల్యే జన్ మేజయసింగ్ మృతిపట్ల సీఎం యోగీ ఆదిత్యానాథ్ ఆయన కుటుంబానికి సంతాపాన్ని తెలియజేశారు.
నియోజకవర్గ అభివృద్ధికి, పేద ప్రజల అభ్యున్నతికి ఎంతో కృషి చేశారని.. ఆయన లేని లోటు తీరనిదన్నారు.
Lucknow: Janmejai Singh (in file pic), BJP MLA from Sadar, Deoria passed away last night due to a heart attack. He was 75 years old. pic.twitter.com/gdnxXi5z7V
— ANI UP (@ANINewsUP) August 21, 2020