తమిళనాట ఉగ్ర కలకలం.. ఇద్దరు అనుమానితుల అరెస్ట్

తమిళనాడులో ఉగ్రవాదులు ప్రవేశించారన్న ఇంటలిజెన్స్ హెచ్చరికలు.. రాష్ట్రంలోని ప్రజలకు కునుకు లేకుండా చేస్తోంది. కేరళలో గురువారం ఇద్దరు లష్కరే తోయిబా ఉగ్రవాదులను పోలీసులు అరెస్ట్ చేశారు. సిట్ బృందం వారిని ఇప్పటికే విచారిస్తోంది. పట్టుబడ్డ ఇద్దరికి పాకిస్థాన్‌కు చెందిన లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థతో సంబంధాలు ఉన్నట్లు గుర్తించారు. ఈ నేపథ్యంలో తమిళనాడులోకి ఆరుగురు ఉగ్రవాదులు చొరబడ్డారన్న తాజాగా వారిని తమిళనాడులోని కోయంబత్తూరుకు తరలించింది. తమిళనాడులోకి ఆరుగురు ఉగ్రవాదులు ప్రవేశించారన్న వార్తలు రావడంతో వారిని కోయంబత్తూరుకు రప్పించి […]

తమిళనాట ఉగ్ర కలకలం.. ఇద్దరు అనుమానితుల అరెస్ట్

Edited By:

Updated on: Aug 25, 2019 | 2:12 PM

తమిళనాడులో ఉగ్రవాదులు ప్రవేశించారన్న ఇంటలిజెన్స్ హెచ్చరికలు.. రాష్ట్రంలోని ప్రజలకు కునుకు లేకుండా చేస్తోంది. కేరళలో గురువారం ఇద్దరు లష్కరే తోయిబా ఉగ్రవాదులను పోలీసులు అరెస్ట్ చేశారు. సిట్ బృందం వారిని ఇప్పటికే విచారిస్తోంది. పట్టుబడ్డ ఇద్దరికి పాకిస్థాన్‌కు చెందిన లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థతో సంబంధాలు ఉన్నట్లు గుర్తించారు. ఈ నేపథ్యంలో తమిళనాడులోకి ఆరుగురు ఉగ్రవాదులు చొరబడ్డారన్న తాజాగా వారిని తమిళనాడులోని కోయంబత్తూరుకు తరలించింది. తమిళనాడులోకి ఆరుగురు ఉగ్రవాదులు ప్రవేశించారన్న వార్తలు రావడంతో వారిని కోయంబత్తూరుకు రప్పించి విచారణ చేపడుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే అలర్టైన పోలీసులు.. అన్ని ప్రధాన పట్టణాల్లో భారీ ఎత్తున తనిఖీలు నిర్వహిస్తున్నారు. గతంలో కోయంబత్తూరులో ఉగ్రవాదుల దాడులు జరగడంతో మరోసారి అదే తరహా దాడులు జరుగుతాయమేనని ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. రాష్ట్రంలోని ఆలయాలు, చర్చీలపై దాడులు జరిగే అవకాశం ఉందన్న నేపథ్యంలో పటిష్ట భద్రతను ఏర్పాటు చేశారు.